Chiranjeevi : మెగా స్టార్ మరీ ఇంత భోళా అయ్యాడు ఏంటి భయ్యా!

Authored By Prahbas Gilakathula | The Telugu News | Updated on : 28 June 2022, 2:30 pm

Chiranjeevi : మెగాస్టార్ చిరంజీవి ఈమద్య కాలంలో ఆచార్య సినిమా తో ప్రేక్షకుల ముందుకు వచ్చి డిజాస్టర్‌ ను చవి చూసిన విషయం తెల్సిందే. ఆ సినిమా మరీ దారుణంగా ప్లాప్ అవ్వడంతో చిరంజీవి సినిమాల ఎంపిక విషయంలో ఒకింత జాగ్రత్త తీసుకుంటాడని అంతా భావించారు. కాని ఆయన మాత్రం కనిపించిన ప్రతి ఒక్కరికి హామీ ఇచ్చేస్తూ.. సినిమా చేసేద్దాం అంటున్నాడు. ఇప్పటికే ఏమాత్రం బజ్ లేని గాడ్ పాదర్‌ మరియు భోళా శంకర్ సినిమాలు చేస్తున్న చిరంజీవి మరో వైపు ఇంకో ఇద్దరు చిన్న దర్శకులకు సినిమా చేసే అవకాశం ఇవ్వడం చర్చనీయాంశంగా మారింది.

మెగాస్టార్‌ స్టామినా కు తగ్గట్లుగా సినిమాలు చేసే దర్శకులు ఇండస్ట్రీలో చాలా తక్కువ మంది మాత్రమే ఉన్నారు. అలాంటి వారికి ఛాన్స్ ఇవ్వకుండా ఇబ్బడి ముబ్బడిగా సినిమాలు చేయాలనే ఉద్దేశ్యంతో ఇలా అడ్డదిడ్డంగా కొత్త దర్శకులుకు డేట్లు ఇస్తే అన్ని ఆచార్య సినిమా లే అవుతాయి అంటూ విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. సోషల్‌ మీడియాలో గత కొన్ని రోజులుగా ఈ విషయమై మెగా ఫ్యాన్స్ చర్చించుకుంటున్నారు. ఈ సమయంలోనే మారుతికి కూడా డేట్లు ఇవ్వబోతున్నట్లుగా పక్కా కమర్సియల్‌ స్టేజ్ మీద చెప్పేశాడు. మొన్నటి వరకు బాలయ్యను భోళా అనే వారు.

Chiranjeevi fans unhappy with his movies selection

Chiranjeevi fans unhappy with his movies selection

తన వద్దకు వచ్చి నాలుగు మంచి మాటలు చెప్పి.. మీరు తోపు అంటే చాలు బాలయ్య డేట్లు ఇచ్చేవాడట. అందువల్లే బాలయ్య కెరీర్‌ లో ఎన్నో దారుణమైన పరాజయాలు ఉన్నాయి. ఇప్పుడు బాలయ్య కాస్త గాడిన పడ్డట్లుగా ఉన్నాడు. ఇప్పుడు చిరంజీవి ఆ ప్లేస్ ను ఆక్రమించినట్లుగా భోళా గా తయారు అయ్యాడు. ఈ విషయంలో చిరంజీవి అభిమానులతో పాటు ప్రతి ఒక్కరు కూడా అసంతృప్తితో ఉన్నారు. చిరంజీవి ఫ్యాన్స్ ఇష్టానుసారంగా చిరు సినిమాలకు కమిట్ అవ్వడం ను తప్పుబడుతున్నారు. మారుతి వంటి చిన్న దర్శకుడితో సినిమా అవసరమా అంటూ కొందరు ప్రశ్నిస్తున్నారు.

Advertisement

Prahbas Gilakathula

Prabhas Gilakathula Content Writer experiened in Digital media field. Iam worked in various Telugu media for about 5 years. Worked in Namasthe Telangana, Telugu Rajyam , as a telugu content writer. I wrote various Latest Breaking News , politics, interesting stories, Andhr Pradesh & Telangana local news, health, technology, entertainment , Devotional, etc. He is also Social Media Expert, Technical Expert . He is present content writer of thetelugunews.com website. Contact details: Prabhas29nov@gmail.com

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి