Chiranjeevi : మెగాస్టార్ చిరంజీవి తండ్రి కూడా నటుడే .. ఆయన నటించిన సినిమాలేంటో తెలుసా..?
Chiranjeevi : మెగాస్టార్ చిరంజీవి నటుడవ్వాలనుకున్నప్పుడు మద్రాసులో దేవదాసు కనకాల గారి యాక్టింగ్ స్కూల్ లో జాయిన్ అయ్యారు. ఆ కోర్స్ పూర్తవుతుండగానే చిరంజీవికి పునాది రాళ్ళు అనే సినిమాలో అవకాశం వచ్చింది. గూడపాటి రాజ్ కుమార్ ఈ సినిమాకి దర్శకుడు. ఈ సినిమా ఫస్ట్ షాట్ పొలంలో నలుగురు స్నేహితులతో కలిసి చిరంజీవి పనిచేస్తుంటాడు. అయితే షాట్ తీసేటప్పుడు రియలిస్టిక్ గా ఉంటుందని నాలుగు గడ్డి పోచలు తలమీద పెట్టుకున్నాడట. అది చూసిన కెమెరా మ్యాన్ నువ్వు భవిష్యత్తులో స్టార్ హీరో అవుతానని చెప్పాడట.
ఆ తర్వాత ప్రముఖ దర్శకుడు బాపు దర్శకత్వంలో వచ్చిన మన ఊరి పాండవులు సినిమాలో అవకాశం ఇచ్చారు. ఈ సినిమా సూపర్ హిట్ అయింది. ఇందులో చిరంజీవి నటన చూసిన బాపుగారు మరో సినిమాను చిరంజీవితో చేయాలనుకున్నారు. అదే మంత్రిగారి వియ్యంకుడు. ఈ సినిమాలో చిరంజీవి పూర్ణిమ జయరాం జంటగా నటించగా జయకృష్ణ నిర్మాతగా వ్యవహరించారు. ఇక ఇందులో ఉన్న ముఖ్య పాత్ర మంత్రి పాత్రను ఎవరితో వేయిస్తే బావుంటుందనే డిస్కర్షన్ వచ్చినప్పుడు అల్లు రామలింగయ్య ..మా బావగారున్నారు కదా, ఆయనతో వేయిద్దమా అని సలహా ఇచ్చారట.
Chiranjeevi : మంత్రిగారి వియ్యంకుడు సినిమాలో చిరంజీవి తండ్రి వెంకట్రావు మంత్రిగా కనిపించారు.
అలా మంత్రిగారి వియ్యంకుడు సినిమాలో చిరంజీవి తండ్రి వెంకట్రావు మంత్రిగా కనిపించారు. ఇక దీనికంటే ముందే చిరంజీవి తండ్రి ఓ సినిమాలో నటించారు. ఆ సినిమా 1969లో వచ్చిన జగత్ జెట్టీలు.
ఈ సినిమా తర్వాత వరుసగా సినిమాలలో నటించే అవకాశాలు వచ్చినా కూడా కుటుంబ బాధ్యతల వల్ల ఒకటి రెండు సినిమాలలో మాత్రమే నటించారు తప్ప నటుడిగా కంటిన్యూ కాలేకపోయారు. వెంకట్రావు గారు ఎక్సైజ్ డిపార్ట్‌మెంట్‌లో ఇన్స్‌పెక్టర్‌గా పనిచేసేవారు. దాంతో ఆయన సినిమాలలోకి రాలేకపోవడం, పూర్తి స్థాయి నటుడిగా మారడానికి సాధ్యపడలేదు. ఇక చిరంజీవి కూడా పోలీస్ డిపార్ట్మెంట్‌లో నే ఉండేవారు. కానీ ఆయన సినీ ఇండస్ట్రీలోకి వచ్చి మెగాస్టార్ అయ్యారు.