Chiranjeevi : చిరంజీవి మంచితనమే తన పతనానికి కారణం అయ్యిందా.. ! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Chiranjeevi : చిరంజీవి మంచితనమే తన పతనానికి కారణం అయ్యిందా.. !

 Authored By prabhas | The Telugu News | Updated on :13 August 2022,3:40 pm

Chiranjeevi : మెగాస్టార్ చిరంజీవి అంటే తెలుగు సినీ పరిశ్రమలో అందరికీ సుపరిచితమే. ఇక చిరు ఇండస్ట్రీలో మంచి చెడులను చూసుకుంటూ తన కెరీర్ ను ముందుకు తీసుకెళుతున్నాడని చెప్పవచ్చు. అయితే కొన్ని సందర్భాలలో అతి మంచితనం వల్ల మంచి జరగటం అనే విషయం పక్కన పెడితే చెడు ఎక్కువగా జరుగుతుందని మన పెద్దలు చెబుతూ ఉంటారు. అయితే చిరంజీవి వివాదాలకు వివాదాస్పదమైన విషయాల కూడా దూరంగా ఉంటారని చెప్పవచ్చు. అయితే ఈ మధ్యకాలంలో చిరంజీవి పైన తరచుగా ట్రోలింగ్ జరుగుతూ ఉంది. చిరంజీవి తప్పు ఏమాత్రం లేకపోయినా ఫ్యాన్స్ ఆయన్ని తరచూ ట్రోల్ చేయడం వలన ఫ్యాన్స్ చాలా బాధపడుతున్నారని చెప్పవచ్చు.

ఈమధ్య రిలీజ్ అయిన కళ్యాణ్ రామ్ సినిమా ‘ బిబిసార ‘మంచి పాజిటివ్ టాక్ ని తెచ్చుకుంది. కొంతమంది మెగాస్టార్ కళ్యాణ్ రామ్ అంటూ కూడా సోషల్ మీడియాలో చిరంజీవిని టార్గెట్ చేయడం జరిగింది. మరోవైపు కొద్ది రోజుల క్రితమే ‘ లాల్ సింగ్ చూద్దాం ‘ సినిమా ఇంటర్వ్యూ లో కూడా పాల్గొన్నారు. ఇక ఈ సినిమాకి సమర్పకుడిగా కూడా వ్యవహరించారు చిరంజీవి. అయితే ఇతర అంశాలతో సినిమాలు సక్సెస్ సాధించడానికి లేదా డిజాస్టర్ కావడానికి కారణం అవుతున్నాయని చెప్పవచ్చు. కానీ ఈ విషయంలో చిరంజీవి నీ టార్గెట్ చేస్తూ ట్రోల్ చేస్తూ ఉన్నారు.

Chiranjeevi kindness cause of his downfall

Chiranjeevi kindness cause of his downfall

చిరంజీవికి ఇప్పటికి ఏమాత్రం క్రేజ్ తగ్గలేదని చెప్పవచ్చు. 40 సంవత్సరాలుగా తన సినీ కెరియర్లో ఎన్నో విజయాలను అపజయాలను సాధించారు. వీటన్నిటితో పాటు ఎంతోమంది అభిమానులను కూడా సంపాదించారు. ఇక ఈమధ్య రాజకీయాలలోకి వెళ్లి మళ్లీ వెను తిరిగి వచ్చారు. ఇక చిరంజీవి సాధించిన రికార్డులు చాలానే ఉన్నాయి అని చెప్పవచ్చు. రెమ్యూనరేషన్ లో కూడా చిరంజీవి ప్రస్తుతం 30 కోట్ల రూపాయలు పైగా తీసుకుంటున్నాడని తెలుస్తుంది. ఇక దీంతో కొంతమంది అభిమానులు సైతం చిరంజీవి మంచితనమే ఆయనను ఇలా చేస్తుంది అంటూ ట్రోల్స్ చేసే వారిని హెచ్చరిస్తున్నారు. చిరంజీవికి అతి మంచితనం పనికిరాదని ఆయన అభిమానులు భావిస్తున్నారు.

prabhas

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది