Home » Entertainment » Chinmayi Comments On Celebs Divorce
Entertainment

Chinmayi : ధ‌నుష్-ఐశ్వ‌ర్య విడాకుల‌పై చిన్మయి ఇలా కామెంట్ చేసిందేంటి..!

Authored By
Sam C
The Telugu News | Updated on: January 20, 2022 7:59 pm
Advertisement

Chinmayi : సింగ‌ర్ , డ‌బ్బింగ్ ఆర్టిస్ట్ చిన్మయి ఇటీవ‌లి కాలంలో ప్ర‌తి విష‌యంపై త‌న‌దైన శైలిలో స్పందిస్తూ ఉంటుంది. సినిమా వాళ్ల గురించి కాని లేదంటే మహిళ‌ల గురించి ఎవ‌రైన త‌ప్పుడు వ్యాఖ్య‌లు చేస్తే చిన్మయి రెచ్చిపోయి కామెంట్స్ చేస్తుంటుంది. తాజాగా ఓ నెటిజ‌న్.. “ఏది ఏమైనా మన పేరెంట్స్ చాలా గ్రేట్ రా! ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా అడ్జస్ట్ అవుతారు. ఈ సినిమా వాళ్లు చూడు. ఎంత డబ్బు ఉన్నా ఉపయోగం లేదు” అని ఒకరు చేసిన ట్రోల్ చిన్మయి దృష్టికి వచ్చింది. ‘డబ్బులు ఉన్నా, లేకపోయినా తల్లిదండ్రులు ఉన్నారా? గ్రేట్’ అంటూనే ఆమె గట్టిగా బదులిచ్చారు.ఇక ఇలాంటి కామెంట్స్ ఆపండ‌ని గ‌ట్టిగా బ‌దులిచ్చింది.

Advertisement

జంట క‌లిసి ఉండాలి లేద‌నేది డ‌బ్బుకి సంబంధం ఉండ‌దు. ఉన్న కొంచెం డబ్బును కూడా తాగి కుటుంబాలను నాశనం చేసే మొగుళ్లతో ఆడవాళ్లు కాపురం చేసే కర్మ ఉంది ఇంకా. రోజు తన్నులు తిని, డబ్బులు దాచిపెట్టి పిల్లల్ని చదివించి పెంచిన తల్లులే ఈ సమాజంలో ఎక్కువ. కట్నం తీసుకుంటూ, పురిటి ఖర్చులు కూడా భరించలేక ‘ట్రెడిషన్’ (ఆచారం) అని వాగుడు, రకరకమైన కట్నాలు డిమాండ్ చేయడం! గృహ హింస నుంచి ఆర్ధిక, భావోద్వేగ దాడిని సహిస్తూ జీవించే జీవితం ఒక జీవితమే కాదు.

chinmayi comments on celebs divorce

Advertisement

Chinmayi : ఏదో ఈ జ‌న్మ‌కు రాసింది ఇంతే…

ఇలాంటి త్యాగాలు చేసి చాలా మంది కాపురం చేస్తున్నారు. మీకు నిజంగా ధైర్యం ఉంటే… ముందు మీ తల్లిదండ్రులను, ముఖ్యంగా మీ తల్లిని అడగండి. ‘పెళ్లి చేసుకుని సంతోషంగా ఉన్నారా?’ అని! చాలామంది ‘ఎదో ఈ జన్మకు రాసింది ఇంతే’ అని చెబుతారు. సమాజం కోసం, పిల్లల కోసం చాలా మంది తల్లిదండులు ఒకరినొకరు భరించారు. నిజంగా అది విచారకరం” అని చిన్మయి పేర్కొన్నారు. రీసెంట్‌గా ఈ అమ్మ‌డు సుధా కొంగర కామెంట్స్‌పై కూడా త‌న‌దైన శైలిలో స్పందించి వార్త‌ల‌లో నిలిచింది.

Sam C

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి