Chiranjeevi – Balakrishna : చిరంజీవి, బాలకృష్ణ మల్టీస్టారర్ మూవీ.. పాన్ వరల్డ్ మూవీగా తెరకెక్కబోతోందా?
Chiranjeevi – Balakrishna : చిరంజీవి, బాలకృష్ణ మధ్య మల్టీస్టారర్ మూవీ.. ఆహా ఎంత బాగుంది ఈ ఊహ అంటారా? ఇది ఊహ కాదు నిజమేనండోయ్.. త్వరలోనే చిరంజీవి, బాలకృష్ణ ఇద్దరూ కలిసి త్వరలోనే మల్టీస్టారర్ మూవీ తీయబోతున్నారు. వాళ్లిద్దరూ కలిసి ఒకే సినిమాలో నటించడం అంటే అది మామూలు సినిమా కాదు. ఏకంగా పాన్ వరల్డ్ సినిమానే అంటున్నారు. ఒకప్పుడు పండుగలు వచ్చాయంటే థియేటర్లలో అటు చిరంజీవి, ఇటు బాలకృష్ణ సినిమాలు పోటీ పడేవి. బాక్సాఫీసు దగ్గర ఇద్దరు హీరోలు ఒకేసారి పోటీ పడేవారు. అప్పుడు ఇద్దరు హీరోల ఫ్యాన్స్ మధ్య పెద్ద వారే జరిగేది. అలాంటి వార్ మళ్లీ వచ్చే సంక్రాంతికి జరగనుంది.
అది ఎందుకంటే.. వచ్చే సంక్రాంతికి అటు బాలయ్య బాబు సినిమా వీరసింహారెడ్డి, ఇటు మెగాస్టార్ సినిమా వాల్తేరు వీరయ్య రెండూ ఒకేసారి ఢీకొనబోతున్నాయి. అయితే.. ఇంకా ఇద్దరి మధ్య బాక్సాఫీసు వద్ద పోటీలేనా.. ఇద్దరూ కలిసి ఇప్పుడైనా ఒకే సినిమాలో నటిస్తే పోలా.. అదిరిపోలా అని అటు చిరంజీవి, ఇటు బాలయ్య అభిమానులు అనుకుంటున్నారు. బాలయ్య బాబు సినిమాలతో పాటు ఆహా ఓటీటీలో టాక్ షో కూడా చేస్తున్న విషయం తెలిసిందే. అన్ స్టాపబుల్ పేరుతో వస్తున్న ఈ షోలో తాజాగా అగ్ర నిర్మాతు అరవింద్, సురేశ్ బాబు, సీనియర్ డైరెక్టర్లు రాఘవేంద్రరావు, కోదండరామిరెడ్డి సందడి చేశారు. ఆ ఎపిసోడ్ కు సంబంధించిన ప్రోమో తాజాగా విడుదలైంది.
Chiranjeevi – Balakrishna : అన్ స్టాపబుల్ టాక్ షోలో సందడి చేసిన పాతతరం డైరెక్టర్లు, నిర్మాతలు
ఆ ప్రోమోలో బాలయ్య చేసిన కొన్ని వ్యాఖ్యలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. మనిద్దరి కాంబోలో సినిమా ఎప్పుడు అంటూ బాలకృష్ణ.. అల్లు అరవింద్ కు ప్రశ్న వేస్తాడు. దీంతో అరవింద్ బదులిస్తూ చిరంజీవితో, మీతో కలిసి మల్టీస్టారర్ మూవీ చేయాలనుంది అంటూ చెప్పేస్తాడు అల్లు అరవింద్. దీంతో చిరంజీవి, నేను కలిసి నటిస్తే అది ఏకంగా పాన్ వరల్డ్ సినిమా అవుతుంది అంటూ చెప్పుకొచ్చాడు బాలకృష్ణ. అవును.. చిరంజీవి, బాలకృష్ణ కలిసి నటిస్తే అది నిజంగానే పాన్ వరల్డ్ సినిమా అవుతుందని సినీ అభిమానులు అంటున్నారు. కానీ.. ఇద్దరు హీరోలను బ్యాలెన్స్ చేస్తూ సినిమా తీసే దమ్ము ఉన్న దర్శకుడు, దానికి తగ్గ కథ దొరకాలి కదా. చూద్దాం మరి అలాంటి కథ ఎప్పుడు దొరుకుతుందో?