Chinmayi : వారి భార్య‌లు చాలా గొప్ప‌వారంట‌.. చిన్మయి ఏంటి ఇలా అనేసింది..!

Authored By Sam C | The Telugu News | Updated on : 17 January 2022, 5:00 pm

Chinmayi : సింగ‌ర్ చిన్మయికి సామాజిక స్పృహ చాలా ఎక్కువ‌. స‌మాజంలో మ‌హిళ‌కు జ‌రుగుతున్న అన్యాయాల‌పై త‌న‌దైన శైలిలో స్పందిస్తూ ఉంటుంది. సమాజంలో మహిళల పట్ల జరుగుతున్న దాడులు.. వారు ఎదుర్కోంటున్న వేధింపుల గురించి ట్విట్టర్ వేదికగా ప్రశ్నిస్తూ ఉంటారు. అయితే తాజాగా ద‌ర్శ‌కులు సుధా కొంగ‌రకి నెటిజ‌న్ నుండి ఆస‌క్తికర ప్ర‌శ్న ఎదురైంది. మీ భర్త చాలా గ్రేట్.. మిమ్మల్ని ఇలా పని చేసుకోవడానికి ఒప్పుకున్నారు. బయటకు పంపారు అని అన్నాడు. ఈ మాటలకు దర్శకురాలు సుధా కొంగర గట్టి సమాధనం ఇచ్చింది. నేను నాకు ఇష్టమైన పని చేయడానికి నాకు ఎవరూ పర్మిషన్ గానీ.. అంగీకారాన్ని గానీ ఇవ్వలేదు. నాకు నచ్చింది నేను చేస్తున్నాను అంటుంటారు సుధా కొంగర.

ఇక ఇదే విషయాన్ని సింగర్ చిన్మయి అందుకున్నారు. తన స్టైల్లో కౌంటర్లు వేశారు. మామూలుగానే ఇలాంటి విషయాల్లో చిన్మయి ముందుంటారు. స్త్రీలు, పురుషులు అనే తేడా వచ్చిన, లింగ వివక్ష కనిపించినా కూడా చిన్మయి తన స్టైల్లో కౌంటర్లు వేస్తుంటారు. అలా సుధా కొంగర చెప్పిన మాటలకు తన శైలిని జోడించి మరీ కౌంటర్ వేశారు. సినిమా దర్శకులు, నటులు, సంగీత దర్శకులు, క్రియేటర్స్, లాయర్స్, డాక్టర్స్, పొలిటీషియన్స్ భార్యలు నిజంగానే గ్రేట్.. మీరు మీ భర్తలకు పని చేసుకునే స్వేచ్చను, పర్మిషన్‌ను ఇచ్చారు అంటూ సెటైర్లు వేసింది చిన్మ‌యి.

chinmayi  comments in viral

chinmayi  comments in viral

Chinmayi : చిన్మ‌యినా, మ‌జాకానా?

చిన్న‌యి కామెంట్స్‌పై నెటిజ‌న్స్ నుండి మిశ్ర‌మ స్పంద‌న ల‌భిస్తుంది. బాగా చెప్పావు అని కొంద‌రు కామెంట్స్ చేస్తుండ‌గా, మ‌రి కొంద‌రు ఆమె కామెంట్స్‌ని త‌ప్పు ప‌డుతున్నారు. ఇదిలా ఉంటే చిన్మ‌యి ఆ మ‌ధ్య తమిళ రైటర్ వైరముత్తు తనను లైం గా వేధించాడంటూ సంచలన ఆరోపణలతో మీటూ ఉద్యమంలో యాక్టివ్‌గా పాల్గొన్న సంగతి తెలిసిందే. కేవలం సింగర్ గానే కాకుండా సామాజిక అంశాలపై గళం ఎత్తుతూ సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటారు సింగర్ చిన్మయి.

Sam C

No bio available for this author.

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp