Chiranjeevi : మెగాస్టార్ చిరంజీవి పలు సందర్భాలలో అనేక ఆసక్తికర విషయాలు తెలియజేస్తూ అభిమానులని ఫుల్‌గా ఆనందింపజేస్తుంటారు. చిన్ననాటి సంగతులని కూడా అప్పుడప్పుడు పలు ఈవెంట్స్‌లో ప్రస్తావిస్తుంటారు. తాజాగా చిరంజీవి దివంగత ప్రొడ్యూసర్ ఏడిద నాగేశ్వరరావు మానవరాలైన శ్రీజ నిర్మాతగా తెరకెక్కిన ‘ఫస్ట్ డే ఫస్ట్ షో’ మూవీ ప్రీ రిలీజ్ వేడుకకు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఏడిద నాగేశ్వరరావు గారి కుటుంబంతో గల అనుభవాన్ని ఆయన గుర్తు చేసుకున్నారు. నిర్మాత శ్రీజ గురించి ఆయన ప్రత్యేకంగా మాట్లాడారు. పరిశ్రమకు అమ్మాయిలు రావాలి, మా ఫ్యామిలీ నుండి నిహారిక, సుస్మిత వచ్చారు. వాళ్ళకు ప్రోత్సాహం ఇచ్చామని ఆయన తెలియజేశారు.
మీ జీవితంలో ‘ఫస్ట్ డే ఫస్ట్ షో’ అనుభవం గురించి చెప్పాలని యాంకర్ సుమ అడగ్గా.. చిరంజీవి ఆసక్తికర సన్నివేశం గుర్తుచేసుకున్నారు. తన జీవితంలో ఫస్ట్ డే ఫస్ట్ షో అనుభవం చాలా దారుణంగా ఉందని చెప్పారు. పరువు పోతుందని ఇప్పటివరకు ఈ సంగతి ఎవ్వరికీ చెప్పలేదన్నారు.సంవత్సరం గుర్తు లేదు కానీ.. ఎన్టీఆర్ గారి రాము సినిమా ఫస్ట్ షో చూడాలని వెళ్లి దెబ్బలు తిన్నట్లు తెలియజేశారు. మేము నెల్లూరులో ఉన్నరోజుల్లో మా చుట్టాలబ్బాయి పూర్ణ అని ఒకడు ఉండేవాడు. వాడు ఎన్టీఆర్ కి వీరాభిమాని. రాము సినిమా చూడాలని నన్ను, నాగబాబును థియేటర్ కి తీసుకెళ్లాడు.
వాడు నేల టికెట్ కొని సినిమాలు చూసేవాడు. నాన్నగారు మమ్మల్ని మాత్రం కుర్చీకి మాత్రమే తీసుకెళ్లేవారు. టికెట్స్ తీసుకొని నేల వైపుకు వెళుతుంటే, అటూ ఇటూ గోడలు చీకటి, మధ్యలో క్యూ ఆగిపోయింది. మాకు ఊపిరి ఆడలేదు. లాభం లేదని బయటికి రాగానే, మా నాన్నగారు అమ్మతో పాటు సినిమా చూసి బయటికి వచ్చారు. అమ్మ వెనకలా ఉంది. వాళ్లను చూసి మా వాడు (నాగబాబు) వెర్రిమొఖం వేశాడు. మా నాన్న కొబ్బరి మట్ట తీసుకున్నారు. ఎందుకు వచ్చారని అని అడిగారు. సినిమా చూద్దామని చెప్పాను. అయితే నేలలో చూస్తారా..? వాడు చచ్చిపోతే.. అంటూ చితకొట్టారు. ఆ రోజు నుంచి ఏవీఎమ్ రాము అంటే నాకు చిన్న షివరింగ్ వస్తాది. మా నాన్నకు ఆవేశం వస్తే ఆగదు. ఇదే నా ఫస్ట్ డే ఫస్ట్ షో ఎక్స్‌పిరీయన్స్. ఇది చెబుతుంటే నాకు చెమటలు పడుతున్నాయి..’ అంటూ చిరంజీవిగా సరదాగా చెప్పుకొచ్చారు.
Passports : పాస్పోర్ట్ అత్యంత ముఖ్యమైన ప్రయాణ పత్రాలలో ఒకటి. అంతర్జాతీయ ప్రయాణాన్ని ధృవీకరించడమే కాకుండా, పాస్పోర్ట్ గుర్తింపు మరియు…
Mahakumbh Mela : ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్ మహాకుంభమేళా 2025 ఉత్సవాలకు సిద్ధమవుతుంది. 13 జనవరి 2025న ప్రయాగ్రాజ్లో కుంభమేళా నిర్వహించబడుతుంది.…
Ola Electric : ప్రభుత్వ విచారణ మరియు పెరుగుతున్న నష్టాల మధ్య వివాదాల్లో కూరుకుపోయిన ఓలా ఎలక్ట్రిక్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా…
YSR Congress Party : ఆంధ్రప్రదేశ్ పంపిణీ కంపెనీలు (డిస్కమ్లు) మరియు అదానీ గ్రూప్ మధ్య ప్రత్యక్ష ఒప్పందం లేదని…
Hair Tips : ప్రస్తుత కాలంలో చాలామందికి జుట్టు చివరలు చిట్లిపోయి నిర్జీవంగా మారిపోతాయి. దీంతో వెంట్రుకలు అనేవి ఊడిపోతూ…
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ సీజన్ 8 చివరి దశకు రానే వచ్చింది. మూడు వారాలలో…
Winter : చలికాలం రానే వచ్చేసింది. రోజురోజుకి చెల్లి ముదిరిపోతుంది. ఈసారి నవంబర్ నెలలోనే చలి మొదలైంది. ఇక ముందు ముందు…
Ind Vs Aus : సొంత గడ్డపై న్యూజిలాండ్ టీం అద్భుతంగా రాణించి భారత జట్టుని వైట్ వాష్ చేసింది.…
This website uses cookies.