Chiranjeevi : ఒకే స్టేజి మీదకు పవన్ కల్యాణ్, బాలయ్య, చిరంజీవి.. అవును ఇది నిజ‌మే..!

Authored By mallesh | The Telugu News | Published on: September 29, 2021, 6:00 am

Chiranjeevi : టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో టాప్ హీరోలుగా దాదాపుగా పది మంది కొనసాగుతున్న సంగతి అందరికీ తెలిసిందే. వారి సినిమాలు వస్తే చాలు సినీ అభిమానులు అందరు తప్పకుండా వాటిని చూస్తుంటారు. అయితే, ఈ స్టార్ హీరోలు అందరు ఒకే వేదికపైకి వస్తే ఎలా ఉంటుంది? ఊహించుకోండి.. అత్యద్భుతం కదా.. అయితే, అలా అందరూ ఒకేసారి ఒకే ప్లేస్‌కు వచ్చే చాన్సెస్ చాలా తక్కువేనన్న మీరు అనుకోవచ్చు. అది నిజమే కూడా.. కానీ, ఇప్పుడు అటువంటి అరుదైన సంఘటన జరగబోతుందని టాలీవుడ్ వర్గాల ద్వారా తెలుస్తోంది. ఒకే వేదికను పవర్ స్టార్ పవన్ కల్యాణ్, నందమూరి నటసింహం బాలకృష్ణ, మెగాస్టార్ చిరంజీవి పంచుకోబోతున్నారట.. అదెక్కడ.. ఎప్పుడు అన్న విషయాలు తెలియాలంటే మీరు ఈ స్టోరిని ఫుల్లీ రీడ్ చేయాల్సిందే.

chiranjeevi pawan kalyan Balakrishna one stage

chiranjeevi pawan kalyan Balakrishna one stage

Chiranjeevi : సినీ అభిమానులకు ఇక పండుగే..

మెగాస్టార్ చిరంజీవి, పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ప్రజెంట్ వరుస సినిమాలు చేస్తున్నారు. ఒక సినిమా షూటింగ్ పూర్తి కాగానే మరో చిత్ర షూటింగ్‌లో పాల్గొనడంతో పాటు ప్యారలల్‌గా ఇంకో సినిమా షూటింగ్‌లోనూ పార్టిసిపేట్ చేస్తున్నారు. మొత్తంగా అభిమానులకు వారి తదుపరి చిత్రాలపై ఆసక్తి పెంచుతున్నారు. ఈ క్రమంలోనే మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పైన మెగాస్టార్ చిరంజీవి, పవర్ స్టార్ పవన్ కల్యాణ్, నందమూరి నటసింహం బాలకృష్ణ చిత్రాలు చేయబోతున్నారు. చిరంజీవి-బాబీ కాంబోలో మాస్ ఎంటర్‌టైనర్ రాబోతుంది. ఇప్పటికే చిరు బర్త్ డే ఫస్ట్ లుక్ పోస్టర్‌ను రివీల్ చేశారు. ఈ సినిమాకు ‘వాల్తేరు వీరయ్య’ అనే టైటిల్ ఎంపిక చేసినట్లు సమాచారం. ఇక పవర్ స్టార్ పవన్ కల్యాణ్-హరీశ్ శంకర్ కాంబోలో గతంలో వచ్చిన ‘గబ్బర్ సింగ్’ సూపర్ సక్సెస్ ఫుల్ ఫిల్మ్ కాగా, ఈ సారి వారు ‘భవదీయుడు భగత్ సింగ్’ అనే చిత్రాన్ని తీస్తున్నారు.

Chiranjeevi

Chiranjeevi

నందమూరి బాలకృష్ణతో మాస్ ఎంటర్‌టైనర్ తీసేందుకు ‘క్రాక్’ ఫేమ్ గోపీచంద్ మలినేని సిద్ధంగా ఉన్నారు. ఇప్పటికే బాలయ్య-గోపీచంద్ మలినేని కాంబో ఫిక్స్ అయింది. ఈ క్రమంలో ఈ మూడు చిత్రాల ఓపెనింగ్ విజయదశమి రోజున గ్రాండ్‌గా చేయాలనేది మైత్రీ మూవీ మేకర్స్ ఆలోచన. ఇందుకు ముగ్గురు హీరోలను పిలవాలని అనుకుంటున్నారు. అయితే, పవన్ కల్యాణ్, చిరంజీవి ఒకే వేదిక మీదకు రావడం ఓకే చెప్తారేమో. కానీ, ఈ వేడుకకు బాలయ్య హాజరవుతారా? అని చర్చ నడుస్తున్నది.. చూడాలి మరి మైత్రీ మూవీ మేకర్స్ ముగ్గురు హీరోలను ఒప్పించి అభిమానులకు కన్నుల పండువగా అయేలా చేస్తారో లేదో.. దసరా రోజున హ్యాపీగా తమకు నచ్చిన ముగ్గురు హీరోలను అభిమానులు ఒకే వేదిక మీద చూస్తారో లేదో తెలియాలంటే అప్పటి వరకు వెయిట్ చేయాల్సిందే.

Pawan kalyan

Pawan kalyan

mallesh

No bio available for this author.

  1. "Grand Electronics Sale : టీవీ, ఫ్రిజ్, వాషింగ్ మెషీన్ల కొనాలనుకునేవారికి గుడ్‌న్యూస్.. రూ.20 వేలపైగా భారీ డిస్కౌంట్లు..!"

  2. "Ysrcp Plan : పోరులో వైసీపీ అసలైన బలం అదేనా? గ్రౌండ్ లెవెల్ కేడర్‌పై జగన్ భారీ నమ్మకం..!"

  3. "Messi vs Ronaldo : మెస్సీయా.. రొనాల్డోనా? ఫుట్‌బాల్ ఆల్‌టైమ్ ‘గోట్’ ఎవరో తేల్చేసిన ఆ లెక్కలు..!"

  4. "Jailer 2 : తలైవా రజినీకాంత్.. ‘జైలర్ 2’ ప్రమోషన్లతో బాక్సాఫీస్ వద్ద రచ్చ లేపనున్నారా..?"

  5. "Ys Jagan : స్థానిక ఎన్నికల్లో గెలుపే టార్గెట్.. అభ్యర్థుల ఎంపికపై రీజనల్ ఇన్‌ఛార్జ్‌లతో వైఎస్ జగన్ మైండ్ గేమ్!"

  6. "Pawan kalyan : అరెస్ట్‌పై పవన్ కల్యాణ్ కామెంట్స్.. తమ్ముళ్ల ఆగ్రహంతో కూటమిలో సరికొత్త దుమారం?"

  7. "Nandamuri Tejaswini : మేయర్ రేసులో నందమూరి బాలకృష్ణ కుమార్తె? తెరపైకి తేజస్విని పేరుతో పొలిటికల్ హీట్!"

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp