Ram Charan : కాజల్ వల్ల ఆ ఇబ్బంది ఏర్పడింది : రామ్ చరణ్
Ram Charan : రామ్ చరణ్ తెరపై ఎలా ఉంటారు.. తెర వెనుక ఎలా ఉంటారో అందరికీ తెలిసిందే. ఈ మెగా పవర్ స్టార్‌కు జంతువులంటే ఎంతో ఇష్టం. చెర్రీ ఎక్కువగా మూగ జంతువులను ప్రేమిస్తుంటాడు. ఆయన ఇంట్లో ఎన్నో మూగ జీవాలుంటాయి. మరీ ముఖ్యంగా కుక్కలు, గుర్రాలను ఎక్కువగా సాధుతుంటాడు. చెర్రీకి తోడుగా ఉపాసన కూడా అంతే. ఉపాసన కూడా జంతు ప్రేమికురాలే. అయితే తాజాగా రామ్ చరణ్ తన వద్దున్న పెట్స్ గురించి చెప్పుకొచ్చాడు.
Ram Charan About Heroine Kajal And Horse KajalRam Charan : రామ్ చరణ్ ఎన్టీఆర్ కలిసి ఆర్ఆర్ఆర్ సినిమాలో కనిపించబోతోన్నారు. అయితే అంతకు ముందే.. బుల్లితెరపై కలిసి కనిపించారు. ఎవరు మీలో కోటీశ్వరులు అనే షోతో నిన్న రాత్రి బుల్లితెర ప్రేక్షకులను పలకరించారు. ఇందులో ఎన్నెన్నో ముచ్చట్లు పెట్టేసుకున్నారు. సినీ, పర్సనల్ లైఫ్ విషయాలను పంచుకున్నారు. ఈ క్రమంలోనే రామ్ చరణ్ తన పెట్స్ గురించి, తన వద్దున్న గుర్రాల గురించి చెప్పుకొచ్చాడు. తన వద్ద ఆరు కుక్కలున్నాయని చెర్రీ అన్నారు…
Ram Charan : కాజల్ వల్ల ఆ ఇబ్బంది ఏర్పడింది : రామ్ చరణ్
ఇక రెండు గుర్రాలున్నాయని అందులో ఒకటి బాద్ షా అని దాన్ని మగధీరలో వాడామని అన్నాడు. ఇక రెండో దాని పేరు కాజల్. కాజల్‌ను తన ఫ్రెండ్ చనిపోతూ తన చేతుల్లో పెట్టేశారని తెలిపాడు. ఆ గుర్రం కళ్లు మొత్తం నల్లగా ఉంటాయని అందుకే కాజల్ అని పెట్టామని అన్నాడు. మగధీరలో రెండు గుర్రాలను వాడామని, అందులో కాజల్ హీరోయిన్‌గా రావడంతో ఈ గుర్రాన్ని పిలవడం కూడా ఇబ్బంది అయిందని రామ్ చరణ్ సెటైర్ వేశాడు.