Chiranjeevi : తన మీద రెచ్చిపోతోన్న చిరంజీవి కి కొరటాల శివ మార్క్ ఆన్సర్ !
Chiranjeevi : జూనియర్ ఎన్టీఆర్ ‘ ఆర్ఆర్ఆర్ ‘ సినిమా తర్వాత కొరటాల శివ డైరెక్షన్లో ఓ సినిమాలో నటించబోతున్నాడు. అయితే ఈ సినిమా ఇంకా సెట్స్ మీదకు వెళ్లలేదు. దీనికి కారణం కొరటాల శివ. కొరటాల చివరిగా చిరంజీవితో ఆచార్య సినిమా చేసి లైఫ్ లోనే బిగ్గెస్ట్ డిజాస్టర్ నీ ఎదుర్కొన్నాడు. అలాగే చాలా విమర్శలు కూడా వచ్చాయి. ఈ సినిమా రిజల్ట్ తో కొరటాల మానసికంగా చాలా బాధపడ్డారు. తరచుగా చిరంజీవి ఆచార్య సినిమా రిజల్ట్ దృష్టిలో పెట్టుకొని కొరటాలను పరోక్షంగా నిందిస్తూనే ఉన్నారు. తాజాగా వాల్తేరు వీరయ్య సినిమా సక్సెస్ మీట్ లో చిరంజీవి
పరోక్షంగా కొరటాల గురించి చేసిన వాక్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఆచార్య అంత పెద్ద డిజాస్టర్ సినిమా అయినా ఎన్టీఆర్ కొరటాల మీద పూర్తి నమ్మకం ఉంచారు. అయితే స్క్రిప్ట్ విషయంలో కొరటాలకి ఎన్టీఆర్ చాలా కండిషన్స్ పెట్టినట్లు తెలుస్తుంది. బౌండ్ స్క్రిప్ట్ పక్కాగా సిద్ధం చేసిన తర్వాతనే సెట్స్ పైకి వెళ్దామని సూచించినట్లు తెలుస్తుంది. సినిమాలో స్క్రిప్ట్ సరిగా లేకపోవడంతో దాంట్లో కొన్ని మార్పులు చేర్పులు చేయాల్సి వచ్చేసరికి ఎన్టీఆర్ సినిమా ఇంకాస్త వెనక్కి వెళ్ళిపోయింది. ఇదిలా ఉంటే ఇప్పటికే ఈ సినిమాకి మ్యూజిక్ డైరెక్టర్ గా
అనిరుద్ ని ఎంపిక చేశారు. అలాగే ఆర్ట్ డైరెక్టర్ నీ కూడా ఓకే చేశారు. ఇకపోతే ఈ సినిమాలో ఎన్టీఆర్ ఫిషర్మెన్ వర్గానికి చెందిన వాడిగా కనిపిస్తున్నట్లు తెలుస్తుంది. దీనికి తగ్గట్లుగానే సెట్స్ ఏర్పాటు చేయటానికి సన్నాహాలు జరుగుతున్నాయి. స్క్రిప్ట్ వర్క్ కంప్లీట్ కావడంతో పాటు క్యాస్టింగ్ కూడా ఫైనల్ అయినట్లు తెలుస్తుంది. ఈ నెలలోని ఎన్టీఆర్ సినిమాకి పూజా కార్యక్రమాలు పూర్తిచేసి ఫిబ్రవరిలో సెట్స్ పైకి వెళ్లేలా ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన త్వరలోనే ఇవ్వబోతుంది చిత్ర యూనిట్.