Chinmayi : జాకెట్ తీసేయమంటూ కామెంట్స్.. వారికి గ‌ట్టిగా ఇచ్చిప‌డేసిన చిన్మయి..! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Chinmayi : జాకెట్ తీసేయమంటూ కామెంట్స్.. వారికి గ‌ట్టిగా ఇచ్చిప‌డేసిన చిన్మయి..!

 Authored By ramu | The Telugu News | Updated on :17 January 2026,2:15 pm

ప్రధానాంశాలు:

  •  Chinmayi : జాకెట్ తీసేయమంటూ కామెంట్స్.. వారికి గ‌ట్టిగా ఇచ్చిప‌డేసిన చిన్మయి..!

Chinmayi : ప్రముఖ గాయని, డబ్బింగ్ ఆర్టిస్ట్ చిన్మయి శ్రీపాద సోషల్ మీడియా వేదికగా సామాజిక అంశాలపై తరచూ తన అభిప్రాయాలను వ్యక్తం చేస్తూ ఉంటారు. ముఖ్యంగా మహిళలకు సంబంధించిన సమస్యలు, లింగ సమానత్వం, వ్యక్తిగత స్వేచ్ఛ వంటి విషయాల్లో ఆమె గళం ఎప్పుడూ స్పష్టంగా వినిపిస్తుంది. తాజాగా మహిళల దుస్తుల అంశంపై చెలరేగిన వివాదంలో కూడా చిన్మయి తన స్పందనతో మరోసారి వార్తల్లో నిలిచారు.ఇటీవల ఒక ప్రముఖ నటుడు మహిళల వస్త్రధారణపై చేసిన వ్యాఖ్యలు పెద్ద దుమారానికి దారితీశాయి. ఈ వ్యాఖ్యలను ఖండిస్తూ సోషల్ మీడియాలో పలువురు స్పందించగా, చిన్మయి కూడా వరుస పోస్టులతో తన అసంతృప్తిని వ్యక్తం చేశారు. ఇదే అంశంపై స్టార్ యాంకర్ అనసూయ స్పందించడం, ఆమె వ్యాఖ్యలు చర్చకు దారితీయడం జరిగింది.

Chinmayi జాకెట్ తీసేయమంటూ కామెంట్స్ వారికి గ‌ట్టిగా ఇచ్చిప‌డేసిన చిన్మయి

Chinmayi : జాకెట్ తీసేయమంటూ కామెంట్స్.. వారికి గ‌ట్టిగా ఇచ్చిప‌డేసిన చిన్మయి..!

Chinmayi ఇచ్చి ప‌డేసింది..

అనసూయ మహిళల డ్రెస్సింగ్‌పై చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా వ్యతిరేకించగా, ఆ స్పందనకు మద్దతు పలికినవారూ ఉన్నారు, విమర్శించినవారూ ఉన్నారు.ఈ వివాదం మరింత ముదిరిన నేపథ్యంలో బీజేపీ మహిళా నేత ప్రభ గౌడ తాజాగా ఒక వీడియో విడుదల చేశారు. ఆ వీడియోలో ఆమె అనసూయపై పరోక్ష వ్యాఖ్యలు చేస్తూ, “సినీ పరిశ్రమలో అనసూయకంటే ఎంతో సంస్కారవంతమైన మహిళలు ఉన్నారు. వారిని చూసి ఆమె నేర్చుకోవాలి” అంటూ వ్యాఖ్యానించారు. అంతేకాదు, “అనసూయ చీర కట్టుకోవాలి అని భావించే వారందరూ ఆమెకు ఒక చీర పంపండి” అంటూ ‘చీర ఛాలెంజ్’ పేరిట పిలుపునిచ్చారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వేగంగా వైరల్‌గా మారింది.

ఈ పరిణామాలపై చిన్మయి తీవ్రంగా స్పందించారు. సోషల్ మీడియా వేదికగా ఆమె బీజేపీ నేత వీడియోను ఉద్దేశిస్తూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. మహిళల దుస్తుల విషయంలో ఒక మహిళే మరో మహిళను టార్గెట్ చేయడం బాధాకరమని పేర్కొన్నారు. దుస్తుల ఎంపికపై స్త్రీలు ఎలాంటి సిగ్గు పడాల్సిన అవసరం లేదని, అలాంటి స్వేచ్ఛ కోసం పోరాడాల్సిన సమయంలో మహిళలనే వేధించే విధమైన ఆలోచనలు రావడం ఆశ్చర్యంగా ఉందని ఆమె అభిప్రాయపడ్డారు. రాజకీయ నేతలకు స్త్రీల వ్యక్తిగత ఎంపికలపై వ్యాఖ్యానించేందుకు ఇంత సమయం ఎలా దొరుకుతుందన్న ప్రశ్నను కూడా ఆమె లేవనెత్తారు.చిన్మయి చేసిన ఈ పోస్ట్ ప్రస్తుతం నెట్టింట విస్తృతంగా చర్చకు దారితీస్తోంది.

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది