Chiranjeevi : జార్జియాలో చిరంజీవి భంగపాటు.. విజయ్ సేతుపతి క్రేజ్‌కు మెగాస్టార్ ఫిదా
Chiranjeevi : చిరంజీవి నటించిన సైరా సినిమా యుద్ద సన్నివేశాలను జార్జియాలో షూట్ చేసిన సంగతి తెలిసిందే. ప్రీ క్లైమాక్స్‌లో వచ్చే యుద్ద సన్నివేశాలను జార్జియాలో షూట్ చేశారు. ఆ సమయంలో విజయ్ సేతుపతి, చిరంజీవి ఇలా భారీ తారాగణం అంతా కూడా జార్జియాలో ఉన్నారు. అయితే ఓ సారి వారు బస చేసిన హోటల్‌కు అభిమానులు తండోపతండాలుగా వచ్చారట. నాటి విషయం గురించి చిరంజీవి తాజాగా బయట పెట్టేశాడు.

Chiranjeevi about Vijay Sethupathi
ఉప్పెన ప్రీ రిలీజ్ ఈవెంట్ సందర్భంగా చిరంజీవి మాట్లాడుతూ విజయ్ సేతుపతి క్రేజ్‌కు ఉదాహరణగా ఓ సంఘటనను వివరించాడు. జార్జియాలోని హోటల్‌కు అభిమానులు రావడంతో, అక్కడి యాజమాన్యం తెగ కంగారు పడిపోయిందట. వారి మా అభిమానులే.. మన వాళ్లే నేను వెళ్లి మాట్లాడతాను అని చిరు అన్నాడట. కానీ అంతలోపే కేకలు, అరుపులు ఎక్కువయ్యాయట. అయితే తాను వెళ్లక ముందే అంతలా ఎందుకు గోళ చేస్తున్నారో తెలుసుకుంటే షాక్ అయ్యాడట.
Chiranjeevi : జార్జియాలో చిరంజీవి భంగపాటు..
వచ్చింది తన అభిమానులు కాదని, విజయ్ సేతుపతి ఫ్యాన్స్ తెలిసి ఆశ్చర్యపోయానంటూ చిరంజీవి తాజాగా గుర్తుకు చేసుకున్నాడు. అలా చిరంజీవి చెప్పడంతో విజయ్ సేతుపతి క్రేజ్ గురించి అందరికీ ఇలా మరోసారి తెలిసిపోయింది. సినిమాలో హీరోగా, విలన్‌గా, సహాయక నటుడిగా ఇలా పాత్ర ఏదైనా సరే నటించి విజయ్ సేతుపతి ఇంతటి స్టార్డంను సంపాదించుకుని ప్యాన్ ఇండియాలో క్రేజ్ తెచ్చుకున్నాడు.