Chiranjeevi : ప‌వన్ క‌ళ్యాణ్ ఫ్యాన్‌గా చిరంజీవి న‌టిస్తున్నాడా.. ఏంటా సంగ‌తి?

Authored By Sam C | The Telugu News | Published on: May 27, 2022, 3:30 pm

Chiranjeevi : మెగాస్టార్ చిరంజీవి అడుగు జాడ‌ల్లోన‌డుస్తూ ప‌వ‌ర్ స్టార్‌గా అశేష ప్రేక్ష‌కాద‌ర‌ణ పొందిన న‌టుడు ప‌వ‌న్ క‌ళ్యాణ్‌. ఈయ‌నకి సామాన్యుల నుండి సెల‌బ్రిటీల వ‌ర‌కు అశేష‌మైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ప‌వ‌న్ అంటే ప‌డిచ‌చ్చే అభిమానులు కూడా ఆయ‌న‌కు ఉన్నారు. అయితే చిరంజీవి.. ప‌వ‌న్ క‌ళ్యాణ్ అభిమానిగా న‌టిస్తున్నాడంటూ ఓ ప్ర‌చారం జ‌రుగుతుంది. వివ‌రాల‌లోకి వెళితే.. చిరంజీవి ప్రస్తుతం నటిస్తున్న సినిమాలలో ”భోళా శంకర్” ఒకటి. ఇది తమిళ బ్లాక్ బస్టర్ ‘వేదాళమ్’ చిత్రానికి అధికారిక తెలుగు రీమేక్. మెహర్ రమేష్ దర్శకత్వంలో తెరకెక్కుతోంది.

రీమేక్ అయినప్పటికీ దర్శకుడు తెలుగు నేటివిటీకి తగ్గట్టుగా అనేక మార్పులు చేర్పులు చేసినట్లు తెలుస్తోంది.ఇప్పటికే ‘స్వాగ్ ఆఫ్ భోళా’ పేరుతో విడుదల చేసిన గ్లిమ్స్ కు మెగా అభిమానుల నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. షూటింగ్ దశలో ఉన్న ఈ సినిమాకు సంబంధించి ఓ ఆసక్తికరమైన వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. అదేంటంటే చిరు ‘భోళా శంకర్’ చిత్రంలో తన తమ్ముడు పవన్ కళ్యాణ్ అభిమానిగా కనిపిస్తారట. ఈ నేపథ్యంలోనే సినిమాలో పవన్ నటించిన ‘ఖుషి’ సీన్ ని రిపీట్ చేస్తున్నట్లు టాక్ వినిపిస్తోంది. పవన్ – భూమిక ల మధ్య వచ్చే నడుము సీన్ ఎంత హైలైట్ అయ్యిందో చెప్పాల్సిన పనిలేదు. ఇప్పుడు అదే సన్నివేశాన్ని ‘భోళా శంకర్’ లో స్పూఫ్ గా వాడుతున్నారట.

chiranjeevi looks pawan kalyan fan

chiranjeevi looks pawan kalyan fan

Chiranjeevi : ఇందులో ఎంత నిజం ఉంది?

చిరంజీవి – యాంకర్ శ్రీముఖి మధ్య ఆ సీన్ రాబోతుందని అంటున్నారు. మెగాస్టార్ రేంజ్ ఏంటి.. తన తమ్ముడు పవన్ కు ఫ్యాన్ గా నటించడం ఏంటి.. ‘ఖుషి’ నడుము సీన్ స్పూఫ్ లో నటించడం ఏంటని అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు. మరి మెహర్ రమేష్ ఆ రొమాంటిక్ సన్నివేశాన్ని సినిమాలో ఉంచుతారో లేదో చూడాలి. ఇకపోతే సిస్టర్ సెంటిమెంట్ తో కూడిన పవర్ ఫుల్ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ గా ‘భోళా శంకర్’ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఇందులో చిరంజీవి సరసన మిల్కీ బ్యూటీ తమన్నా భాటియా హీరోయిన్ గా నటిస్తోంది. చిరు సోదరిగా మహానటి కీర్తి సురేష్ కనిపించనుంది. రామబ్రహ్మం సుంకర సమర్పణలో ఏకే ఎంటర్టైనెంట్స్ బ్యానర్ పై అనిల్ సుంకర ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

Sam C

No bio available for this author.

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp