Chiranjeevi: చిరుకి బ‌ర్త్ డే విషెస్ చెప్ప‌ని బాల‌య్య‌, మోహ‌న్ బాబు… కార‌ణం అదేనా…?

Authored By vamana sai | The Telugu News | Updated on: August 24, 2021, 8:32 am

Chiranjeevi: టాలీవుడ్‌లో ప్రస్తుతం మా (మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్) ఎన్నికలు నిర్వహించే విషయంలో వివాదాలు, విబేధాలు చెలరేగుతున్న సంగతి తెలిసిందే. గత కొన్ని రోజులుగా దీనికి సంబంధించి రక రకాల వాదనలు మా సభ్యులు వినిపిస్తున్నారు. పోటీ చేస్తున్న వారు, వారికి సపోర్ట్ చేసే వారు తోచిన విధంగా తమ గొంతు వినిపిస్తున్నారు. ఇదిలా ఉంటే ఈ మధ్య కాలంలో చిరంజీవి – బాలకృష్ణల మధ్య పొంతన కుదరడం లేదు. చాలా కాలం నుంచి సమయం వచ్చినప్పుడల్లా బాలయ్య మెగా ఫ్యామిలీ, చిరంజీవి మీద వేసే పరోక్ష కామెంట్లు  విసురుకుంటున్న సంగతి అందరికీ తెలిసిందే.

chiranjeevi is not wished on his birthday by balayya and mohan babu

chiranjeevi is not wished on his birthday by balayya and mohan babu

కాగా ఈ సారి మా ఎన్నికలు వ్యవహారం మీద బాలయ్య ఇప్పటికే స్పందించి ఆయన అభిప్రాయాలను వెలిబుచ్చారు. ఈ సమయంలో చిరంజీవి మీద పరోక్షంగా కామెంట్లు చేశారు. ఇక మంచు ఫ్యామిలీ చిరంజీవితో ఎంతో సన్నిహితంగా ఉంటారు. మోహన్ బాబు, చిరంజీవిల స్నేహబంధం గురించి అందరికీ తెలిసిందే. ఇటీవల వీరిద్దరు ఓ పర్సనల్ ట్రిప్ కూడా వేసి వచ్చారు. అయితే మా ఎన్నిక వివాదం మొదలైనప్పటి నుంచి వీరిద్దరి మధ్య గ్యాప్ వచ్చినట్టు కనిపిస్తోంది.

Chiranjeevi: దీనికి కారణం ‘మా’ ఎలక్షన్సేనా..?

మా బరిలోకి మంచు విష్ణు దిగడంతోనే అసలు సమస్య మొదలైందనేది పలువురు ఇండస్ట్రీ ప్రముఖులు అభిప్రాయపడుతున్నారు. మరో వైపు ప్రకాష్ రాజ్‌కు మెగా మద్దతు గట్టిగా ఉంది. ఈ క్రమంలో మంచు, మెగా ఫ్యామిలీల మధ్య చిన్నపాటి మనస్పర్దలు వచ్చినట్టు ప్రస్తుతం టాక్ వినిపిస్తోంది. ఆగస్ట్ 22న చిరంజీవి బర్త్ డే. ఈ సందర్భంగా దాదాపు ఇండస్ట్రీలోని అందరూ విషెస్ తెలిపారు. వీరిలో మంచు మనోజ్, మంచు లక్ష్మీ, ఎన్టీఆర్‌లు కూడా ఉన్నారు. కానీ బాలయ్య, కళ్యాణ్ రామ్ స్పందించలేదు. అలాగే మంచు విష్ణు, మోహన్ బాబు కూడా విషెస్ చెప్పనట్టే తెలుస్తోంది. దీనికి కారణం ‘మా’ ఎలక్షన్సేనా..? అని కొందరు చర్చించుకుంటున్నారు. కానీ అందరికీ తెలిసేలా కాకుండా ఫోన్ ద్వారా చిరుకి వీరు విష్ చేసి ఉండొచ్చు కదా అనే మరో వైపు నుంచి కామెంట్స్ వినిపిస్తున్నాయి.

vamana sai

No bio available for this author.

  1. "Avocado Juice : ఆస్తమా సమస్యతో బాధపడుతున్నారా? అవకాడో జ్యూస్‌తో కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఇవే!"

  2. "Elon Musk : ఇండియాలో ఎలాన్ మస్క్‌కు గట్టి ఎదురుదెబ్బ.. స్టార్‌లింక్ లైసెన్స్‌పై కేంద్రం సంచలన నిర్ణయం!"

  3. "AP BC Politics : లోకల్ బాడీ ఎన్నికల్లో బీసీ ఓట్లపై రసవత్తర పోరు.. టీడీపీ, వైసీపీ మధ్య మొదలైన అసలైన మైండ్‌గేమ్!"

  4. "Chandrababu : జగనన్న కాలనీలపై కూటమి సర్కార్ సంచలన అడుగు.. 45 రోజుల డెడ్‌లైన్‌తో మంత్రుల కమిటీ ఏర్పాటు!"

  5. "Chinna Srinu : చిన్న శ్రీను లేకుండా విజయనగరంలో వైసీపీ నిలబడగలదా? బొత్స ఫ్యామిలీకి జీవన్మరణ సమస్యేనా..?"

  6. "AP Local Body Elections : ఈవీఎంలు లేవు.. బ్యాలెట్ పేపర్లతోనే ఎన్నికలు! ఏపీ ఎస్ఈసీ ప్రకటనతో పొలిటికల్ వర్గాల్లో ప్రకంపనలు..!"

  7. "Telangana Current Bills : తెలంగాణ ప్రజలకు కరెంట్ ఛార్జీల షాక్ ? ట్రూ-అప్ భారంపై రేవంత్ సర్కార్ మాస్టర్ ప్లాన్..!"

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp