
Chiranjeevi About Music Director Koti And His Son Rajeev Salur
Chiranjeevi చిన్న సినిమా పెద్ద సినిమా అనే తేడా లేకుండా చిరంజీవి అందరికీ సాయమందిస్తాడు. చేతనైనంతలో సాయం చేస్తాడు. అలా సంగీత దర్శకుడు కోటి తనయుడు రాజీవ్ సాలూర్ హీరోగా వస్తోన్న చిత్రం ఫస్ట్ లుక్, టైటిల్‌ను చిరంజీవి విడుదల చేశాడు. టైగర్ హిల్స్ ప్రొడక్షన్, స్వస్తిక ఫిలిమ్స్ పతాకాలపై కోటి తనయుడు రాజీవ్ సాలూర్ హీరోగా ,వాణి విశ్వనాథ్ కూతురు వర్ష విశ్వనాథ్ హీరోయిన్ గా , సదన్, లావణ్య, రాజా రవీంద్ర, రాజా శ్రీ నటీనటులు గా కిట్టు నల్లూరి దర్శకత్వంలో గాజుల వీరేష్ (బళ్లారి) నిర్మిస్తున్న ప్రొడక్షన్ నెంబర్ 1’ చిత్రం “11:11”
మూవీ ఫస్ట్ లుక్, టైటిల్ విడుదల చేసిన చిరు అనంతరం మాట్లాడుతూ..‘ఈ రోజు చాలా మంచి రోజు. నా మరో సినిమా ‘బోలా శంకర్’ కూడా ఈ రోజు ప్రారంభం కాబడింది. నిన్న అర్ధ రాత్రి వరకు కూడా నేను కోటి గారు ఇంట్లోనే షూటింగ్ చేయడం జరిగింది. అయినా కూడా ఈ కార్యక్రమానికి రావడానికి ప్రధాన కారణం కోటి గారు. ఎందుకంటే కోటి తో నాకున్న అనుబంధం అంతా ఇంతా కాదు. నా సినిమా అనేసరికి ప్రత్యేకించి అన్ని రకాల హంగులతో ఆయన ఎంతో ప్రత్యేకమైన శ్రద్ద తీసుకొని సంగీతం అందించాడు.
Chiranjeevi About Music Director Koti And His Son Rajeev Salur
ముఖ్యంగా చెప్పాలంటే నా విజయానికి,నా ఎదుగుదలకి సింహభాగం రాజ్ – కోటి లదే అని చెప్పాలి. ఇద్దరు కూడా నా సినిమాకు సంబంధించిన సాంగ్స్ ను ప్రత్యేకంగా 80, 90 దశకంలో హిట్లర్, రిక్షావోడు, లాంటి సినిమాలు 12 వరకు చేయడం జరిగింది. సుమారు 60 సాంగ్స్ అంటే నాకు 90% సూపర్ డూపర్ హిట్స్ ఇచ్చాడు. ఇంత మంచి హిట్ సాంగ్స్ ఇచ్చినటువంటి కోటి గారి ఋణం తీర్చుకోలేక పోయానే అనే బాధ ఉండేది.కానీ ఈ రోజు కోటి గారి కొడుకు రాజీవ్ ను ఆశీర్వదించడానికి వచ్చినందుకు నాకు చాలా సంతోషం వేసింది.కోటి గారి ఋణం ను ఇలా తీర్చుకోవడానికి ఈ వేడుక నాకు వేదిక అయింది.
సాలూరు రాజేశ్వరరావు గారు ఎంతో గొప్ప లెజెండరీ సంగీత దర్శకుడు తన వారసత్వాన్ని పుణికి పుచ్చుకుని వచ్చిన కోటి గారు కూడా తండ్రి బాటలో పయనించి సంగీతంలో తండ్రికి తగ్గ తనయుడిగా రెండు దశాబ్దాల పాటు అద్భుతమైన సంగీతాన్ని ప్రేక్షకులకు అందించాడు. ఈ రోజుకి కూడా తనంటే నాకు ఇన్స్పిరేషన్. చాలామంది తెరమరు గవుతున్నా..తను మాత్రం బుల్లితెరపై కూడా తన ప్రస్థానాన్ని మళ్ళీ కొనసాగిస్తూ.. కాంటెంపరరీ గా ఉంటూ ఔత్సాహికులను ఉత్సాహపరుస్తూ తను మంచి మనసుతో ముందుకు వెళ్తున్నారు.అతనిలో ఉన్న పాజిటివ్ నెస్ తనని ముందుకు నడిపిస్తుంది తన ఇద్దరు కొడుకులలో ఒకరిని సంగీత దర్శకుడిగా మరొకరిని నటుడుగా పరిచయం చేసి ఇండస్ట్రీలో ఇరువైపులా ఉండేలా తను ప్లాన్ చేసుకున్నాడు’ అంటూ సినిమా గురించి, కోటి గురించి చిరంజీవి చెప్పుకొచ్చాడు.
Rice | మన రోజువారీ ఆహారంలో అన్నం (బియ్యం) కీలకమైన భాగం. ఇది శరీరానికి తక్షణ శక్తిని అందించే ప్రధాన…
Montha Effect | ఆంధ్రప్రదేశ్ తీరంపై మొంథా తుఫాను (Cyclone Montha) బీభత్సం సృష్టిస్తోంది. ఇవాళ (అక్టోబర్ 28) సాయంత్రం లేదా…
Harish Rao | హైదరాబాద్‌లో బీఆర్ఎస్ పార్టీలో తీవ్ర విషాదం నెలకొంది. సిద్దిపేట బీఆర్ఎస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి తన్నీరు…
Brown Rice |బియ్యం తింటే లావు అవుతారనే భావన చాలా మందిలో ఉంది. అందుకే చాలామంది తెల్ల బియ్యానికి బదులుగా…
Health Tips | అక్టోబర్ నెలాఖరులో వాతావరణం క్రమంగా చల్లబడుతోంది. ఈ సీజన్ మార్పు సమయంలో చాలామంది దగ్గు, జలుబు,…
Chanakya Niti | ఆచార్య చాణక్యుడు ..కేవలం రాజకీయ చతురుడు మాత్రమే కాదు, ఆర్థిక జ్ఞానానికి ప్రతీక. వేల సంవత్సరాల…
Phone | కొత్త స్మార్ట్ఫోన్ కొనాలనుకునే వారికి మోటరోలా నుంచి మరో గుడ్ న్యూస్ వచ్చింది. రూ.15,000 బడ్జెట్లో పవర్ఫుల్…
Cancer Tips | నేటి వేగవంతమైన జీవనశైలి, ఆహారపు అలవాట్లు, ఒత్తిడి వంటి కారణాల వల్ల క్యాన్సర్, గుండెపోటు, స్ట్రోక్…
This website uses cookies.