Chiranjeevi : ఆచార్య సినిమాని రెండో రోజే ఎత్తేశారంటూ ఎమోషనల్ కామెంట్స్ చేసిన చిరంజీవి
Chiranjeevi : ఇటీవల సినిమాలు థియేటర్స్‌లో ఎలాంటి పరిస్థితులు ఎదుర్కొంటున్నాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఎంత పెద్ద హీరో సినిమా అయిన కాస్త నెగెటివిటీ టాక్ వచ్చిందంటే చాలా రెండో రోజే సినిమాని ఎత్తేసే పరిస్థితి వస్తుంది. ఇటీవల చిరంజీవి, రామ్ చరణ్ నటించిన ఆచార్య ఎలాంటి పరిస్థితులు ఎదుర్కొందో మనం చూశాం. ఆచార్య ఫెయిల్యూర్‌ను చిరంజీవి అస్సలు మరచిపోలేకపోతున్నారు. ఈ విషయంపై దర్శకులకు మరోసారి స్టేజ్‌పైనే కొన్ని సలహాలు సూచనలు చేశారు. సినిమా కథల విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో చెప్పారు. ఈ సందర్భంలో ఆయన లేటెస్ట్ మూవీ ఆచార్య గురించి ఇన్‌డైరెక్ట్‌గా ప్రస్తావించారు.
Chiranjeevi : చిరు షాకింగ్ కామెంట్స్..
బుధవారం ఫస్ట్ డే ఫస్ట్ షో సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కి హాజరయ్యారు. ఈ సందర్భంగా చిరంజీవి మాట్లాడుతూ.. కంటెంట్ వుంటే ప్రేక్షకులు థియేటర్లకు వస్తారని అన్నారు. దర్శకులు కథపై బాగా కసరత్తు చేయాలని … భారీ తారాగణం, హిట్ కాంబినేషన్స్, కాల్షీట్స్ దొరికాయాని హాడావుడిగా సినిమాలు తీయొద్దని చిరంజీవి కోరారు. సినిమాను గట్టెక్కించడంలో దర్శకులదే ప్రధాన భూమిక అని చిరు చెప్పారు. కంటెంట్ లేకపోతే ఎంత పెద్ద సినిమా అయినా ఆడదని.. తాను కూడా బాధితుణ్ణే అని చిరంజీవి అన్నారు. దర్శకులపై ఎంతోమంది జీవితాలు ఆధారపడి వుంటాయని.. సరిగా సినిమా తీయలేకపోతే చాలా మంది జీవితాలు తలక్రిందులవుతాయని చిరు హెచ్చరించారు.
కోవిడ్ తర్వాత ఆడియెన్స్ థియేటర్స్ రావటం అనేది తగ్గింది. ఎప్పుడైనా సినీ ఇండస్ట్రీకి 5-10 మాత్రమే సక్సెస్ ఉండేది. ఇప్పుడు కూడా అంతే. అది మనం ఆలోచిస్తున్నతీరు అంతే. కానీ థియేటర్స్‌కు వెళ్లకూడదని ఆడియెన్స్ ఎప్పుడూ అనుకోరు. మంచి సినిమాను ఇస్తే ఆడియెన్స్ వస్తారనటంలో నాకెలాంటి డౌటు లేదు. లేకపోతే సినిమా రెండో రోజే పోతుంది. అందులో నేను కూడా ఓ బాధితుడినే. కాబట్టి కంటెంటే ముఖ్యం. దర్శకులే కెప్టెన్ ఆఫ్ ది షిప్. ఇండస్ట్రీని ముందుకు నడిపించాల్సిన వ్యక్తులు వాళ్లే. డైరెక్టర్స్ రుషుల్లాగా కష్టపడి ఎందుకు సినిమా హిట్ అయ్యింది.. ఎందుకు ప్లాప్ అయ్యిందని ఆలోచిస్తుండాలి. రీసెర్చ్ చేస్తుండాలి అని కీలక వ్యాఖ్యలు చేశారు.