Chiranjeevi : రామ్ చ‌ర‌ణ్‌, ప‌వ‌న్ నా అచీవ్‌మెంట్‌... చిరంజీవి ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు వైర‌ల్‌ | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Chiranjeevi : రామ్ చ‌ర‌ణ్‌, ప‌వ‌న్ నా అచీవ్‌మెంట్‌… చిరంజీవి ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు వైర‌ల్‌

 Authored By sandeep | The Telugu News | Updated on :6 January 2025,10:02 am

ప్రధానాంశాలు:

  •  Chiranjeevi : రామ్ చ‌ర‌ణ్‌, ప‌వ‌న్ నా అచీవ్‌మెంట్‌... చిరంజీవి ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు వైర‌ల్‌

Chiranjeevi : మెగాస్టార్ చిరంజీవి  Megastar Chiranjeevi ఎక్క‌డ ఉంటే అక్క‌డ సంద‌డి వేరే లెవ‌ల్‌లో ఉంటుంది. ఆయ‌న తాజాగా Hyderabad హైదరాబాదులో జరిగిన ఆప్తా (ఏపీటీఏ) క్యాటలిస్ట్ గ్లోబల్ బిజినెస్ కాన్ఫరెన్స్ కార్య‌క్ర‌మానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో ఆయన ప్రసంగిస్తూ, ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. “ఇందాకటి నుంచి చాలా చెబుతూ నా అచీవ్ మెంట్స్ గురించి చెప్పాను. అవును… పవన్ కల్యాణ్ నా అచీవ్ మెంట్… రామ్ చరణ్ నా అచీవ్ మెంట్. నా ఫ్యామిలీలో ఉన్న అందరు బిడ్డలు నా అచీవ్ మెంట్. వీళ్లందరినీ చూస్తుంటే ఇది కదా నేను సాధించాను అనిపిస్తుంది.

Chiranjeevi : రామ్ చ‌ర‌ణ్‌, ప‌వ‌న్ నా అచీవ్‌మెంట్‌... చిరంజీవి ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు వైర‌ల్‌

Chiranjeevi : రామ్ చ‌ర‌ణ్‌, ప‌వ‌న్ నా అచీవ్‌మెంట్‌… చిరంజీవి ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు వైర‌ల్‌

Chiranjeevi : వారు నా అచీవ్‌మెంట్‌..

మొన్న పవన్ కల్యాణ్ Pawan Kalyna ఇంటికి వచ్చినప్పుడు ఒక మాట అన్నాడు. అన్నయ్యా… నువ్వు ఒక మాట చెప్పేవాడివి… గుర్తుందా? అన్నాడు. మన ఇంట్లో ఇంతమంది హీరోలం ఉన్నాం… ఇది నాతోనే ఆగిపోకూడదు… మన ఫ్యామిలీ మరొక రాజ్ కపూర్ ఫ్యామిలీ అవ్వాలని చెప్పేవాడివి. రాజ్ కపూర్ ఫ్యామిలీలో ఎంతమంది ఎలా ఉన్నారో, మన మెగా ఫ్యామిలీ కూడా అలాగే ఉండాలని నువ్వు చెప్పావు. ఇవాళ ఆ మాట గుర్తుచేసుకుంటుంటే ఎంతో ఆనందం కలుగుతుంది… నీ మాట పవర్ అలాంటిది అన్నయ్యా… నువ్వు ఎంతో నిష్కల్మషంతో అంటావు, గొప్ప స్థిరచిత్తంతో అంటావు…. అందులో ఎలాంటి కపటం ఉండదు దానికి బలం ఎక్కువ అన్నయ్యా అని కల్యాణ్ బాబు అంటే… అవును కదా అనుకున్నాను.

ఈ విషయం తెలియకుండానే, ఓ పత్రిక మా గురించి రాస్తూ కపూర్ ఫ్యామిలీ ఆఫ్ సౌత్ అని పేర్కొంది. అప్పుడు… భగవంతుడా ఇది మా గొప్పదనం కాదు… నువ్వు, ఈ ప్రజలు, ఈ అభిమానులు, ప్రేక్షకులు మమ్మల్ని ఆదరించారు కాబట్టే మేం ఈ స్థాయిలో ఉన్నాం అనిపిస్తుంది. గతంలో నేను ఏ సభలోనూ ఇంత మనసు విప్పి మాట్లాడలేదు. ఇంతమంది ఆప్తుల మధ్య ఆప్తా సంస్థ వాళ్లు ఆ అవకాశం ఇచ్చి నా గుండెను టచ్ చేశారు అంటూ చిరంజీవి ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. ప్ర‌స్తుతం చిరంజీవి చేసిన కామెంట్స్ నెట్టింట వైర‌ల్ అవుతున్నాయి.

Advertisement
WhatsApp Group Join Now

sandeep

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది