Anchor Suma : ఇక్కడ కూడా మీ ఆధిపత్యమేనా?.. యాంకర్ సుమపై హీరో ఫైర్
Anchor Suma : యాంకర్ సుమ ఎక్కడుంటే అక్కడ మాటల ప్రవాహామే. సుమ అడుగు పెడితే మిగతా వారంతా సైలెంట్ అయిపోవాల్సిందే. అలాంటిది సుమ నిన్న మెగా ఈవెంట్‌ను లైవ్‌లో నడిపించింది. ట్విట్టర్ స్పేస్లో యాంకర్ సుమ నిన్న చేసిన హడావిడి అంతా ఇంతా కాదు. నిన్న సాయంత్రం మెగాస్టార్ చిరంజీవి పుట్టిన రోజు సందర్భంగా అభిమానులందరూ ట్విట్టర్ స్పేస్‌లోకి వచ్చారు. ముచ్చట్లు పెట్టేశారు. టాలీవుడ్ సెలెబ్రిటీలు ఎక్కువగా ఈ స్పేస్‌లోకి వచ్చేశారు.
యాంకర్ సుమపై హీరో ఫైర్ Anchor Suma
ఇక ఇందులో భాగంగానే యంగ్ హీరో తేజ సజ్జా ఎంట్రీ ఇచ్చాడు. యాంకర్ సుమ ఒకరి తరువాత ఒకరికి స్వాగతం పలుకుతూ వచ్చింది. అందులో తేజ సజ్జాకు కాస్త ఆలస్యమైంది. మాట్లాడేందుకు తేజ కాస్త ఎదురుచూడాల్సిన సమయం వచ్చింది.
Anchor Suma : దీంతో సుమ మీద కౌంటర్లు వేశాడు. మీరు అలా పిలుస్తుంటే స్టార్ మహిళ షో కోసం వచ్చినట్టుంది. ఇది మా మెగా అభిమానుల మీటింగ్.. ఇక్కడ కూడా మీ ఆధిపత్యమేనా అంటూ సుమ మీద కౌంటర్లు వేశాడు తేజ.అయితే తేజను కూడా సుమ ఓ రేంజ్‌లో ఆడుకుంది. నీకు సంబంధించిన సీక్రెట్ ఒకటి ఉంది.. రివీల్ చేయనా?.. ఎప్పటికైనా చెప్పాల్సిందే కదా? ఎందుకు అలా వెయిట్ చేస్తున్నావ్.. అంటూ తేజను కంగారు పెట్టేసింది సుమ.
ఏంటో చెప్పండి.. బుర్ర బద్దలవుతోందంటూ తేజ కంగారు పడ్డాడు. రేపు (ఆగస్ట్ 23) నీ బర్త్ డే కదా? అని తేజ గాలి తీసేసింది సుమ. నా బర్త్ డే కంటే నేను ఎక్కువగా మెగాస్టార్ బర్త్ డే కోసం ఎదురుచూస్తుంటాను అని తేజ చెప్పుకొచ్చాడు.