Chiranjeevi learns about Upendra Waiting
Chiranjeevi : బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ యూనివర్సల్ స్టార్ అని అంటుంటారు. కోలీవుడ్‌లో సూపర్ స్టార్ రజినీకాంత్, విశ్వనటుడు కమల్ హాసన్, మాలీవుడ్‌లో మోహన్ లాల్, మమ్ముట్టి అని చెప్పుకుంటుంటారు. కానీ, వీరందరికంటే టాలీవుడ్‌లో మెగాస్టార్ చిరంజీవి పదిమెట్లు పైనే ఉన్నారని ఆయన సినిమాలు చూస్తేగానీ అర్థం కాదు. ప్రస్తుతం దేశవ్యాప్తంగానే కాక ప్రపంచవ్యాప్తంగా మెగాస్టార్‌కు ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. అసాధారణమైన పాపులారిటీతో చిరు అందరికంటే పై స్థాయిలో ఉన్నారు. అయితే, ఆచార్య సినిమా ఆయనను ప్రతీ నెటిజన్ కామెంట్ చేసేలా నిలిచింది.మెగా మల్టీస్టారర్‌గా వచ్చిన ఈ సినిమా ఆయనకు ఊహించని విధంగా ఫలితాన్నిచ్చి చేదు అనుభవాన్నిచ్చింది.
ఆచార్య సినిమాను చూపిస్తూ మెగాస్టార్ నే సోషల్ మీడియా వేదికగా బాగానే కించపరిచారు. ఆచార్యకి నష్టాలు అని విమర్శలు చేశారు. ఎవరికి తోచింది వారు, ఎవరిని కామెంట్ చేస్తున్నామో అనే విషయం కూడా మర్చిపోయి అనే మాటలన్నీ అనేసారు. ఇదే కాదు, ఆయన టైం అయిపొయింది అంటూ వెటకారంగానూ అన్నారు. అయితే, అప్పుడే అయిపోలేదు. ఎత్తిన ప్రతి వేలు, అన్న ప్రతి మాట వెనక్కి తీసుకునే రోజు రాబోతోంది.చిరు అందరికీ తన స్టైల్లోనే జస్ట్ టైం గ్యాప్ అంతే టైమింగ్‌లో అస్సలు గ్యాప్ ఉండదు అంటూ రెడీ అవుతున్నారు. ఆచార్య లాంటి ఫ్లాప్ వస్తే ఏ హీరో అయినా కనీసం సంవత్సరం రోజులు ఇంట్లో నుంచి బయటకి రావడానికి ఇష్టపడరు. కానీ చిరు ఒక రగిలే నిప్పుకణం లాంటోడు.
Chiranjeevi answers every word
అందుకే, రెండు నెలలు తిరగకుండానే సెట్స్ పైకి వెళ్లడానికి సిద్దమయ్యారు. ఆయన నటిస్తున్న లేటెస్ట్ సినిమాలు భోలా శంకర్ సినిమా జూన్ 21 నుంచి రెగ్యులర్ షూటింగ్ హైదరాబాద్ లో మొదలవుతోంది. భోలా శంకర్ మూవీకి మెహర్ రమేష్ డైరెక్టర్. ఈ లాంగ్ షెడ్యూల్ లో ప్రధాన తారాగణం అందరితో ముఖ్యమైన సీన్స్ షూట్ చేయనున్నారు. చిరు మార్క్ మాస్ మసాలా ఎంటర్టైనర్‌గా భోలా శంకర్ రాబోతోంది. మెసేజ్ ఓరియెంటెడ్ సినిమా చేస్తే ట్రోల్ చేశారు కదా, ఇప్పుడు ఆయన మార్క్ మూవీతో వస్తున్నాడు. మీ రికార్డులు ఏమైనా ఉంటే రాసి పెట్టుకొండమ్మా, అన్నయ్య వస్తే ఆ రికార్డులన్నీ ఈసారి బద్దలే అని మెగా ఫాన్స్ కాన్ఫిడెంట్ గా చెప్తున్నారు. వారి మాటల్ల్లో నిజం ఉంది. ఎందుకంటే, అక్కడ ఉన్నది మెగాస్టార్, చేసేది మాస్ సినిమా. భోలా శంకర్ రిలీజ్ రోజున కొత్త బాక్సాఫీస్ చిరిత్ర సృస్టించడం ఖాయమని ఫిక్సైపోయారు.
Tea | కొంతమంది కొంచెం "స్టైల్" కోసం, మరికొందరు అలవాటుగా... సిగరెట్ కాలుస్తూ, ఒక చేతిలో టీ కప్పుతో ఎంతో…
Health Tips | యాలకులు అంటే కేవలం రుచి, సువాసన కోసం మాత్రమే వాడే ఒక మసాలా దినుసు అని చాలా…
Hanuman phal | రోజూ ఆరోగ్యంగా ఉండేందుకు ఆపిల్, అరటి, ద్రాక్ష వంటి పండ్లు తినాలని అందరూ చెబుతారు. కానీ…
Vinayaka | శ్రావణ మాసం ముగిసిన తరువాత భక్తులందరూ ఎదురు చూస్తే అది భాద్రపద మాసం. తొమ్మిది రోజుల పాటు పల్లె…
కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వివాహం విఫలమై ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్న మహిళలకు గొప్ప ఊరటను కలిగించే వార్తను…
BC Youth Employment : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాష్ట్ర ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు…
wife Killed Her Husband : నిర్మల్ జిల్లాలో దారుణమైన హత్య కేసు వెలుగులోకి వచ్చింది. 30 ఏళ్ల వివాహ…
డిల్లీ మెట్రోలో (Delhi Metro) తరచుగా జరిగే విచిత్ర సంఘటనల జాబితాలోకి మరో ఘటన చేరింది. ఇద్దరు మహిళలు సీటు…
This website uses cookies.