
Chiranjeevi - Pawan Kalyan A big war between
Chiranjeevi – Pawan Kalyan : సంక్రాంతి రేసులో మెగా బ్రదర్స్ మధ్య పెద్ద వార్..? అవును మెగాస్టార్ చిరంజీవి ఇప్పటికే 2023 సంక్రాంతికి తన మెగా 154 సినిమాతో వస్తున్నట్టుగా కన్‌ఫర్మ్ చేశారు. ఆచార్యతో గట్టి దెబ్బ పడ్డ చిరు..ఈ సారి భారీ కొట్టాలనే కసితో ఉన్నారు. అందుకే తను చేస్తున్న సినిమాల వర్క్ విషయంలో స్పీడ్ పెంచారు. బాబి దర్శకత్వంలో మెగాస్టార్ నటిస్తున్న సినిమా షూటింగ్ ఇప్పటికే సగానికి పైగా కంప్లీట్ అయింది. మాస్ మహారాజా రవితేజ కీలక పాత్రలో నటిస్తున్న ఈ సినిమా వైజాగ్ పోర్ట్ నేపథ్యంలో పక్కా మాస్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతోంది.
ఈ సినిమాలో మెగాస్టార్ సరసన శృతి హాసన్ హీరోయిన్‌గా నటిస్తోంది. రవితేజ సరసన సంయుక్త మీనన్ నటిస్తుందనే ప్రచారం జరుగుతోంది. ఇటీవల ఈ సినిమా రిలీజ్ అప్‌డేట్ ఇచ్చిన మేకర్స్ 2023 సంక్రాంతికి కలుద్దాం అంటూ పోస్టర్ విడుదల చేశారు. ఇక తాజాగా మెగాస్టార్ నటిస్తున్న మరో సినిమా గాడ్ ఫాదర్ సినిమా కూడా ఇదే ఏడాది దసరా బరిలో దిగేందుకు అవకాశాలు ఉన్నాయి. ఈ నేపథ్యంగానే సినిమాకు సంబంధించిన అన్నీ కార్యక్రమాలను పూర్తి చేస్తున్నారు. ఈ సినిమా మీద కూడా భారీ అంచనాలున్నాయి. బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్, పూరి జగన్నాథ్, నయనతార, సత్యదేవ్ కీలక పాత్రలను పొషిస్తున్నారు.
Chiranjeevi – Pawan Kalyan A big war between
ఇక పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అన్న మెగాస్టార్ కి సంక్రాంతి బరిలో పోటీ కాబోతున్నాడా..? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. పాన్ ఇండియా స్థాయిలో క్రిష్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న హరిహర వీరమల్లు సినిమా షూటింగ్ ఈ ఏడాది ఆగస్టు లేదా సెప్టెంబర్ వరకు పూర్తి చేయాలని ప్లాన్ చేస్తున్నారు. ఇది పవన్ కళ్యాణ్ కెరీర్‌లో ఫస్ట్ పాన్ ఇండియా చిత్రం. దాదాపు 200 కోట్ల భారీ బడ్జెట్‌తో తెరకెక్కిస్తున్నారు. అయితే, ఈ పాన్ ఇండియా సినిమాను 2023 సంక్రాంతికి రిలీజ్ చేయాలని నిర్మాత ఏ ఎం రత్నం ప్లాన్ చేస్తున్నారట. ఇదే నిజమైతే బాక్సాఫీస్ వద్ద మెగా బ్రదర్స్ మధ్యే బిగ్ ఫైట్ నెలకొంటుంది. చూడాలి మరి హరిహర వీరమల్లు ఎప్పుడు అధికారికంగా రిలీజ్ డేట్‌ను ప్రకటిస్తారో.
Zodiac Signs : శుక్రవారం, జనవరి 30, 2026 నేటి రాశి ఫలాలు ఎలా ఉన్నాయో చూద్దాం. వైదిక జ్యోతిష్య…
Prabhas : భారతీయ చలనచిత్ర పరిశ్రమలో ఇద్దరు అగ్ర హీరోల సినిమాలు ఒకేసారి విడుదలవుతున్నాయంటే బాక్సాఫీస్ వద్ద యుద్ధ వాతావరణం…
Realme P4 Power 5G: ప్రముఖ స్మార్ట్ఫోన్ తయారీ సంస్థ రియల్మీ (Realme) భారత మార్కెట్లోకి మరో శక్తివంతమైన స్మార్ట్ఫోన్ను…
Upi Payments Fail : భారతదేశంలో డిజిటల్ విప్లవానికి చిహ్నంగా మారిన యూపీఐ సేవలు ఎంత వేగంగా ఉన్నాయో, సాంకేతిక…
Sunitha : ప్రముఖ సంగీత రియాలిటీ షో 'పాడుతా తీయగా' సీజన్-26 తాజా ఎపిసోడ్ ప్రోమో సంగీత ప్రియులను విశేషంగా…
Tirumala Laddu Prasadam : తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం తయారీలో ఉపయోగించే నెయ్యి కల్తీ జరిగిందంటూ గత కొంతకాలంగా…
Ys Jagan : ఏపీ రాజకీయాల్లో అనూహ్య మార్పులు చోటుచేసుకుంటున్నాయి. వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి ఇన్నాళ్లూ అనుసరించిన…
Vijay Karthik - Keerthi Bhat : బుల్లితెర నటి, 'కార్తీకదీపం' ఫేమ్ కీర్తి భట్ మరియు ఆమె కాబోయే…
This website uses cookies.