
Chiranjeevi made controversial comments Acharya effect seems
Chiranjeevi : మెగాస్టార్ చిరంజీవి ఎంత నిదానంగా ఉంటారనేది ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఎవరు ఎన్ని విమర్శలు చేసిన కూడా పెద్దగా పట్టించుకోరు. అందరిని కలుపుకోతూ ప్రేక్షకుల మెప్పు పొందుతుంటారు. అయితే చిరంజీవి రాజకీయాలలోకి వెళ్లిన సమయంలో చాలా మాటలు పడ్డారు. కొంత హార్ష్‌గా స్పందించాల్సి కూడా వచ్చింది. అయితే మధ్యలోనే రాజకీయాలు వదిలేసి సినిమాలతో బిజీ అయ్యారు. ఖైదీ నెం 150 సినిమాతో రీ ఎంట్రీ ఇచ్చిన చిరంజీవి రీసెంట్‌గా ఆచార్యతో పలకరించాడు. ఈ సినిమా దారుణంగా నిరాశపరచింది. ఆచార్య కష్టాలు చిరంజీవిపై చాలా ఎఫెక్ట్ చూపించాయి. ఇప్పటికీ ఆ జ్ఞాపకాల నుండి బయటపడలేకపోతున్నాడు. తాజాగా చిరు ఇన్‌డైరెక్ట్ కామెంట్స్ చేశారు. అవేంటో ఈ వీడియో చూస్తే తెలుస్తుంది.మీకు ఇంకా ఇలాంటి ఇంటరెస్టింగ్ వీడియోలు కావాలంటే మా చానెల్ ను ఫాలో అవ్వండి. ఈ వీడియోను లైక్ చేసి అందరికీ షేర్ చేయండి. బాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్ట్ అమీర్ ఖాన్ నటించిన లాల్ సింగ్ చద్దా సినిమా ఆగస్టు 11వ తేదీన ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతున్న విషయం తెలిసిందే.
హాలీవుడ్లో మంచి విజయాన్ని అందుకున్నటువంటి ఫారెస్ట్ గంప్ సినిమా కథ ఆధారంగా తెరకెక్కించిన ఈ సినిమాపై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఏర్పడుతున్నాయి. ఇక ఈ సినిమాను కేవలం హిందీలోనే కాకుండా సౌత్ ఇండస్ట్రీలో కూడా వివిధ భాషల్లో విడుదల చేయబోతున్నారు.తెలుగులో మెగాస్టార్ చిరంజీవి సమర్పణలో గీత ఆర్ట్స్ ఈ సినిమాను భారీ స్థాయిలోనే విడుదల చేస్తూ ఉండడం ఆసక్తికరంగా మారింది. ఈ సందర్భంగా చిత్ర యూనిట్ సభ్యులు ప్రత్యేకంగా తెలుగు ట్రైలర్ ను కూడా విడుదల చేశారు. మెగాస్టార్ చిరంజీవి ప్రత్యేకంగా ఆమిర్ ఖాన్ గురించి మాట్లాడిన విధానం ఎంతగానో ఆకట్టుకుంటుంది.ఈ క్రమంలో చిరంజీవి తన సినిమాల గురించి మాట్లాడుతూ పరోక్షంగా ‘ఆచార్య’ గురించి పరోక్షంగా చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్ గా మారాయి. అమీర్ ఖాన్ చేసే పాత్రలు తాను చేయడానికి సాహసించను అని చిరంజీవి అన్నారు. అలాంటి పాత్రలు అమీర్ ఖాన్ కి మాత్రమే సాధ్యం అని అన్నారు. నా వరకు వస్తే నేను చేసే సినిమాలు జన రంజకంగా ఉండాలి.
