
Chiranjeevi - Pawan Kalyan A big war between
Chiranjeevi : తెలుగు సినిమా పరిశ్రమకు చెందిన కార్మికులు రెండు రోజుల పాటు సమ్మె చేసిన విషయం తెల్సిందే. ఆ సమ్మెను మంత్రి తలసాని ఎంట్రీ ఇచ్చి ఒకింత పరిష్కారం చూపించగలిగారు. ఆయన సూచనతో నిర్మాతలు మరియు సినీ కార్మికులు మాట్లాడుకుని సమస్య పరిష్కారంకు ఒక నిర్ణయానికి వచ్చారు. ప్రస్తుతం నిర్మాతలతో ఒక కమిటీ వేయడం జరిగింది. సినీ కార్మికులు వేతన పెంపు కోసం డిమాండ్ చేస్తున్నారు. ఎంత వరకు వారికి వేతనం పెంచాలి అనే విషయమై ఒక నిర్ణయానికి 15 రోజుల్లో వస్తారని తేలిపోయింది. దాంతో నేటి నుండి షూటింగ్స్ యధావిధిగా జరుగబోతున్నాయి అంటూ నిర్మాతల మండలి నుండి అధికారిక ప్రకటన వచ్చింది.
టాలీవుడ్ లో సినీ కార్మికుల సమస్య అనేది చిన్న సమస్య కాదు. వేలాది మంది ఉన్న సినిమా ఇండస్ట్రీ లో వారి యొక్క పారితోషికం పెద్ద సమస్యగా మారింది. టైమ్ అంటూ లేకుండా కష్టపడుతున్న తమకు సాయం చేయాలని.. తమకు ఇస్తున్న పారితోషికం పెంచాలని వారు డిమాండ్ చేస్తున్నారు. ఈ విషయంలో చిరంజీవి మరియు పవన్ నుండి వారికి మద్దతు వస్తుందని ఆశించారు. కాని చిరంజీవి కాని పవన్ కళ్యాన్ కాని కనీసం ఆ సినీ కార్మికుల గురించి మాట్లాడలేదు అంటూ ఇండస్ట్రీ వర్గాల్లో మరియు సినీ కార్మికుల్లో చర్చ జరుగుతోంది. గతంలో నిర్మాతలకు కష్టం వచ్చింది..
Chiranjeevi and Pawan Kalyan why don’t respond on film works Protest
టికెట్ల రేట్లు తక్కువగా ఉంటే ఇండస్ట్రీ కష్టం అన్నట్లుగా వ్యాఖ్యలు చేసిన ఈ మెగా బ్రదర్స్ ఇప్పుడు ఎక్కడకు వెళ్లారు అంటూ కొందరు ఎద్దేవ చేస్తున్నారు. చిరంజీవి హైదరాబాద్ లో ఉన్నా కూడా ఆయన్ను కలిసేందుకు వెళ్లిన సినీ కార్మికులకు హ్యాండ్ ఇచ్చాడు. ప్రస్తుతానికి తాను ఎవరిని కలువలేను అంటూ చెప్పి వెనక్కు పంపించాడు అంటూ పుకార్లు షికార్లు చేస్తున్నాయి. మరో వైపు పవన్ కళ్యాణ్ కూడా ఈ విషయంలో విమర్శలు ఎదుర్కొంటున్నాడు. అసలు పవన్ కళ్యాణ్ మరియు చిరంజీవికి సినీ కార్మికుల సమస్య కనిపించలేదా.. ఇలాంటి చిన్నవాళ్ల సమస్యలను వారు పట్టించుకోరా అంటూ కొందరు విమర్శలు గుప్పిస్తున్నారు.
Rice | మన రోజువారీ ఆహారంలో అన్నం (బియ్యం) కీలకమైన భాగం. ఇది శరీరానికి తక్షణ శక్తిని అందించే ప్రధాన…
Montha Effect | ఆంధ్రప్రదేశ్ తీరంపై మొంథా తుఫాను (Cyclone Montha) బీభత్సం సృష్టిస్తోంది. ఇవాళ (అక్టోబర్ 28) సాయంత్రం లేదా…
Harish Rao | హైదరాబాద్‌లో బీఆర్‌ఎస్ పార్టీలో తీవ్ర విషాదం నెలకొంది. సిద్దిపేట బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి తన్నీరు…
Brown Rice |బియ్యం తింటే లావు అవుతారనే భావన చాలా మందిలో ఉంది. అందుకే చాలామంది తెల్ల బియ్యానికి బదులుగా…
Health Tips | అక్టోబర్ నెలాఖరులో వాతావరణం క్రమంగా చల్లబడుతోంది. ఈ సీజన్ మార్పు సమయంలో చాలామంది దగ్గు, జలుబు,…
Chanakya Niti | ఆచార్య చాణక్యుడు ..కేవలం రాజకీయ చతురుడు మాత్రమే కాదు, ఆర్థిక జ్ఞానానికి ప్రతీక. వేల సంవత్సరాల…
Phone | కొత్త స్మార్ట్‌ఫోన్ కొనాలనుకునే వారికి మోటరోలా నుంచి మరో గుడ్ న్యూస్ వచ్చింది. రూ.15,000 బడ్జెట్‌లో పవర్‌ఫుల్…
Cancer Tips | నేటి వేగవంతమైన జీవనశైలి, ఆహారపు అలవాట్లు, ఒత్తిడి వంటి కారణాల వల్ల క్యాన్సర్, గుండెపోటు, స్ట్రోక్…
This website uses cookies.