Home » Entertainment » Quarrels In Allu Aravind Allu Arjun Family Allu Sirish
Entertainment

Allu Sirish : అల్లు శిరీష్ పక్కకు ఉన్నాడా? పక్కకు పెట్టారా?.. అల్లు వారి ఫ్యామిలీలో ఏం జరుగుతోంది?

Authored By
aruna
The Telugu News | Published on: September 1, 2022, 9:00 pm
Advertisement

Allu Sirish : గత కొంత కాలంగా మెగా ఫ్యామిలీలో విభేదాలు, గొడవలు ఉన్నాయంటూ మీడియాలో పుకార్లు షికార్లు చేస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటి వరకు ఆ వార్తలకు ఎలాంటి క్లారిఫికేషన్ రాలేదు. ఈ సమయంలోనే అల్లు అరవింద్ ఫ్యామిలీలో కాస్త సీరియస్ గొడవలు నడుస్తున్నాయి అంటూ ఫిల్మ్‌ నగర్ వర్గాల నుండి సమాచారం అందుతుంది. అల్లు అరవింద్ మరియు అల్లు అర్జున్ మాట కాదని అల్లు శిరీష్ తన సొంత దారిలో నడుస్తున్నాడని.. అది అల్లు అరవింద్ కు నడవ నచ్చడం లేదంటూ గుసగుసలు వినిపిస్తున్నాయి. అల్లు వారి ఫ్యామిలీలో ముగ్గురు అన్నదమ్ముల మధ్య విభేదాలు ఉండడం వల్లే గత కొన్నాళ్లుగా వారు ముగ్గురు ఒకే స్టేజిపై కనిపించలేదు.

Advertisement

ఒకరు కనిపిస్తే మరో ఇద్దరు కనుమరుగవుతున్నారు. ఒకరు ఒక చోట ఉంటే మరో ఇద్దరూ వేరే చోట ఉంటున్నారు. తాజాగా అల్లు అరవింద్ ఆఫీసులో వైభవంగా గణేష్ పూజ నిర్వహించారు. ఆ సందర్భంగా అర్జున్ మాత్రమే పాల్గొన్నారు. ఈ పూజలో అల్లు శిరీష్ మరియు పెద్దబ్బాయి కనిపించకపోవడంతో అసలు అల్లు ఫ్యామిలీలో ఏం జరుగుతుంది అంటూ అంతా చెవులు కోరుకుంటున్నారు. ఇటీవలే ఒక మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో అల్లు అరవింద్ మాట్లాడుతూ మెగా ఫ్యామిలీలో కానీ మా ఫ్యామిలీలో కానీ ఎలాంటి విభేదాలు లేవని అవన్నీ మీడియా సృష్టి అంటూ చెప్పే ప్రయత్నం చేశారు.

Quarrels in Allu Aravind Allu Arjun family Allu Sirish

Advertisement

ఇంతలోనే మరో కొత్త పుకారు షికారు చేయడంతో ఆయన నుండి ఎలాంటి స్పందన వస్తుంది అనేది చూడాలి. గత కొన్నాళ్లుగా అల్లు ఫ్యామిలీ వార్తల్లో ఉంటూనే ఉంది. విభేదాల కారణంగా అల్లు శిరీష్ ని అల్లు అరవింద్ మరియు అల్లు అర్జున్ పక్కకు ఉంచారని పుకార్ల షికారులు చేస్తున్నాయి. ఈ విషయమై అల్లు శిరీష్ స్పందించాల్సి ఉంది. ఈ వివాదాల కారణంగానే అల్లు శిరీష్ గత కొంత కాలంగా సినిమాలకు దూరంగా ఉంటున్నాడని.. ఆయన కథలు విన్నా కూడా, ఇప్పటికే ఒక సినిమా చేసిన కూడా ఆ సినిమాను విడుదల చేయడం లేదు.. కొత్త సినిమాలను కమిట్ అవ్వడం లేదు. ఈ గొడవ ఎన్నాళ్లు కొనసాగుతుందో చూడాలి.

aruna

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి