Chiranjeevi : మెగా లైనప్‌కు భయపడుతున్న మెగా ఫ్యాన్స్.. | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Chiranjeevi : మెగా లైనప్‌కు భయపడుతున్న మెగా ఫ్యాన్స్..

 Authored By govind | The Telugu News | Updated on :1 May 2022,10:00 am

Chiranjeevi:నిన్నటి వరకు మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న సినిమాల మీద భారీ అంచనాలుండేవి. కానీ, తాజాగా వచ్చిన ఆచార్య సినిమా ఫలితం ఇప్పుడు అన్నీ సినిమాల మీద కొత్త సందేహాలను రేకెత్తిస్తున్నాయని సోషల్ మీడియాలో టాక్ వినిపిస్తోంది. కొరటాల కెరీర్‌లో వరుసగా నాలుగు భారీ హిట్స్ ఉన్న కారణంగా చిరంజీవి ఆయనకు ఆచార్య సినిమా అవకాశం ఇచ్చారు. అది కాస్తా మెగా మల్టీస్టారర్‌గా మార్చారు కొరటాల. దాంతో అభిమానులు కోరుకున్న భారీ మెగా మల్టీస్టారర్ వస్తుందని ఆశపడ్డారు.కానీ, కొరటాల ఇద్దరు మెగా హీరోలు దొరికే సరికి కథ – కథనం గురించి మర్చిపోయి

వారిద్దరినీ ఎలా స్క్రీన్ మీద చూపించాలనే ఆలోచనతోనే సినిమానుతీశాడు. దాంతో కథలేని..పాత చింతకాయ పచ్చడి లాంటి ఆచార్య తయారైంది. ఇక భారీ స్థాయిలో థియేటర్స్‌లోకి వచ్చిన ఆచార్య కనీసం 24 గంటలు కూడా గడవక ముందే చాలా థియేటర్స్‌లో ఎత్తేయడం షాకింగ్ విషయం. ఇలా మెగాస్టార్ కెరీర్‌లో ఎప్పుడూ జరగలేదని చెప్పాలి. గతంలో చిరు సినిమా ఫ్లాపయినా కనీసం మొదటి వారం అయినా ఆడించేవారు.కానీ, ఆచార్య విషయంలో మాత్రం అంత సాహసం చేయలేకపోతున్నారు.

chiranjeevi fans are in tension regarding his next movies

chiranjeevi-fans are in tension regarding his next movies

Chiranjeevi : ఈ లైనప్‌కు ఇప్పుడు మెగా అభిమానులు కంగారు పడుతున్నారు.

అందుకే, ఆర్ఆర్ఆర్ లేదా కేజీఎఫ్ 2 చిత్రాలను రెండవ రోజు నుంచే ప్రదర్శించడం మొదలు పెట్టారట. ఇప్పుడు ఈ ప్రభావంతో మెగా ఫ్యాన్స్ చిరు నెక్స్ట్ సినిమాల గురించి కంగారు పడుతున్నారు. మోహన్ రాజాకు మన టాలీవుడ్ సినిమాను తెరకెక్కించిన అనుభవం లేదు. కాబట్టి గాడ్ ఫాదర్ సినిమా ఎలా ఉంటుందో అని ఒక వైపు భయపడుతున్న ఫ్యాన్స్, కనీసం వార్తల్లో కూడా లేని మెహర్ రమేశ్ చేతికి భోళా శంకర్ సినిమాను అప్పగించడం..అలాగే, మెగా 154 చిత్రాన్ని బాబీకి, ఆ తర్వాత చిత్రాన్ని రెండు మీడియం సినిమాలను తీసి హిట్ అందుకున్న వెంకీ కుడుమలతో చేస్తున్నారు. ఈ లైనప్‌కు ఇప్పుడు మెగా అభిమానులు కంగారు పడుతున్నారు.

govind

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది