Chiranjeevi – Balakrishna : ఫస్ట్ లుక్ పోస్టర్స్‌తో చిరంజీవి బాలయ్య ఫ్యాన్స్ మధ్య వార్ మొదలైందా..?
Chiranjeevi – Balakrishna: గత కొంతకాలంగా మెగాస్టార్ చిరంజీవి అందరితోనూ కలుస్తున్నారు గానీ, నందమూరి బాలకృష్ణతో మాత్రం కలవడం లేదు. గత ఏడాది కోవిడ్ సమయంలో చిరంజీవి చేసిన ప్రజా సేవ..దాని కొరకు ఆయన నివాసంలో ఏర్పాటు చేసిన సమావేశంలో..ఆ తర్వాత సినిమా ఇండస్ట్రీకి ఉన్న సమస్యలపై ఇరు రాష్ట్రాల ముఖ్య మంత్రులతో చర్చలకు వెళ్ళినప్పుడు..ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డిని కలవడానికి ఇండస్ట్రీ పెద్దలు వెళ్లినప్పుడు..ఇలా ఏ ముఖ్యమైన సమావేశాలలోనూ బాలయ్య కనిపించలేదు. దీనికి కారణం ముఖ్యంగా బాలయ్య – చిరు మధ్య మాటలు లేకపోవడమే అని టాక్ బలంగా వినిపిస్తుంది.
ఓ మీడియా ఛానల్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో కూడా బాలయ్య కాస్త గట్టిగానే కౌంటర్స్ ఇచ్చారు. ఏదేమైనా ఇండస్ట్రీలో బాలయ్య కాస్త దూరంగా ఉంటున్నారని మాత్రం అర్థం అవుతోంది. ఇక వీరి సినిమాలు మొదలైనప్పటి నుంచీ అప్‌డేట్ వచ్చిన ప్రతీసారి. మెగా నందమూరి అభిమానుల మధ్య కోల్డ్ వార్ ఎలా జరుగుతుంటుందో ఇప్పుడు ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. బాక్సాఫీస్ వద్ద ఒకేరోజు చిరంజీవి – బాలకృష్ణ సినిమాలు రిలీజ్ అవుతుంటే ఫ్యాన్స్ పోటీపడి చేసే హంగామా, సందడి అంతా ఇంతా కాదు. ఇటీవల బాలకృష్ణ హీరోగా నటిస్తున్న ఎన్‌బీకే 107 సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్‌తో పాటు టీజర్ కూడా విడుదల చేయగా దానికి విశేషమైన స్పందన వచ్చింది.

Chiranjeevi Balakrishna fans War between with first look posters
Chiranjeevi – Balakrishna : రజనీకాంత్ సినిమాను ఫాలో అయ్యారనే కామెంట్స్ వినిపిస్తున్నాయి.
నందమూరి అభిమానులైతే ఊగిపోయారు. ఇక తాజాగా మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న గాడ్ ఫాదర్ సినిమా నుంచి ఫస్ట్ లుక్ పోస్టర్‌తో పాటుగా చిన్న టీజర్ కూడా వచ్చింది. ఇలా విడుదలైందో లేదో నెట్టింట బాగా వైరల్ అయింది. అయితే, ఇవేవీ కొత్త లుక్స్ కాదు. గతంలో చిరు ఇలాంటి లుక్‌లో కనిపించకపోయినా రజనీకాంత్ సినిమాను ఫాలో అయ్యారనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఇక బాలయ్య లుక్ కూడా గతంలో చెన్నకేశవ రెడ్డి సినిమాలో చూసిందే. కాకపోతే ఇక్కడ బ్లాక్ థీమ్ ని ఉపయోగించారు. అందుకే, ఫ్యాన్స్ హడావుడి తప్ప కామన్ ఆడియన్స్ మాత్రం అంతగా ఆసక్తి కనబరిచింది లేదు..అంటున్నారు.