Chiranjeevi : 60లో 20లా.. బాసు చెప్పొచ్చు క‌దా నీ సీక్రెట్ ఏంటో..! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Chiranjeevi : 60లో 20లా.. బాసు చెప్పొచ్చు క‌దా నీ సీక్రెట్ ఏంటో..!

 Authored By ramu | The Telugu News | Updated on :4 December 2024,7:00 pm

ప్రధానాంశాలు:

  •  Chiranjeevi : 60లో 20లా.. బాసు చెప్పొచ్చు క‌దా నీ సీక్రెట్ ఏంటో..!

Chiranjeevi : మెగాస్టార్ చిరంజీవి Megastar Chiranjeevi ఆరు ప‌దుల వ‌య‌స్సులో కూడా చాలా యాక్టివ్‌గా క‌నిపిస్తున్నారు. చిరంజీవిని ఇప్పుడు ఎవరు చూసినా కూడా ఆయన వయసు 66 అని ఎవరూ అనుకోరు. అలా ఫిజిక్ మెయింటైన్ చేస్తున్నాడు మెగాస్టార్. ఆ మధ్య తొమ్మిదేళ్లు రాజకీయాల్లోకి వెళ్ళినప్పుడు పూర్తిగా షేప్ అవుట్ అయ్యాడు చిరంజీవి. కానీ ఎప్పుడైతే ఖైదీ నెంబర్ 150 సినిమాతో మళ్లీ రీ ఎంట్రీ ఇచ్చాడో అప్పటి నుంచి మునుపటి మెగాస్టార్ కనిపిస్తున్నాడు. త యవ్వనంగా కనిపించడానికి చిరంజీవి ఎలాంటి హెల్త్ టిప్స్ పాటిస్తాడో తెలుసుకోవాలని చాలా మందికి ఉంటుంది. తన హెల్త్ టిప్స్ పెద్దగా సీక్రేట్స్ ఏం కావని.. దాని గురించి చాలా సార్లు ఇప్పటికే చెప్పానంటాడు మెగాస్టార్. 66 వయస్సులోనూ కిర్రాక్ అనిపించే స్టెప్పుులను వేస్తూ కుర్రకారు చేత ఈలలు వేయిస్తున్నారు.

Chiranjeevi 60లో 20లా బాసు చెప్పొచ్చు క‌దా నీ సీక్రెట్ ఏంటో

Chiranjeevi : 60లో 20లా.. బాసు చెప్పొచ్చు క‌దా నీ సీక్రెట్ ఏంటో..!

Chiranjeevi వింటేజ్ లుక్..

అందులోనూ అలుపెరగకుండా, ఫుల్ ఎనర్జిటిక్ గా వరుస సినిమాల్లో నటిస్తూ అభిమానులని ఆశ్చ‌ర్య‌ప‌రుస్తున్నారు. మానసికంగా దృఢంగా ఉన్నప్పుడే మనం మరింత ఆరోగ్యంగా, ఫిట్ గా ఉండగలుగుతామని చిరు నమ్ముతారు. అందుకే ఆయన మానసికంగా దృఢంగా ఉండేందుకు ఎంతో ప్రయత్నిస్తారట. అందులో ఒక వ్యక్తి ఎంత కూల్ గా ఉంటే అంత బ‌లంగా ఉంటార‌ని చిరంజీవి ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు. ఇలా స్ట్రెస్ ఫ్రీగా ఉండటం వల్ల మానసికంగా బలంగా ఉండగలుగుతామని.. తద్వారా శరీరం ఎంతో ప్రభావితం అవుతుందని ఆయన చెప్పుకొచ్చారు.ఈ మధ్య ఓ ఫంక్షన్‌లో తనకు, తన మిత్రుడు నాగార్జున కొన్ని ఫిట్‌నెస్ టిప్స్ ఇస్తూ ఉంటాడని, అవి తనకు ఎంతో హెల్ప్ చేస్తున్నాయని చెప్పుకొచ్చారు. నిజంగా నాగార్జున టిప్సే ఇందుకు కారణమో.. లేదంటే మెగాస్టార్ ఈ విషయంలో ఏదైనా ప్రత్యేక మార్గాన్ని కనుగొన్నారో తెలియదు కానీ.. ప్రస్తుతం ఆయన వింటేజ్ మెగాస్టార్‌ని తలపిస్తున్నారు

తాజాగా చిరంజీవి Chiranjeevi లేటెస్ట్ ఫొటోలను.. ఆయన టీమ్ సోషల్ మీడియాలో షేర్ చేయ‌గా అవి నెట్టింట తెగ వైర‌ల్ అవుతున్నాయి. బాసు అదిరిపోయాడుగా అంటూ కామెంట్ చేస్తున్నారు. ‘గ్యాంగ్‌లీడర్’ చిరు తిరిగొచ్చాడ్రా..’ అంటూ కామెంట్స్ చేస్తుండటం విశేషం. కాగా, తను కేవలం వెజిటేరియన్ ఫుడ్ ను మాత్రమే తింటానని చాలా సందర్భాల్లో తెలయజేశారు. అందులోనూ ప్రోటీన్లు ఎక్కువగా ఉండే ఫుడ్ కే ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తుంటారు. మరీ ముఖ్యంగా చిరు ఇంట్లో వండిని ఫుడ్ ను మాత్రమే తింటానని ఓ ఇంటర్వ్యూ వేధికగా తెలియజేశారు. అలాగే సినిమాల్లో తన క్యారెక్టర్ కు తగ్గట్టుగా బాడీని మార్చడం కోసం రెగ్యులర్ గా చిరు జిమ్ కు వెళుతుంటారు. అలా వెల్లడం వల్ల పాత్రకు తగ్గట్టు తయారవడంతో పాటుగా ఫిట్ గా కూడా ఉంటారని ఆయన వెల్లడించారు.

Tags :

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది