Chiranjeevi : నా ఎదుగుదలకు కారణం.. రుణం తీర్చుకునేందుకు ఇలా.. చిరంజీవి కామెంట్స్ వైరల్ | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Chiranjeevi : నా ఎదుగుదలకు కారణం.. రుణం తీర్చుకునేందుకు ఇలా.. చిరంజీవి కామెంట్స్ వైరల్

 Authored By bkalyan | The Telugu News | Updated on :12 November 2021,7:10 pm

Chiranjeevi  చిన్న సినిమా పెద్ద సినిమా అనే తేడా లేకుండా చిరంజీవి అందరికీ సాయమందిస్తాడు. చేతనైనంతలో సాయం చేస్తాడు. అలా సంగీత దర్శకుడు కోటి తనయుడు రాజీవ్ సాలూర్ హీరోగా వస్తోన్న చిత్రం ఫస్ట్ లుక్, టైటిల్‌ను చిరంజీవి విడుదల చేశాడు. టైగర్ హిల్స్ ప్రొడక్షన్, స్వస్తిక ఫిలిమ్స్ పతాకాలపై కోటి తనయుడు రాజీవ్ సాలూర్ హీరోగా ,వాణి విశ్వనాథ్ కూతురు వర్ష విశ్వనాథ్ హీరోయిన్ గా , సదన్, లావణ్య, రాజా రవీంద్ర, రాజా శ్రీ నటీనటులు గా కిట్టు నల్లూరి దర్శకత్వంలో గాజుల వీరేష్ (బళ్లారి) నిర్మిస్తున్న ప్రొడక్షన్ నెంబర్ 1’  చిత్రం “11:11”

మూవీ ఫస్ట్ లుక్, టైటిల్ విడుదల చేసిన చిరు అనంతరం మాట్లాడుతూ..‘ఈ రోజు చాలా మంచి రోజు. నా మరో సినిమా ‘బోలా శంకర్’ కూడా ఈ రోజు ప్రారంభం కాబడింది. నిన్న అర్ధ రాత్రి వరకు కూడా నేను కోటి గారు ఇంట్లోనే షూటింగ్ చేయడం జరిగింది. అయినా కూడా ఈ కార్యక్రమానికి రావడానికి ప్రధాన కారణం కోటి గారు. ఎందుకంటే కోటి తో నాకున్న అనుబంధం అంతా ఇంతా కాదు. నా సినిమా అనేసరికి ప్రత్యేకించి అన్ని రకాల హంగులతో ఆయన ఎంతో ప్రత్యేకమైన శ్రద్ద తీసుకొని సంగీతం అందించాడు.

Chiranjeevi About Music Director Koti And His Son Rajeev Salur

Chiranjeevi About Music Director Koti And His Son Rajeev Salur

Chiranjeevi : సింహభాగం ఆయనదేనన్న చిరంజీవి..

ముఖ్యంగా చెప్పాలంటే నా విజయానికి,నా ఎదుగుదలకి సింహభాగం రాజ్ – కోటి లదే అని చెప్పాలి. ఇద్దరు కూడా నా సినిమాకు సంబంధించిన సాంగ్స్ ను ప్రత్యేకంగా 80, 90 దశకంలో హిట్లర్, రిక్షావోడు, లాంటి సినిమాలు 12 వరకు చేయడం జరిగింది. సుమారు 60 సాంగ్స్ అంటే నాకు 90% సూపర్ డూపర్ హిట్స్ ఇచ్చాడు. ఇంత మంచి హిట్ సాంగ్స్ ఇచ్చినటువంటి కోటి గారి ఋణం తీర్చుకోలేక పోయానే అనే బాధ ఉండేది.కానీ ఈ రోజు కోటి గారి కొడుకు రాజీవ్ ను ఆశీర్వదించడానికి వచ్చినందుకు నాకు చాలా సంతోషం వేసింది.కోటి గారి ఋణం ను ఇలా తీర్చుకోవడానికి ఈ వేడుక నాకు వేదిక అయింది.

సాలూరు రాజేశ్వరరావు గారు ఎంతో గొప్ప లెజెండరీ సంగీత దర్శకుడు  తన వారసత్వాన్ని పుణికి పుచ్చుకుని వచ్చిన కోటి గారు కూడా తండ్రి బాటలో పయనించి సంగీతంలో తండ్రికి తగ్గ తనయుడిగా రెండు దశాబ్దాల పాటు అద్భుతమైన సంగీతాన్ని ప్రేక్షకులకు అందించాడు. ఈ రోజుకి కూడా తనంటే నాకు ఇన్స్పిరేషన్. చాలామంది తెరమరు గవుతున్నా..తను మాత్రం  బుల్లితెరపై కూడా తన ప్రస్థానాన్ని మళ్ళీ కొనసాగిస్తూ.. కాంటెంపరరీ గా ఉంటూ ఔత్సాహికులను ఉత్సాహపరుస్తూ తను మంచి మనసుతో ముందుకు వెళ్తున్నారు.అతనిలో ఉన్న పాజిటివ్ నెస్ తనని ముందుకు నడిపిస్తుంది తన  ఇద్దరు కొడుకులలో ఒకరిని సంగీత దర్శకుడిగా మరొకరిని నటుడుగా  పరిచయం చేసి ఇండస్ట్రీలో ఇరువైపులా ఉండేలా తను ప్లాన్ చేసుకున్నాడు’ అంటూ సినిమా గురించి, కోటి గురించి చిరంజీవి చెప్పుకొచ్చాడు.

bkalyan

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది