Home » Entertainment » Chiranjeevi Selected Pawan Kalyan In Tagore Remake
Entertainment

ఆ రీమేక్‌కు పవన్ కళ్యాణ్ సెట్ అవుతాడు.. చిరు కామెంట్స్

Authored By
Admin
The Telugu News | Updated on: December 28, 2020, 3:54 pm
Advertisement

చిరంజీవి తీసిన సినిమాల్లో ప్రస్తుతం రీమేక్ చేయాల్సి వస్తే.. ఏ సినిమాను ఏ హీరో రీమేక్ చేస్తే బాగుంటుందనే విషయాన్ని చెప్పుకొచ్చాడు. సమంత ఆహా యాప్‌లో చేస్తోన్న సామ్ జామ్ షోలో చిరంజీవి తన రీమేక్ సినిమాలు సరైన హీరోలను సెలెక్ట్ చేశాడు. ఇందులో గ్యాంగ్ లీడర్’ పాత్రలో తారక్ లేదా చరణ్ కనిపిస్తే బాగుంటుందని అభిప్రాయపడ్డారు. ‘రౌడీ అల్లుడు’ సినిమాకైతే రవితేజ లేదా బన్నీ సెట్ అవుతారని చెప్పుకొచ్చాడు.

Advertisement

Chiranjeevi selected Pawan kalyan In Tagore Remake

‘ఛాలెంజ్’ సినిమాకు బన్నీ లేదా విజయ్ దేవరకొండ అయితే సూపర్ అని అన్నారు. జగదీకవీరుడు.. అతిలోకసుందరి సినిమాను రీమేక్ చేస్తే అందులో రామ్‌చరణ్ లేదా మహేష్ బాబు బాగా సెట్ అవుతారని చెప్పిన మెగాస్టార్.. ఇందులో అతిలోక సుందరిగా సమంత మాత్రమే కనిపించాలని అన్నారు. సామ్ జామ్ ఆడియెన్స్ అందరూ అతిలోక సుందరిగా తన పేరును ఆలస్యంగా చెప్పడంతో బుగ్గమూతి పెట్టుకుంది.

Advertisement

‘ఇంద్ర’ సినిమాకు ప్రభాస్ సూట్ అవుతాడని, అలాగే ‘ఠాగూర్’ సినిమా పవన్ కళ్యాణ్ చేస్తే బాగుంటుందని చెప్పారు చిరు. అయితే తన ‘స్వయం కృషి’ మూవీ మాత్రం ఎవ్వరికీ సెట్ కాదని తాను మాత్రమే పోషించగలనని చెప్పుకొచ్చాడు. అందరి హీరోల పేర్లు చెప్పిన చిరు.. నాగ చైతన్యకు ఏ సినిమాకు ఎంచుకోలేదు. దీంతో చిరు చొరవ దీసుకుని.. అందరి హీరోల పేర్లు చెప్పాను కానీ నాగ చైతన్య పేరు చెప్పలేదు కదా.. ‘విజేత’ సినిమాలో పాత్ర నాగచైతన్యకు బాగా సూట్ అవుతుందని చెప్పుకొచ్చాడు.

Admin

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి