Chiranjeevi : ప్రాపర్టీ అమ్ముకున్న చిరంజీవి.. ఎన్ని కోట్ల డీల్ అంటే? | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Chiranjeevi : ప్రాపర్టీ అమ్ముకున్న చిరంజీవి.. ఎన్ని కోట్ల డీల్ అంటే?

Chiranjeevi : మెగాస్టార్ చిరంజీవి ఆస్థి విలువను మనం లెక్క వేయలేం. ఎన్నో చోట్ల ఎన్నో ఆస్తులున్నాయి. ఇక చెన్నైలోని ఎన్నో విలువైన భూములు, ఆస్తులను ప్రజారాజ్యం టైంలో అమ్మేశారని అంటుంటారు. అయినా చిరంజీవికి హైద్రాబాద్‌లో ఎన్నో చోట్ల ఖరీదైన భూములున్నాయి. చిరు తన సంపాదనలో చాలా భాగం వరకు భూమి మీదే పెట్టారని అంటుంటారు. ఇక ఇప్పుడు చిరంజీవి తన ప్రాపర్టీని అమ్ముకుంటున్నట్టు తెలుస్తోంది. చిరంజీవికి ఫిల్మ్ నగర్‌లో మూడు వేల స్క్వేర్ యార్డ్‌ల స్థలం […]

 Authored By aruna | The Telugu News | Updated on :17 August 2022,2:40 pm

Chiranjeevi : మెగాస్టార్ చిరంజీవి ఆస్థి విలువను మనం లెక్క వేయలేం. ఎన్నో చోట్ల ఎన్నో ఆస్తులున్నాయి. ఇక చెన్నైలోని ఎన్నో విలువైన భూములు, ఆస్తులను ప్రజారాజ్యం టైంలో అమ్మేశారని అంటుంటారు. అయినా చిరంజీవికి హైద్రాబాద్‌లో ఎన్నో చోట్ల ఖరీదైన భూములున్నాయి. చిరు తన సంపాదనలో చాలా భాగం వరకు భూమి మీదే పెట్టారని అంటుంటారు. ఇక ఇప్పుడు చిరంజీవి తన ప్రాపర్టీని అమ్ముకుంటున్నట్టు తెలుస్తోంది.

చిరంజీవికి ఫిల్మ్ నగర్‌లో మూడు వేల స్క్వేర్ యార్డ్‌ల స్థలం ఉందట. దాన్ని 90వ దశకంలో దాదాపు 30 లక్షలకు కొన్నారట. ఇప్పుడు ఆ స్థలాన్నే చిరు అమ్మేస్తున్నారట. అయితే చిరంజీవి స్థాయికి ఇప్పుడు వీటిని అమ్ముకోవాల్సిన పరిస్థితి ఏమీ రాలేదు. కానీ చిరు మాత్రం వాటిని అమ్మేస్తున్నారట. ఈ మేరకు ఇండస్ట్రీలో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. దాని విలువ ఎంతగా ఉందో తెలిస్తే కళ్లు బైర్లు కమ్మాల్సిందే.

Chiranjeevi May Sells His Costly Property

Chiranjeevi May Sells His Costly Property

Chiranjeevi : రూ. 70 కోట్ల చిరు డీల్..

ఒక్కో స్క్వేర్ యార్డ్ విలువ దాదాపు రెండు లక్షలు ఉంటే.. డీట్ మాత్రం 2.35 లక్షల వరకు జరిగిందని తెలుస్తోంది. అలా మొత్తంగా ఈ ల్యాండ్ డీల్ రూ. 70కోట్ల వరకు జరిగిందని టాక్. అయితే చిరు మాత్రం అయిష్టంగానే ఈ ప్రాపర్టీని అమ్ముతోన్నట్టు తెలుస్తోంది. అవతలి పార్టీ చాలా ఒత్తిడి చేస్తుండటంతోనే ఇలా అమ్మేస్తున్నాడని టాక్. ఏది ఏమైనా చిరంజీవి మాత్రం ఇలా ప్రాపర్టీని అమ్ముకుంటున్నాడని అంతా అనుకుంటున్నారు.

చిరంజీవి ఆచార్య సినిమా దారుణంగా బెడిసి కొట్టేసింది. ఆ నష్టాలన్నీ కొరటాల శివ పూడ్చుకున్నాడు. ఇక ఇప్పుడు లైన్‌లో భోళా శంకర్, గాడ్ ఫాదర్, వాల్తేర్ వీరయ్య అనే సినిమాలున్నాయి. వాటి పరిస్థితి ఎలా ఉంటుందో చూడాలి.

aruna

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది