Akkineni Nageswara Rao Afraid Of Jayasudha In Movie Shootings
Akkineni Nageswara Rao : అక్కినేని నాగేశ్వరరావు.. ఈయన ఎన్టీఆర్ గారు తెలుగు ఇండస్ట్రీకి రెండు కళ్లు అని చాలా మంది సీనియర్ సినీ పెద్దలు అంటున్నారు. ఇండస్ట్రీ చాలా కాలం ఒక్కటిగా ఉండటానికి, అభివృద్ధి చెండటానికి వీరిద్దరి కృషి ఎంతగానో ఉందని దర్శకనిర్మాతలు, సీనియర్ నటీనటులు పలుమార్లు చెప్పుకొచ్చారు. ఎన్టీఆర్-ఏఎన్నార్ సినిమాల్లో పోటీ పడి నటించడమే కాకుండా వీరి కుటుంబాల మధ్య స్నేహపూరిత బంధం ఉండేది.
ఏఎన్నార్ ఇండస్ట్రీలోని చాలా మంది హీరోయిన్స్‌తో పనిచేశారు. సావిత్రి లాంటి మహానటితో సైతం ఏఎన్నార్ స్క్రీన్ షేర్ చేసుకున్నారు.అయితే, ఏఎన్ఆర్‌కు హీరోయిన్ల ముద్దుల హీరో అనే పేరు ఉండేదని టాక్ వినిపిస్తోంది. హీరోయిన్ల విషయంలో ఏఎన్ఆర్ ఎంతో ప్రేమతో ఉండేవారట. సెట్స్ లో సరదాగా చిలిపి పనులు చేస్తూ వారిని ఆట పట్టిస్తూ ఉండడంతో పాటు వారిపై చమక్కులు కూడా వేసే వారట. అందుకే హీరోయిన్లు ఎన్టీఆర్ కంటే ఏఎన్ఆర్ ను ఎక్కువగా ఇష్టపడతారని అప్పట్లో టాక్ ఉండేది. ఎన్టీఆర్ సెట్ లో చాలా గంభీరంగా ఉండడంతో పాటు షూటింగ్ విషయంలో సీరియస్‌గా ఉండేవారట. ఎన్టీఆర్ సెట్స్ లో ఉంటే అక్కడ అంతా గంభీరమైన వాతావరణం నెలకొనేదట. అదే ఏఎన్ఆర్ సెట్లో ఉంటే అక్కడంతా సందడి సందడిగా ఉండేదట.
Akkineni Nageswara Rao Afraid Of Jayasudha In Movie Shootings
ఏఎన్ఆర్ కూడా తన కెరీర్లో ఎంతోమంది స్టార్ హీరోయిన్లతో నటించారు జయసుధ – జయప్రద – వాణిశ్రీ – జయచిత్ర – సావిత్రి – శ్రీవిద్య ఇలా అప్పటితరం టాప్ హీరోయిన్లు అందరతో కలిసి నటించారు. సహజనటి జజయసుధ యసుధ సెట్లో ఉంటే తనకు ఎందుకో భయం ఉంటుంది అని ఏఎన్నార్ అనేవారట.ఈ విషయాన్ని సీనియర్ నటుడు మురళీమోహన్ వెల్లడించారు. జయసుధ గొప్ప నటన గురించి ఏఎన్నార్ చెప్పిన మాటలను మురళీమోహన్ గుర్తుచేశారు.జయసుధపై సింగిల్ షాట్స్ తీస్తున్నప్పుడు ఆమె ఎక్స్‌ప్రెషన్స్ ఎలా ఇస్తుందో మనం గమనించకపోతే తర్వాత ఇద్దరిపై తీసే కామన్ షాట్స్‌లో మనం ఆమెను మించేలా ఎలా ఉండాలో తెలియక దెబ్బైపోతాం అని ఏఎన్నార్ మురళిమోహన్‌తో చెప్పారట..
CMF Phone 2 Pro | దసరా పండగ సీజన్ సందడిలో ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్ జోష్‌తో సాగుతోంది.…
Corona | కరోనా మహమ్మారి వెనుకడుగు వేసినా… దాని ప్రభావాలు ఇప్పటికీ చాలా మందిపై కొనసాగుతూనే ఉన్నాయి. ముఖ్యంగా ఘ్రాణశక్తి…
AP Farmers | ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 2025-26 పత్తి సీజన్‌కు సంబంధించి కీలక మార్గదర్శకాలను విడుదల చేసింది. రైతుల సంక్షేమాన్ని…
TGSRTC | దసరా పండుగను పురస్కరించుకుని తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీఎస్‌ఆర్టీసీ) ప్రయాణికులకు శుభవార్త చెప్పింది. పండుగ సందర్భంగా…
OG Collections | సుజీత్ దర్శకత్వంలో పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా రూపొందిన ఓజీ బారీ అంచనాల మధ్య సెప్టెంబర్…
OG | పవన్ కళ్యాణ్ తాజా చిత్రం ‘ఓజీ’ (ఒరిజినల్ గ్యాంగ్‌స్టర్) టికెట్ ధరల పెంపుపై తెలంగాణ రాష్ట్ర సినిమాటోగ్రఫీ…
Coconut | కొబ్బరి అంటేనే మనం వెంటనే ఆరోగ్యానికి మంచిదని భావిస్తాం. పచ్చి కొబ్బరి, కొబ్బరి నీళ్లు, కొబ్బరి నూనె…
Jackfruit seeds | రోజురోజుకూ మారుతున్న వాతావరణం, పుట్టుకొస్తున్న కొత్త వైరస్‌లు ప్రజల ఆరోగ్యాన్ని ముప్పుతిప్పులు పెడుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో…
This website uses cookies.