Chiranjeevi: షాకింగ్.. చిరంజీవి భార్య రెండో పెళ్లి చేసుకుంటుందా?
Chiranjeevi : చిరంజీవి అనగానే అందరికి గుర్తొచ్చే వ్యక్తి మెగాస్టార్ చిరంజీవి. అయితే కన్నడలోను చిరంజీవి అనే హీరో ఉన్నాడు. అతని పూర్తి పేరు చిరంజీవి సర్జా. కన్నడ స్టార్ చిరంజీవి సర్జా మంచి మంచి చిత్రాలు చేసి ఎంతో పేరు ప్రఖ్యాతలు పొందాడు. ఆయన కొద్ది రోజుల క్రితం గుండెపోటుతో కన్నుమూసిన విషయం తెలిసిందే. ఆయన మరణంతో ఎంతగానో కుంగిపోయింది ఆయన సతీమణి, నటి మేఘనా రాజ్. ఆ సమయంలో గర్భవతిగా ఉన్న ఆమె కొన్ని నెలల తర్వాత ఓ కుమారుడికి జన్మనిచ్చింది. తన కొడుకులోనే భర్తను చూసుకుంటూ కాలం వెళ్లదీస్తోందామె. అయితే ఆమె త్వరలో రెండో పెళ్లి చేసుకోబోతుందంటూ కొద్దికాలంగా ఊహాగానాలు ఊపందుకున్నాయి. ఈ క్రమంలో ఆమె ఈ రూమర్‌పై స్పందించింది.
రూమర్స్‌కి చెక్..
కొందరు నన్ను రెండో పెళ్లి చేసుకోమని సలహా ఇస్తున్నారు. మరి కొందరు మాత్రం నా కొడుకును బాగా చూసుకోండి… అతడితోనే ఉండమని చెపుతున్నారు. ఎవరు మాటలు వినాలి. అయిన నా భర్త చిరంజీవి నాతో ఎప్పుడు ఓక విషయం చెబుతూ ఉండేవాడు. ఈ ప్రపంచం ఏమనుకుంటుందన్నది పక్కన పెట్టేసి.. నీ మనసుకు ఏది అనిపిస్తే అదే చేయమని చెప్పేవాడని తెలిపింది. తాను మళ్లీ పెళ్లి చేసుకోవాలన్నదానిపై తనకు తాను ఎప్పుడూ ప్రశ్నించుకోలేదని.. రేపు ఏం జరుగుతుంది… తర్వాత నా జీవితం ఎలా ఉంటుందన్నది తెలియదని మేఘన చెప్పుకువచ్చింది. ఆమె మాటలలో దాగిన ఆంతర్యం గురించి అందరు ముచ్చటించుకుంటున్నారు.
కన్నడ నాట స్టార్ హీరోగా అడుగులు వేస్తున్న సమయంలోనే కేవలం 35 ఏళ్ళ వయసులో గుండెపోటుతో మరణించాడు చిరంజీవి సర్జ. భర్త చనిపోయే సమయానికి ఆమెకు కేవలం 30 ఏళ్లు మాత్రమే .పైగా కోటి ఆశలతో గర్భంతో ఉన్నపుడు.. కొండంత అండగా ఉండే భర్త కన్నుమూసాడు.పెళ్లైన రెండేళ్లకే భర్త చనిపోవడం.. ఆయన చనిపోయే సమయానికి భార్య 5 నెలల గర్భవతి కావడం కంటే దారుణమైన విషయం మరొకటి ఉండదు. ఈ రెండూ కన్నడ హీరో చిరంజీవి సర్జ భార్య మేఘన రాజ్ విషయంలో జరిగాయి.