Chiranjeevi made controversial comments Acharya effect seems
అమీర్ ఖాన్ ప్రయోగాలు, సాహసాలు చేసి ప్రేక్షకులని మెప్పించి ఒప్పించగలరు అని అన్నారు. కానీ నేను మాత్రం ప్రేక్షకులు వినోదాన్ని కోరుకునే సినిమాలు మాత్రమే చేస్తాను అని అన్నారు. కానీ కొన్ని కొన్ని సార్లు నా ప్రమేయం లేకుండా, నా చేతుల్లో లేకుండా పోతుంది., వాటి గురించి మాట్లాడను అని నవ్వుతూ అన్నారు. ఆచార్య పరాజయం గురించే చిరంజీవి ఈ కామెంట్స్ పరోక్షంగా చేశారు.ఎన్నో అంచనాల మధ్య వచ్చిన ఆచార్య చిత్రం డిజాస్టర్ గా నిలిచింది. బయ్యర్లు తీవ్రంగా నష్టపోవడంతో పెద్ద వివాదమే జరిగింది. ఈ వివిధంలో దర్శకుడు కొరటాల శివ కూడా సమస్యలు ఎదుర్కొన్న సంగతి తెలిసిందే.అమీర్ ఖాన్ తరహాలోనే తాము సినిమాలు చేయడానికి ఎక్కువగా ఆసక్తి చూపిస్తున్నామని కానీ మాకు ఉన్న బౌండరీల వలన అవి సాధ్యపడటం లేదు అని అన్నారు. అలాగే అమీర్ ఖాన్ నటనకు ఎవరైనా సరే ఫిదా కావాల్సిందే అంటూ ఈ సినిమాను నేను తొందరపడి ఒప్పుకోలేదని.
గర్వపడి ఒక మంచి సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నాను అని మెగాస్టార్ వివరణ ఇచ్చారు.ఇక తెలుగు సినిమా ట్రైలర్ ను కూడా మెగాస్టార్ చిరంజీవి చేతుల మీదుగా విడుదల చేయగా మంచి రెస్పాన్స్ అయితే వస్తోంది. అలాగే ఈ వేడుకలో నాగచైతన్య అమీర్ ఖాన్ చేత తెలుగు డైలాగ్ కూడా చెప్పించారు. లాల్ సింగ్ చద్దా సినిమాలో నాగచైతన్య కూడా ఒక ఎమోషనల్ క్యారెక్టర్ లో నటించడం జరిగింది తప్పకుండా ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద మంచి ఓపెనింగ్స్ అందుకునే అవకాశం అయితే ఉంది బాలీవుడ్ లో కూడా చాలా రోజుల తర్వాత వస్తున్న బిగ్ స్టార్ సినిమా కావడంతో అందరి ఫోకస్ ఈ సినిమా పైనే ఉంది.ఇక చిరంజీవి విషయానికి వస్తే.. ప్రస్తుతం మోహన్ రాజా దర్శకత్వంలో వస్తున్న గాడ్ ఫాదర్ సినిమాలో నటిస్తున్నారు. ఈసినిమాకి సంబంధించి కేవలం రెండు పాటలు చిత్రీకరించాల్సి ఉందని తెలుస్తోంది. అందులో ఒకటి చిరంజీవి, సల్మాన్ ఖాన్‌లు కలిసి చిందేసే ఒక లవ్లీ సాంగ్ కాగా.. మరోకటి స్పెషల్ సాంగ్ అని తెలుస్తోంది.
Onion Black Streaks : ఏ కూర వండినా ఉల్లిగడ్డ అనేది కీలకం. ఉల్లిగడ్డ లేకుండా ఏ కూర వండలేం.…
Jaggery Vs Sugar : మనిషి నాలుకకు టేస్ట్ దొరికితే చాలు.. అది ఆరోగ్యానికి మంచిదా? చెడ్డదా? అనే ఆలోచనే…
Benefits of Eating Fish : చాలామందికి ఫిష్ అంటే పడదు. చికెన్, మటన్ అంటే లొట్టలేసుకుంటూ లాగించేస్తారు కానీ..…
Egg vs Paneer : ఎగ్ అంటే ఇష్టం లేని వాళ్లు ఉండరు. కానీ నాన్ వెజిటేరియన్లు మాత్రమే ఎగ్…
Snoring Health Issues : చాలామంది నిద్రపోయేటప్పుడు గురక పెడుతూ ఉంటారు. గురక పెట్టేవాళ్లకు వాళ్లు గురక పెడుతున్నట్టు తెలియదు.…
Ghee Coffee or Bullet Coffee : కాఫీ అంటే అందరికీ తెలుసు కానీ ఈ బుల్లెట్ కాఫీ ఏంటి…
Swallow Bubble Gum : టైమ్ పాస్ కోసం చాలామంది నోట్లో ఎప్పుడూ బబుల్ గమ్ ను నములుతూ ఉంటారు.…
Garlic Health Benefits : వెల్లుల్లి అనగానే చాలామందికి నచ్చదు. ఎందుకంటే అది చాలా ఘాటుగా ఉంటుంది. కూరల్లో వేసినా…
This website uses cookies.