Chiranjeevi – Pawan Kalyan : సంక్రాంతి రేసులో మెగా బ్రదర్స్ మధ్య పెద్ద వార్..?

Advertisement

Chiranjeevi – Pawan Kalyan : సంక్రాంతి రేసులో మెగా బ్రదర్స్ మధ్య పెద్ద వార్..? అవును మెగాస్టార్ చిరంజీవి ఇప్పటికే 2023 సంక్రాంతికి తన మెగా 154 సినిమాతో వస్తున్నట్టుగా కన్‌ఫర్మ్ చేశారు. ఆచార్యతో గట్టి దెబ్బ పడ్డ చిరు..ఈ సారి భారీ కొట్టాలనే కసితో ఉన్నారు. అందుకే తను చేస్తున్న సినిమాల వర్క్ విషయంలో స్పీడ్ పెంచారు. బాబి దర్శకత్వంలో మెగాస్టార్ నటిస్తున్న సినిమా షూటింగ్ ఇప్పటికే సగానికి పైగా కంప్లీట్ అయింది. మాస్ మహారాజా రవితేజ కీలక పాత్రలో నటిస్తున్న ఈ సినిమా వైజాగ్ పోర్ట్ నేపథ్యంలో పక్కా మాస్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతోంది.

ఈ సినిమాలో మెగాస్టార్ సరసన శృతి హాసన్ హీరోయిన్‌గా నటిస్తోంది. రవితేజ సరసన సంయుక్త మీనన్ నటిస్తుందనే ప్రచారం జరుగుతోంది. ఇటీవల ఈ సినిమా రిలీజ్ అప్‌డేట్ ఇచ్చిన మేకర్స్ 2023 సంక్రాంతికి కలుద్దాం అంటూ పోస్టర్ విడుదల చేశారు. ఇక తాజాగా మెగాస్టార్ నటిస్తున్న మరో సినిమా గాడ్ ఫాదర్ సినిమా కూడా ఇదే ఏడాది దసరా బరిలో దిగేందుకు అవకాశాలు ఉన్నాయి. ఈ నేపథ్యంగానే సినిమాకు సంబంధించిన అన్నీ కార్యక్రమాలను పూర్తి చేస్తున్నారు. ఈ సినిమా మీద కూడా భారీ అంచనాలున్నాయి. బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్, పూరి జగన్నాథ్, నయనతార, సత్యదేవ్ కీలక పాత్రలను పొషిస్తున్నారు.

Advertisement
Chiranjeevi - Pawan Kalyan A big war between
Chiranjeevi – Pawan Kalyan A big war between

Chiranjeevi – Pawan Kalyan: బాక్సాఫీస్ వద్ద మెగా బ్రదర్స్ మధ్యే బిగ్ ఫైట్ నెలకొంటుంది.

ఇక పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అన్న మెగాస్టార్ కి సంక్రాంతి బరిలో పోటీ కాబోతున్నాడా..? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. పాన్ ఇండియా స్థాయిలో క్రిష్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న హరిహర వీరమల్లు సినిమా షూటింగ్ ఈ ఏడాది ఆగస్టు లేదా సెప్టెంబర్ వరకు పూర్తి చేయాలని ప్లాన్ చేస్తున్నారు. ఇది పవన్ కళ్యాణ్ కెరీర్‌లో ఫస్ట్ పాన్ ఇండియా చిత్రం. దాదాపు 200 కోట్ల భారీ బడ్జెట్‌తో తెరకెక్కిస్తున్నారు. అయితే, ఈ పాన్ ఇండియా సినిమాను 2023 సంక్రాంతికి రిలీజ్ చేయాలని నిర్మాత ఏ ఎం రత్నం ప్లాన్ చేస్తున్నారట. ఇదే నిజమైతే బాక్సాఫీస్ వద్ద మెగా బ్రదర్స్ మధ్యే బిగ్ ఫైట్ నెలకొంటుంది. చూడాలి మరి హరిహర వీరమల్లు ఎప్పుడు అధికారికంగా రిలీజ్ డేట్‌ను ప్రకటిస్తారో.

Advertisement
Advertisement