మెగా ఫ్యామిలీలో ఉండే రిలేషన్స్ అందరికీ తెలిసిందే. మెగా బ్రదర్స్, వారి పిల్లలు, మనవరాళ్లు కలిస్తే అక్కడ రచ్చ ఎలా ఉంటుందో అందరికీ తెలిసిందే. ఇక నాగబాబు చిరంజీవి బంధం గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అన్న కోసం నిలబడే తమ్ముడు.. తమ్ముడి కోసం నిలబడే అన్నగా నాగబాబుకు మంచి ఇమేజ్ ఉంది. ఇక నిహారిక వరుణ్ తేజ్ రామ్ చరణ్ సుష్మిత శ్రీజలు ఎంత చక్కగా కలిసి ఉంటారో అందరికీ తెలిసిందే.
మరీ ముఖ్యంగా నిహారికకు చిరంజీవికి ఉన్న ప్రత్యేక బంధం ఉంది. నాగబాబును నాన్నగా చిరంజీవిని డాడీగా నిహారిక సంబోధిస్తుంది. చిన్న తనం నుంచి చిరంజీవి ఇంట్లోనే ఉండటం, ఉమ్మడి కుటుంబం అవ్వడంతో మరింత దగ్గరయ్యారు. చిన్నతనంలో రామ్ చరణ్ శ్రీజ సుష్మితలతో కలిసి పెరిగిన నిహారిక.. వారు పిలిచినట్టు చిరంజీవిని డాడీగా పిలిచేది. అలా నిహారికపై చిరంజీవికి కూడా వల్లమాలిన ప్రేమఉంది.
నిహారిక పెళ్లి సందర్భంగా.. చిరంజీవి చేసిన పోస్ట్ అందర్నీ కదిలించింది. మా చేతిలో పెరిగిన మా చిన్నారి నిహారికని చైతన్య చేతిలో పెడుతున్న ఈ శుభ తరుణంలో ముందస్తుగా కాబోయే దంపతులకు నా శుభాకాంక్షలు ఆశీస్సులు.. గాడ్ బ్లెస్ యూ అంటూ చిన్నతనంలో నిహారికను ఎత్తుకున్న ఫోటోను, తాజాగా దిగిన సెల్పీని షేర్ చేశాడు. ప్రస్తుతం నిహారిక పెళ్లి వేడుకల్లో మెగా అల్లు ఫ్యామిలీలు రచ్చ చేస్తున్నారు. డిసెంబర్ 9న జరగబోయే పెళ్లి వేడుకల్లో అందరూ సందడి చేసేందుకు రెడీ అయ్యారు. నిన్న రాత్రి ఉదయ్ పూర్‌లోని ఉదయ్ విలాస్ ప్యాలెస్‌లో సంగీత్ వేడుకలు గ్రాండ్‌గా నిర్వహించారు.
Passports : పాస్‌పోర్ట్ అత్యంత ముఖ్యమైన ప్రయాణ పత్రాలలో ఒకటి. అంతర్జాతీయ ప్రయాణాన్ని ధృవీకరించడమే కాకుండా, పాస్‌పోర్ట్ గుర్తింపు మరియు…
Mahakumbh Mela : ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్ మహాకుంభమేళా 2025 ఉత్సవాలకు సిద్ధమవుతుంది. 13 జనవరి 2025న ప్రయాగ్‌రాజ్‌లో కుంభమేళా నిర్వహించబడుతుంది.…
Ola Electric : ప్రభుత్వ విచారణ మరియు పెరుగుతున్న నష్టాల మధ్య వివాదాల్లో కూరుకుపోయిన ఓలా ఎలక్ట్రిక్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా…
YSR Congress Party : ఆంధ్రప్రదేశ్ పంపిణీ కంపెనీలు (డిస్కమ్‌లు) మరియు అదానీ గ్రూప్ మధ్య ప్రత్యక్ష ఒప్పందం లేదని…
Hair Tips : ప్రస్తుత కాలంలో చాలామందికి జుట్టు చివరలు చిట్లిపోయి నిర్జీవంగా మారిపోతాయి. దీంతో వెంట్రుకలు అనేవి ఊడిపోతూ…
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ సీజన్ 8 చివరి దశకు రానే వచ్చింది. మూడు వారాలలో…
Winter : చలికాలం రానే వచ్చేసింది. రోజురోజుకి చెల్లి ముదిరిపోతుంది. ఈసారి నవంబర్ నెలలోనే చలి మొదలైంది. ఇక ముందు ముందు…
Ind Vs Aus : సొంత గడ్డపై న్యూజిలాండ్ టీం అద్భుతంగా రాణించి భారత జట్టుని వైట్ వాష్ చేసింది.…
This website uses cookies.