Samantha : ఏయ్ సమంత గురించి మీకేం తెలుసురా..చిన్మయి ఫుల్ ఫైర్..!!

Authored By Breaking News | The Telugu News | Published on: August 16, 2023, 12:00 pm

Samantha : ఆగస్టు 15వ తారీకు హైదరాబాద్ లో విజయ్ దేవరకొండ హీరోగా సమంత హీరోయిన్ గా నటించిన “ఖుషి” సినిమా మ్యూజికల్ నైట్ వేడుక అంగరంగ వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమంలో సింగర్స్ సిద్ శ్రీరామ్, చిన్మయి ఇతర సింగర్స్ ఇంకా మ్యూజిక్ డైరెక్టర్ హేషమ్ అబ్దుల్ వహాబ్ బృందం పాల్గొనడం జరిగింది. ఇంకా హీరో హీరోయిన్లతో పాటు ఆనంద్ దేవరకొండ, నవీన్ ఎర్నేని, రవిశంకర్, సీఈవో చెర్రీ పాల్గొన్నారు.

అయితే ఈ కార్యక్రమంలో భాగంగా హీరోయిన్ సమంత గురించి సింగర్ చిన్మయి మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు. ఖుషి మ్యూజికల్ కాన్సెర్ట్ లో చిన్మయి తన పాటలతో ఎంతగానో అలరించడం జరిగింది. ఉత్సాహంగా కార్యక్రమానికి వచ్చిన వారిలో జోష్ నింపి.. చివరిలో స్పీచ్ ఇచ్చింది. హీరోయిన్ సమంత పై చిన్మయి సంచలన వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఖుషి ఈవెంట్ లో చిన్మయి మాట్లాడుతూ… సమంతా నీ గురించి కొన్ని విషయాలు చెప్పుకోవాలి.

Chinmayi Serious On Samantha Haters At KUSHI Musical Concert

Chinmayi Serious On Samantha Haters At KUSHI Musical Concert

తెలుగులో నా డబ్బింగ్ కెరియర్ నీవల్లే ప్రారంభించడం జరిగింది. నువ్వు చాలా మందికి ఇన్స్పిరేషన్. చాలామంది అమ్మాయిలకు ఇంకా అబ్బాయిలకు.. నువ్వు హీరోవి. సమంత స్వతహాగాని ధైర్యవంతురాలు. చాలా మంచి మనసున్న అమ్మాయి. ఎవరేమనుకున్నా మానవతవాది. సమంతాను ద్వేషించేవారు ఈ విషయాలు తెలుసుకోవాలి. ఆ తర్వాత అమృత సినిమాలోని ఏ జీవి వరమో నీవు పాటను..చిన్మయి.. హీరోయిన్ సమంతపై పాడి తన ప్రేమను చాటుకుంది. అనంతరం చిన్మయి పాటలకు ఇంకా మాటలకు సమంత ఉప్పొంగి ఆమెను కౌగిలించుకోంది.

Breaking News

No bio available for this author.

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp