GodFather Movie : గాడ్‌ ఫాదర్‌, భీమ్లా నాయక్‌ కి చేసిన సాహసం చేయలేదట! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

GodFather Movie : గాడ్‌ ఫాదర్‌, భీమ్లా నాయక్‌ కి చేసిన సాహసం చేయలేదట!

 Authored By aruna | The Telugu News | Updated on :23 August 2022,7:40 pm

GodFather Movie : మెగాస్టార్ చిరంజీవి గాడ్ ఫాదర్ సినిమా తో అక్టోబర్ 5వ తారీకున దసరా కానుకగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెల్సిందే. గాడ్‌ ఫాదర్‌ సినిమా మలయాళ సూపర్‌ హిట్ సినిమా లూసీఫర్ కి రీమేక్ అనే విషయం కూడా అందరికి తెల్సిన విషయమే. రీమేక్ అంటే ఉన్నది ఉన్నట్లుగా తీయడం అంటూ గతంలో ఒక అభిప్రాయం ఉండేది. కాని భీమ్లా నాయక్ సినిమా తో ఆ అభిప్రాయంను పవన్ మార్చేశాడు. వకీల్‌ సాబ్‌ మరియు భీమ్లా నాయక్‌ సినిమాలను ఒరిజినల్‌ కు పూర్తి గా మార్చేసి కమర్షియల్‌ సినిమాల మాదిరిగా ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చి అందరి దృష్టిని ఆకర్షించిన విషయం తెల్సిందే.

ముఖ్యంగా భీమ్లా నాయక్‌ సినిమా ను ఒరిజినల్‌ అయ్యప్పనుమ్‌ కోషియుమ్‌ కు ఏమాత్రం తగ్గకుండా రూపొందించడంతో పాటు పూర్తిగా కమర్షియల్‌ హంగులు అద్దాడు. వకీల్‌ సాబ్‌ సినిమా ను కూడా మార్చేశాడు. పవన్ చేసిన ఈ రెండు రీమేక్ ల సాహసం ను మెగాస్టార్‌ చిరంజీవి గాడ్ ఫాదర్ కి చేయలేక పోయాడు అంటూ ఇండస్ట్రీ వర్గాల ద్వారా సమాచారం అందుతోంది. లూసీఫర్ ను ఉన్నది ఉన్నట్లుగా దాదాపుగా 98 శాతం సేమ్‌ చిత్రీకరించినట్లుగా తెలుస్తోంది.

chiranjeevi GodFather Movie and pawan kalyan bheemla nayak movies difference

chiranjeevi GodFather Movie and pawan kalyan bheemla nayak movies difference

కొన్ని సన్నివేశాలు మినహా మొత్తం కథ అంతా కూడా సేమ్‌ ఉంచడంతో పాటు సినిమాకు సంబంధించిన స్క్రీన్‌ ప్లే ను కూడా మార్చలేదు అంటున్నారు. తాజాగా విడుదల అయిన టీజర్ ను చూస్తూ ఉంటే లూసీఫర్ ను తెలుగు వర్షన్ లో చూసినట్లుగానే అనిపిస్తుంది అంటూ కామెంట్స్ వస్తున్నాయి. రీమేక్ చేస్తే మార్పులు చేర్పులు చేసి తీసుకు వస్తే ఎంత వరకు సక్సెస్ అవుతుంది అనేది క్లారిటీ లేదు. అందుకే లూసీఫర్‌ ను ఉన్నది ఉన్నట్లుగానే మార్చకుండా గాడ్‌ ఫాదర్‌ గా తీసుకు వచ్చే ప్రయత్నం చేశారు అంటూ వార్తలు వస్తున్నాయి. గాడ్ ఫాదర్‌ ను ఉన్నతి ఉన్నట్లుగా తీసుకు రావడం వల్ల ఎంత వరకు చిరంజీవి సఫలం అవుతాడు.. సక్సెస్ అవుతాడు అనేది చూడాలి.

aruna

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది