Chiranjeevi : చిరంజీవి ఇంటి ముందర ధర్నాకి సిద్ధమైన బ్రాహ్మణ సంఘాలు?
Chiranjeevi : మెగాస్టార్ చిరంజీవి గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. చిరంజీవి కేవలం ఒక నటుడిగానే కాదు.. సామాజిక సేవ చేసే గొప్పవ్యక్తిగా, రాజకీయ నాయకుడిగా, తెలుగు సినిమా ఇండస్ట్రీ పెద్దగా ఆయన సుపరిచితుడు. తెలుగు ఇండస్ట్రీలో చిరంజీవికి ఉన్న ఫాలోయింగ్ మామూలుగా ఉండదు. మెగా ఫ్యాన్స్ చేసే హడావుడి కూడా మామూలుగా ఉండదు. ప్రస్తుతం ఇండస్ట్రీలో ఉన్న హీరోలు, హీరోయిన్లు అంతా చిరంజీవి నటనను చూసి స్ఫూర్తి పొంది ఇండస్ట్రీకి వచ్చిన వాళ్లే.
తాజాగా చిరంజీవి హైదరాబాద్ లో అలయ్ బలయ్ కార్యక్రమంలో పాల్గొన్న విషయం తెలిసిందే. ఈ సందర్భంగా చిరంజీవిని చూడటానికి అభిమానులు ఒక్కసారిగా గుమిగూడారు. దీంతో అక్కడే ఉన్న ప్రవచనకర్త గరికపాటికి కోపం వచ్చి అలిగారు. ఆ ఘటనపై ప్రస్తుతం పెద్ద చర్చ కొనసాగుతోంది. ఎందుకంటే.. గరికపాటి అవధానం ప్రారంభించాక కూడా మెగాస్టార్ చిరంజీవి తన అభిమానులతో ఫోటోలు దిగుతుండటంతో ఆయనకు అది కొంచెం ఇబ్బంది కలిగించింది. దీంతో ఆయన కొంచెం అసహనానికి గురయ్యారు. మీరు ఈ ఫోటో సెషన్ ఆపకపోతే నేను ఇక్కడి నుంచి వెళ్లిపోతా అని గరికపాటి హెచ్చరించినంత పని చేశారు.
Chiranjeevi : చిరంజీవికి గరికపాటి క్షమాపణ చెప్పాలంటూ మెగా ఫ్యాన్స్ డిమాండ్
దీంతో చిరంజీవి కూడా అభిమానులతో ఫోటోలు దిగడం ఆపేసి గరికపాటి పక్కన వచ్చి కూర్చున్నారు. అయితే.. ఈ వివాదం ఇక్కడితో ముగిసిపోలేదు. ఆ ఘటనపై వెంటనే మెగా బ్రదర్ నాగబాబు రియాక్ట్ అయ్యారు. చిరంజీవిని చూస్తే ఎవ్వరికైనా అసూయ ఉంటుందని కామెంట్ చేశారు. గరికపాటికి కౌంటర్ ఇచ్చారు. ఇక.. మెగా ఫ్యాన్స్ ఊరుకుంటారా.. వెంటనే గరికపాటి మెగాస్టార్ చిరంజీవికి క్షమాపణ చెప్పాలంటూ డిమాండ్ చేస్తున్నారు. మరి.. గరికపాటిని అంటే బ్రాహ్మణ సంఘాలు ఊరుకుంటాయా? వెంటనే వాళ్లు కూడా రంగంలోకి దిగేశారు. ప్రవచనాలు చెప్పే పండితుడికి, సినిమాల పేరుతో వ్యాపారం చేసుకునే వాళ్లకు పోలిక ఏంటి అంటూ ప్రశ్నిస్తున్నారు. చూద్దాం ఈ వివాదం ఇంకా ఎంత దూరం వెళ్తుందో.