Chiranjeevi : మెగాస్టార్ చిరంజీవి వివాదాలకు చాలా దూరం.ఆయన ఎప్పుడు చాలా సౌమ్యంగా ఉంటారు. ఎవరేమన్నా అన్నా కూడా నవ్వుతూ పలకరిస్తుంటారు. ఇటీవల గరికపాటి చిరంజీవితో అమార్యదగా ప్రవర్తించిన కూడా ఆయన చాలా లైట్ తీసుకున్నారు. అయితే ఇప్పుడు రవితేజతో చిరంజీవికి గొడవలు ఉన్నట్టు ప్రచారం జరుగుతుంది. అయతే ఇది రియల్ లైఫ్‌లో కాదు రీల్ లైఫ్‌లో. చిరంజీవి ప్రస్తుతం గాడ్ ఫాదర్ సక్సెస్‌ను ఎంజాయ్ చేస్తున్నారు. ఈ సినిమా విజయం సాధించడంతో చిరు టీం వరుస ఇంటర్వ్యూలు ఇస్తూ అభిమానుల్లో జోష్ నింపుతోంది.
కాగా చిరంజీవి చేస్తున్న సినిమాలకు సంబంధించి ఏదో ఒక అప్‌డేట్ ఫిలింనగర్ సర్కిల్‌లో రౌండప్ చేస్తూనే ఉంది. మెగాస్టార్ నటిస్తున్న చిత్రాల్లో ఒకటి 154వ సినిమా. బాబీ (కేఎస్ రవీంద్ర) డైరెక్షన్‌లో తెరకెక్కుతున్న ఈ చిత్రం కూడా శరవేగంగా పనులు జరుపుకుంటుంది. మాస్ ఎంటర్ టైనర్‌గా వస్తున్న ఈ చిత్రంలో మాస్ మహారాజా రవితేజ వైజాగ్ రంగరాజు అనే మాస్ పోలీసాఫీసర్‌గా నటిస్తున్నాడని టాలీవుడ్ సర్కిల్ లో జోరుగా వార్తలు షికారు చేస్తున్నాయి. ఇక చిరంజీవి వాల్తేరు వీరయ్యగా రవితేజ సోదరుడి పాత్రలో కనిపించబోతున్నాడట. ఇందులో రవితేజ చిరంజీవి మధ్య విబేదాలు ఏర్పడతాయని ఏదో విషయంలో గొడవలు పడతాయని ప్రచారం జరుగుతుంది.
మరి ఇందులో నిజమెంత ఉందనేది తెలియాల్సి ఉంది. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై తెరకెక్కుతున్న ఈ చిత్రంలో శృతిహాసన్ ఫీ మేల్ లీడ్ రోల్‌లో నటిస్తోంది. ఈ చిత్రానికి రాక్ స్టార్ దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు. దాదాపు 22 సంవత్సరాల తర్వాత రవితేజ, చిరంజీవి స్క్రీన్ షేర్ చేసుకుంటున్నారు. అంతకముందు వీరిద్దరు కలిసి అన్నయ్య సినిమాలో నటించారు. ఇందులో రవితేజ చిరు తమ్ముడిగాకనిపించి అలరించారు. ఇక ఇదిలా ఉంటే చిరంజీవి ప్రస్తుతం భోళా శంకర్ చిత్రంతో పలకరించేందుకు సిద్దమవుతున్నాడు. ఈ మూవీపై కూడా అంచనాలు బారీగానే ఉన్నాయి.
Passports : పాస్‌పోర్ట్ అత్యంత ముఖ్యమైన ప్రయాణ పత్రాలలో ఒకటి. అంతర్జాతీయ ప్రయాణాన్ని ధృవీకరించడమే కాకుండా, పాస్‌పోర్ట్ గుర్తింపు మరియు…
Mahakumbh Mela : ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్ మహాకుంభమేళా 2025 ఉత్సవాలకు సిద్ధమవుతుంది. 13 జనవరి 2025న ప్రయాగ్‌రాజ్‌లో కుంభమేళా నిర్వహించబడుతుంది.…
Ola Electric : ప్రభుత్వ విచారణ మరియు పెరుగుతున్న నష్టాల మధ్య వివాదాల్లో కూరుకుపోయిన ఓలా ఎలక్ట్రిక్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా…
YSR Congress Party : ఆంధ్రప్రదేశ్ పంపిణీ కంపెనీలు (డిస్కమ్‌లు) మరియు అదానీ గ్రూప్ మధ్య ప్రత్యక్ష ఒప్పందం లేదని…
Hair Tips : ప్రస్తుత కాలంలో చాలామందికి జుట్టు చివరలు చిట్లిపోయి నిర్జీవంగా మారిపోతాయి. దీంతో వెంట్రుకలు అనేవి ఊడిపోతూ…
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ సీజన్ 8 చివరి దశకు రానే వచ్చింది. మూడు వారాలలో…
Winter : చలికాలం రానే వచ్చేసింది. రోజురోజుకి చెల్లి ముదిరిపోతుంది. ఈసారి నవంబర్ నెలలోనే చలి మొదలైంది. ఇక ముందు ముందు…
Ind Vs Aus : సొంత గడ్డపై న్యూజిలాండ్ టీం అద్భుతంగా రాణించి భారత జట్టుని వైట్ వాష్ చేసింది.…
This website uses cookies.