Chiranjeevi : అన్నయ్య ఆ సినిమా ఏమో కానీ, మన సినిమా ఎప్పుడు చెప్పండి ప్లీజ్! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Chiranjeevi : అన్నయ్య ఆ సినిమా ఏమో కానీ, మన సినిమా ఎప్పుడు చెప్పండి ప్లీజ్!

Chiranjeevi : మెగాస్టార్ చిరంజీవి పై అభిమానులు ఒకింత అసంతృప్తితో ఉన్నారు. ఇప్పటికే మెగాస్టార్ చిరంజీవి నటించిన గాడ్ ఫాదర్, బోలా శంకర్, వాల్తేరు వీరన్న సినిమాలు ప్రేక్షకుల ముందుకు రావాల్సి ఉండగా ఇప్పటి వరకు కనీసం వాటిని కూడా పూర్తి చేయలేదు. ఈ మూడు సినిమాలు కాకుండా వెంకీ కుడుముల దర్శకత్వంలో ఒక సినిమా అలాగే మరో సినిమా కూడా చిరంజీవి మొదలు పెట్టాల్సి ఉంది. కానీ అవేవీ పట్టనట్టుగా ప్రస్తుతం చిరంజీవి బాలీవుడ్ సినిమా […]

 Authored By aruna | The Telugu News | Updated on :11 August 2022,7:00 pm

Chiranjeevi : మెగాస్టార్ చిరంజీవి పై అభిమానులు ఒకింత అసంతృప్తితో ఉన్నారు. ఇప్పటికే మెగాస్టార్ చిరంజీవి నటించిన గాడ్ ఫాదర్, బోలా శంకర్, వాల్తేరు వీరన్న సినిమాలు ప్రేక్షకుల ముందుకు రావాల్సి ఉండగా ఇప్పటి వరకు కనీసం వాటిని కూడా పూర్తి చేయలేదు. ఈ మూడు సినిమాలు కాకుండా వెంకీ కుడుముల దర్శకత్వంలో ఒక సినిమా అలాగే మరో సినిమా కూడా చిరంజీవి మొదలు పెట్టాల్సి ఉంది. కానీ అవేవీ పట్టనట్టుగా ప్రస్తుతం చిరంజీవి బాలీవుడ్ సినిమా ప్రమోషన్ కార్యక్రమాల్లో బిజీగా ఉన్నాడు. చిరంజీవి లాల్‌ సింగ్‌ చడ్డా ని సమర్పిస్తున్న విషయం తెల్సిందే.

ఈ వారం విడుదల కాబోతున్న ఆ సినిమా కోసం ఆయన ప్రమోషన్ కార్యక్రమాలు నిర్వహిస్తున్న సంగతి ఏమో కాని మన సినిమా ఎప్పుడు మెగాస్టార్ అంటూ కొందరు ప్రశ్నిస్తున్నారు. మెగాస్టార్ చిరంజీవి తన సినిమాలను ఎప్పటికప్పుడు వాయిదా వేసుకుంటూ రావడం పట్ల ఇండస్ట్రీ వర్గాల వారు మరియు మెగా అభిమానులు అసంతృప్తితో ఉన్నారు. ప్రస్తుతం ఆయన సినిమాలకు సంబంధించిన కార్యక్రమాలు ఏమీ జరుగుతున్నట్లు గా లేదు. పూర్తిగా హిందీ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలు చిరంజీవి దృష్టి పెట్టాడు అంటూ మెగా కాంపౌండ్ సమాచారం అందుతోంది.

Chiranjeevi Movies Bhola Shankar And Valther Veeraiah

Chiranjeevi Movies Bhola Shankar And Valther Veeraiah

చిరంజీవి గాడ్ ఫాదర్ ఆగస్టులో వస్తుంది అంటూ మొన్నటి వరకు అంతా ఆసక్తిగా ఎదురు చూశారు. ఆగస్టు వచ్చేసింది.. వెళ్ళిపోతుంది కూడా ఆయన ఇప్పటి వరకు సినిమాకు సంబంధించిన ఎలాంటి అప్డేట్ లేదు. వచ్చే నెలలో అయినా గాడ్ ఫాదర్ ఉంటుందా అంటున్నారు. గాడ్ ఫాదర్ సినిమాను కనీసం దసరా వరకు అయినా విడుదల చేయాలి అంటూ విజ్ఞప్తి చేస్తున్నారు. ఆ తర్వాత భోళా శంకర్‌ మరియు వాల్తేరు వీరయ్య సినిమాలను కూడా విడుదల చేసి తదుపరి సినిమాల్లో బిజీ అవ్వాలని చిరంజీవి మెగా అభిమానులు విజ్ఞప్తి చేస్తున్నారు. మరి అన్నయ్య సినిమా విడుదలైన తర్వాత ఈ సినిమాలో తన సినిమాలను చేస్తాడా అనేది చూడాలి.

aruna

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది