#image_title
Chiranjeevi | అభిమానం హద్దులు దాటి, జీవితాన్నే పణంగా పెట్టి తన అభిమాన నటుడిని కలవాలని పట్టుదలగా ప్రయత్నించిన ఓ మహిళా అభిమానికి మెగాస్టార్ చిరంజీవి తన ఉదారతతో అండగా నిలిచారు. కర్నూలు జిల్లా నుంచి హైదరాబాద్ వరకు సైకిల్‌పై ప్రయాణించిన రాజేశ్వరి అనే అభిమానికి చిరు భరోసానిచ్చారు. ఆమె పిల్లల చదువు బాధ్యతను స్వయంగా తీసుకుంటానని ప్రకటించి మరోసారి తన గొప్ప మనసును చాటుకున్నారు.
#image_title
దటీజ్ చిరు..
కర్నూలు జిల్లాకు చెందిన రాజేశ్వరి, చిరంజీవికి వీరాభిమాని. తాను అభిమానించే నటుడిని ప్రత్యక్షంగా కలవాలన్న ఆరాటంతో సైకిల్‌పై వందల కిలోమీటర్లు ప్రయాణించి హైదరాబాద్ చేరుకున్నారు. గతంలో పవన్ కల్యాణ్ కోసం ఆదోనికి చెందిన ఆమె అమరావతికి సైకిల్ యాత్ర చేసిన సంగతి తెలిసిందే. ఈసారి మెగాస్టార్ కోసం మరోసారి అలాంటి సాహసమే చేసారు.
ఆమె ప్రయాణంలో పలుచోట్ల మెగా అభిమానులు స్వాగతం పలికారు, సంఘీభావం వ్యక్తం చేశారు. చివరకు చిరంజీవిని వ్యక్తిగతంగా కలిసిన రాజేశ్వరి, తన పిల్లలతో కలిసి చిరంజీవి నివాసానికి వెళ్లారు. చిరంజీవిని కలిసిన ఆ క్షణం రాజేశ్వరి జీవితంలో మరపురాని ఘట్టంగా మారింది. ఆయనను దేవుడిచ్చిన అన్నయ్యగా భావిస్తూ, రాఖీ కట్టి తన అభిమానాన్ని చూపించారు. ఈ క్షణంలో ఆమె భావోద్వేగానికి లోనయ్యారు. ఆమె ఆవేశాన్ని గమనించిన చిరంజీవి, ఆమెను ఆప్యాయంగా ఓదార్చారు. ఆమెకి చీరను బహుమతిగా ఇచ్చిన చిరు, ఆమె పిల్లల చదువు భాద్యతను తన భుజాలపై వేసుకుంటానని ప్రకటించారు. “పిల్లలు బాగా చదువుకుని మంచి ఉద్యోగాలు సాధించి మీకు మద్దతుగా నిలవాలి,” అని కోరారు.
విశాఖపట్నం పర్యటనలో భాగంగా జనసేన అధినేత, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ రుషికొండలో గత ప్రభుత్వ కాలంలో నిర్మించిన విలాసవంతమైన…
War 2 | మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ నటించిన లేటెస్ట్ మూవీ వార్ 2 .కొరటాల శివ దర్శకత్వంలో వచ్చిన…
Barrelakka | తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో “బర్రెలక్క”గా అందరి దృష్టిని ఆకర్షించిన శిరీష్ ఇప్పుడు మరోసారి హాట్ టాపిక్‌గా నిలిచింది.…
Hansika | స్టార్ హీరోయిన్ హన్సిక వ్యక్తిగత జీవితంపై గత కొద్దిరోజులుగా సోషల్ మీడియాలో రకరకాల పుకార్లు హల్‌చల్ చేస్తున్న…
LOBO | టీవీ నటుడు, బిగ్‌బాస్ కంటెస్టెంట్, యాంకర్ లోబోకు ఏడాది జైలు శిక్ష విధిస్తూ కోర్టు తీర్పు వెల్లడించింది.…
Sleep | మానసిక ఒత్తిడి, ఆహార అలవాట్లు ఇలా ఎన్నో కారణాల వల్ల చాలా మంది నిద్రలేమితో బాధపడుతున్నారు. ఈ పరిస్థితుల్లో…
Clove Side Effects | లవంగం అనేది మన ఇండియన్ కిచెన్‌లో తప్పనిసరి సుగంధ ద్రవ్యం. వండిన ఆహారానికి రుచి,…
Health Tips | పాలు, పెరుగు ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే ఆహార పదార్థాలుగా ఎంతో మందికి తెలిసిందే. అయితే…
This website uses cookies.