Chiranjeevi : చిరంజీవి, పవన్ కళ్యాణ్‌లకు చిన్న వాళ్ల సమస్యలు కనిపించవా? | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Chiranjeevi : చిరంజీవి, పవన్ కళ్యాణ్‌లకు చిన్న వాళ్ల సమస్యలు కనిపించవా?

Chiranjeevi : తెలుగు సినిమా పరిశ్రమకు చెందిన కార్మికులు రెండు రోజుల పాటు సమ్మె చేసిన విషయం తెల్సిందే. ఆ సమ్మెను మంత్రి తలసాని ఎంట్రీ ఇచ్చి ఒకింత పరిష్కారం చూపించగలిగారు. ఆయన సూచనతో నిర్మాతలు మరియు సినీ కార్మికులు మాట్లాడుకుని సమస్య పరిష్కారంకు ఒక నిర్ణయానికి వచ్చారు. ప్రస్తుతం నిర్మాతలతో ఒక కమిటీ వేయడం జరిగింది. సినీ కార్మికులు వేతన పెంపు కోసం డిమాండ్‌ చేస్తున్నారు. ఎంత వరకు వారికి వేతనం పెంచాలి అనే విషయమై […]

 Authored By prabhas | The Telugu News | Updated on :25 June 2022,11:00 am

Chiranjeevi : తెలుగు సినిమా పరిశ్రమకు చెందిన కార్మికులు రెండు రోజుల పాటు సమ్మె చేసిన విషయం తెల్సిందే. ఆ సమ్మెను మంత్రి తలసాని ఎంట్రీ ఇచ్చి ఒకింత పరిష్కారం చూపించగలిగారు. ఆయన సూచనతో నిర్మాతలు మరియు సినీ కార్మికులు మాట్లాడుకుని సమస్య పరిష్కారంకు ఒక నిర్ణయానికి వచ్చారు. ప్రస్తుతం నిర్మాతలతో ఒక కమిటీ వేయడం జరిగింది. సినీ కార్మికులు వేతన పెంపు కోసం డిమాండ్‌ చేస్తున్నారు. ఎంత వరకు వారికి వేతనం పెంచాలి అనే విషయమై ఒక నిర్ణయానికి 15 రోజుల్లో వస్తారని తేలిపోయింది. దాంతో నేటి నుండి షూటింగ్స్ యధావిధిగా జరుగబోతున్నాయి అంటూ నిర్మాతల మండలి నుండి అధికారిక ప్రకటన వచ్చింది.

టాలీవుడ్‌ లో సినీ కార్మికుల సమస్య అనేది చిన్న సమస్య కాదు. వేలాది మంది ఉన్న సినిమా ఇండస్ట్రీ లో వారి యొక్క పారితోషికం పెద్ద సమస్యగా మారింది. టైమ్ అంటూ లేకుండా కష్టపడుతున్న తమకు సాయం చేయాలని.. తమకు ఇస్తున్న పారితోషికం పెంచాలని వారు డిమాండ్‌ చేస్తున్నారు. ఈ విషయంలో చిరంజీవి మరియు పవన్‌ నుండి వారికి మద్దతు వస్తుందని ఆశించారు. కాని చిరంజీవి కాని పవన్‌ కళ్యాన్ కాని కనీసం ఆ సినీ కార్మికుల గురించి మాట్లాడలేదు అంటూ ఇండస్ట్రీ వర్గాల్లో మరియు సినీ కార్మికుల్లో చర్చ జరుగుతోంది. గతంలో నిర్మాతలకు కష్టం వచ్చింది..

Chiranjeevi and Pawan Kalyan why don't respond on film works Protest

Chiranjeevi and Pawan Kalyan why don’t respond on film works Protest

టికెట్ల రేట్లు తక్కువగా ఉంటే ఇండస్ట్రీ కష్టం అన్నట్లుగా వ్యాఖ్యలు చేసిన ఈ మెగా బ్రదర్స్ ఇప్పుడు ఎక్కడకు వెళ్లారు అంటూ కొందరు ఎద్దేవ చేస్తున్నారు. చిరంజీవి హైదరాబాద్‌ లో ఉన్నా కూడా ఆయన్ను కలిసేందుకు వెళ్లిన సినీ కార్మికులకు హ్యాండ్‌ ఇచ్చాడు. ప్రస్తుతానికి తాను ఎవరిని కలువలేను అంటూ చెప్పి వెనక్కు పంపించాడు అంటూ పుకార్లు షికార్లు చేస్తున్నాయి. మరో వైపు పవన్‌ కళ్యాణ్ కూడా ఈ విషయంలో విమర్శలు ఎదుర్కొంటున్నాడు. అసలు పవన్ కళ్యాణ్‌ మరియు చిరంజీవికి సినీ కార్మికుల సమస్య కనిపించలేదా.. ఇలాంటి చిన్నవాళ్ల సమస్యలను వారు పట్టించుకోరా అంటూ కొందరు విమర్శలు గుప్పిస్తున్నారు.

prabhas

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది