Chiranjeevi : చిరు గొప్ప‌త‌నం ఇది కదా.. శిరీష్‌ని శ్రీజ పెళ్లి చేసుకున్నాక అంత హుందాగా స్పందించాడా..! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Chiranjeevi : చిరు గొప్ప‌త‌నం ఇది కదా.. శిరీష్‌ని శ్రీజ పెళ్లి చేసుకున్నాక అంత హుందాగా స్పందించాడా..!

Chiranjeevi  : మెగాస్టార్ చిరంజీవి ఏ విష‌యంలో అయిన చాలా ఓపికగా ఉంటారు. ప్ర‌తి విష‌యంలో కూడా ఆచితూచి స్పందిస్తూ ఉంటారు. ఆయ‌న‌ని విమ‌ర్శించే వారు కూడా చాలా త‌క్కువ‌. అయితే స్వయంకృషితో ఎంతో మంచి పేరు తెచ్చుకున్న చిరంజీవి ప‌రువు మొత్తం తీసింది చిన్న కూతురు శ్రీజ‌. తన క్లాస్‌ మేట్‌ శిరీష్‌ భరద్వాజ్‌ని పెళ్లి చేసుకున్న స‌మయంలో ఈ విష‌యం టాలీవుడ్‌లోనే కాదు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లోనూ అది పెద్ద సంచలనం రేపింది. తెలుగు చిత్ర […]

 Authored By ramu | The Telugu News | Updated on :23 June 2024,3:30 pm

ప్రధానాంశాలు:

  •  Chiranjeevi : చిరు గొప్ప‌త‌నం ఇది కదా.. శిరీష్‌ని శ్రీజ పెళ్లి చేసుకున్నాక అంత హుందాగా స్పందించాడా..!

Chiranjeevi  : మెగాస్టార్ చిరంజీవి ఏ విష‌యంలో అయిన చాలా ఓపికగా ఉంటారు. ప్ర‌తి విష‌యంలో కూడా ఆచితూచి స్పందిస్తూ ఉంటారు. ఆయ‌న‌ని విమ‌ర్శించే వారు కూడా చాలా త‌క్కువ‌. అయితే స్వయంకృషితో ఎంతో మంచి పేరు తెచ్చుకున్న చిరంజీవి ప‌రువు మొత్తం తీసింది చిన్న కూతురు శ్రీజ‌. తన క్లాస్‌ మేట్‌ శిరీష్‌ భరద్వాజ్‌ని పెళ్లి చేసుకున్న స‌మయంలో ఈ విష‌యం టాలీవుడ్‌లోనే కాదు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లోనూ అది పెద్ద సంచలనం రేపింది. తెలుగు చిత్ర పరిశ్రమకి మెగాస్టార్‌ అయిన చిరంజీవి కూతురు ఇలా చేయడంతో పెద్ద చర్చనీయాంశం అయ్యింది. అంతేకాదు తనకు ఫ్యామిలీ నుంచి థ్రెట్‌ ఉందని చెప్పి శ్రీజ కూడా కంప్లెయింట్‌ చేయడంతో ఈ విష‌యం మ‌రింత దుమారం రేపింది.

Chiranjeevi  ద‌టీజ్ చిరంజీవి

ఇరవై ఏళ్లు ఎంతో గారాభంగా, అల్లారు ముద్దుగా పెంచిన చేతులు కావడంతో ఆ మానసిక క్షోభ అనుభవిస్తారు. ఈ క్రమంలో కొంత ఆవేశానికి కూడా గురి కావడం సహజమే. చిరంజీవి విషయంలోనూ అదే జరిగింది. అయితే ఈ ఘటన జరిగిన తర్వాత చిరంజీవి తొలిసారి స్పందించారు. ఈ మేరకు ఆయన ఓ వీడియోని విడుదల చేశారు. కూతురు చేసిన ఘటన గురించి తన మనోభావాన్ని వెల్లడించారు. శ్రీజ చేసిన పని తమకు షాక్‌కి గురి చేసిందని, జీర్ణించుకోలేకపోతున్నామని తెలిపారు. పేరెంట్స్ గా ఆ బాధ తమకు ఉంటుందని వెల్లడించారు చిరంజీవి. అమ్మ శ్రీజ నువ్వు ఎక్కడ ఉన్నా సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకున్నారు.

Chiranjeevi చిరు గొప్ప‌త‌నం ఇది కదా శిరీష్‌ని శ్రీజ పెళ్లి చేసుకున్నాక అంత హుందాగా స్పందించాడా

Chiranjeevi : చిరు గొప్ప‌త‌నం ఇది కదా.. శిరీష్‌ని శ్రీజ పెళ్లి చేసుకున్నాక అంత హుందాగా స్పందించాడా..!

పిల్లల ఇష్టాఇష్టాలకు మేము ఎప్పుడూ విలువనిచ్చేవాళ్లమే. అయితే మేజర్ అయిన శ్రీజ సడెన్‌గా తీసుకున్న నిర్ణయానికి మేం అంతా షాక్‌ అయిన మాట నిజమే. కానీ వాస్తవంలోకి వచ్చి ఆలోచించిన తర్వాత శ్రీజ సుఖ సంతోషాలే మాకు ప్రధానం. అదే మాకు ముఖ్యం. మా కుటుంబ సభ్యులందరు అదే కోరుకుంటున్నారు. అమ్మ శ్రీజ నువ్వు ఎక్కడ ఉన్నా హ్యాపీగా ఉండాలి. నీ సంతోషమే మా సంతోషం. ఈ సంఘటన పట్ల ఆవేదన చెందిన నా శ్రేయోభిలాషులను ఒక్కటే కోరుకుంటున్నాను. మీ ఆశిస్సులు నా బిడ్డకి కావాలి. అదే ఆమెకి శ్రీరామ రక్ష అని వీడియో విడుదల చేశారు చిరంజీవి. 16 ఏళ్ల క్రితం నాటి వీడియో ఇప్పుడు వైర‌ల్ అవుతుంది. కాగా ఇటీవ‌ల శ్రీజ మాజీ భ‌ర్త శిరీష్ అనారోగ్యంతో క‌న్నుమూసిన విష‌యం తెలిసిందే.

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది