Chiranjeevi : ఒకే ఫ్రేములో చిరంజీవి, పవన్ కళ్యాణ్, నాగబాబు.. మదర్స్ డే స్పెషల్ వీడియో
Chiranjeevi : ఈ రోజు మదర్స్ డే సందర్భంగా ప్రతి ఒక్కరు తమ తల్లిని గుర్తు చేసుకుంటున్నారు. మెగాస్టార్ చిరంజీవి మదర్స్ డే సందర్భంగా స్పెషల్ వీడియో షేర్ చేసి ఫ్యాన్స్‌కి మంచి ఫీస్ట్ అందించారు. ఓ సందర్భంలో చిరు, నాగబాబు, పవన్ కళ్యాణ్ ,అంజనమ్మ కలిసి భోజనం చేస్తున్న వీడియోని షర్ చేస్తూ అందరికి మాతృదినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. ముగ్గురు బ్రదర్స్ ఒకే ఫ్రేములో కనిపించడంతో ఫ్యాన్స్ ఆనందం అంతా ఇంతా కాదు. చిరంజీవి తన సోషల్ మీడియాలో షేర్ చేసిన వీడియో ఎంతగానో ఆకట్టుకుంటుంది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట తెగ హల్ చల్ చేస్తుంది.
మెగా మదర్ అంజనా దేవి, కొణిదెల వెంకట్రావు దంపతులుకు చిరంజీవి, నాగబాబు, పవన్ కళ్యాణ్‌తో పాటు విజయలక్ష్మి, మాధవి మొత్తం ఐదుగురు సంతానం. ముగ్గురు మొనగాళ్లను కన్న అమ్మ అంజనా దేవి అంటూ మెగా ఫ్యాన్స్ ఎప్పుడూ సరదాగా చెప్పుకుంటారు. చిరంజీవి, పవన్ కళ్యాణ్, నాగబాబు ముగ్గురూ ముగ్గురే.. అలాంటి స్టార్స్‌కు జన్మనిచ్చిన అమ్మని వారు ఎంతో ప్రేమగా చూసుకుంటూ ఉంటారు. మెగా బ్రదర్స్ ముగ్గరు సినీ ఇండస్ట్రీలో తమకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న సంగతి తెలిసిందే కదా.చిరంజీవి మెగాస్టార్‌గా రాణిస్తే.. చిన్నబ్బాయి పవన్ కళ్యాణ్ పవర్ స్టార్‌గా సత్తా చూపెడుతున్నారు. ఇక నాగబాబు నటుడిగా, నిర్మాతగా, వ్యాఖ్యాతగా తనదైన శైలిలో దూసుకుపోతున్నాడు.

chiranjeevi Pawan Kalyan send mothers day wishes
మెగా బ్రదర్స్ అందరూ కలిసి తల్లి అంజనా దేవి పేరు మీద ఓ బ్యానర్ స్టార్ట్ చేసారు. నాగబాబు ఈ బ్యానర్‌కు నిర్మాత. ఈ ప్రొడక్షన్ హౌస్‌లో నాగబాబు…మెగా హీరోలైన చిరంజీవి, పవన్ కళ్యాణ్, రామ్ చరణ్‌లతో సినిమాలు నిర్మించిన సంగతి తెలిసిందే కదా.అంజనా ప్రొడక్షన్స్ బ్యానర్‌లో తొలి సినిమా ‘రుద్ర వీణ’. ఈ సినిమాను అంజనా ప్రొడక్షన్స్ బ్యానర్‌లో కే.బాలచందర్ దర్శకత్వంలో ఈ సినిమాను తెరకెక్కించాడు. ఈ సినిమాకు జాతీయ అవార్డు వచ్చినా.. బాక్సాఫీస్ దగ్గర ఈ సినిమా సరైన ఫలితాన్ని అందుకోలేదు. ఆ తర్వా త ఈ బ్యానర్‌లో త్రినేత్రుడు, ముగ్గురు మొనగాళ్లు, బావగారూ బాగున్నారా. స్టాలిన్, గుడుంబా శంకర్, కౌరవుడు, రాధా గోపాలం, ఆరెంజ్ సినిమాలను తెరకెక్కాయి.
అమ్మలందరికీ అభివందనములు !#HappyMothersDay to All The Mothers of the World! pic.twitter.com/FNiVxdY2QL
— Chiranjeevi Konidela (@KChiruTweets) May 8, 2022