Chiranjeevi : మృగరాజు మూవీలో సింహం కోసం అంత ఖ‌ర్చు చేశారా..? | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Chiranjeevi : మృగరాజు మూవీలో సింహం కోసం అంత ఖ‌ర్చు చేశారా..?

 Authored By mallesh | The Telugu News | Updated on :16 November 2021,6:15 am

Chiranjeevi.. టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి, అందాల ముద్దుగుమ్మలు సిమ్రన్, సంఘవి కలిసి నటించిన చిత్రం మృగరాజు. ఈ సినిమాను ప్రముఖ దర్శకుడు గుణశేఖర్ తెరకెక్కించారు. ఇక బ్లాక్ బస్టర్ నిర్మాత దేవీ వరప్రసాద్ ఈ సినిమాను నిర్మించారు. ఈ సినిమాకు ముందు వరకు దేవీ వరప్రసాద్ కేవలం చిరంజీవితో మాత్రమే ఆరు బ్లాక్ బస్టర్ చిత్రాలను తెరకెక్కించారు.

అంతే కాకుండా ఆయన తీసిన చాలా సినిమాలు కూడా బాక్సాఫీస్ వద్ద విజయాన్ని నమోదు చేసుకున్నాయి. కానీ చిరంజీవి నటించిన మృగరాజు చిత్రం మాత్రం పెద్ద డిజాస్టర్ గా నిలిచింది. ఈ సినిమాలో చిరంజీవితో పాటు మెగా బ్రదర్ నాగ బాబు కూడా కలిసి నటించారు.అప్పటికే ఎన్నో హాలీవుడ్ సినిమాలలో నటించిన జాక్ అనే సింహాన్ని ఈ సినిమాలో నటింపజేశారు. సింహం తో చిరంజీవి కొన్ని పోరాట సన్నివేశాల్లో కూడా నటించారు. సింహం కోసమే దేవీ వరప్రసాద్ ఏకంగా 67 లక్షల రూపాయలను ఖర్చు చేశారట.

chiranjeevi mrugaraju movie lion history

chiranjeevi mrugaraju movie lion history

Chiranjeevi.. సింహం కోసమే 67 లక్షలు..

67 లక్షల రూపాయలు పెట్టి సింహాన్ని 26 రోజుల పాటు షూటింగ్ లో పాల్గొనేలా చేశారు. కానీ ఈ సినిమా మాత్రం బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టింది. ఇక ఈ సినిమా కోసం చిరంజీవి ఏకంగా 150 రోజులు కష్టపడ్డారు. రోజుకి 20 గంటల పాటు పని చేశారు. ఇక ఈ సినిమాలోని పాటలు చాలా హిట్ అయ్యాయి. మెలోడీ బ్రహ్మ మణిశర్మ ఈ సినిమాకు స్వరాలు సమకూర్చాడు. సినిమా విడుదలకు ముందే విడుదలయిన ఈ సినిమా పాటలు సినిమా మీద అంచనాలను అమాంతం పెంచేశాయి.

అడవి బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కిన ఈ మూవీ ప్రేక్షకులకు అంతగా రుచించలేదనే చెప్పాలి. మరో విషయమేంటంటే ఈ సినిమాలో మొదటగా బాలీవుడ్ హాట్ బ్యూటీ సోనాలి బింద్రేను హీరోయిన్ గా తీసుకోవాలని టీం భావించిందట. కానీ సోనాలి బింద్రేకు డేట్లు అడ్జెస్ట్ కాకపోవడంతో ఆ అమ్మడు అర్ధాంతరంగా సినిమా నుంచి తప్పుకుంది. దీంతో చిత్ర యూనిట్ సోనాలి బింద్రే స్థానంలో సిమ్రాన్ ను హీరోయిన్ గా తీసుకుని చిత్రాన్ని కంప్లీట్ చేసింది.

mallesh

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది