Home » Entertainment » Chiranjeevi Venkatesh Postponed Their Movies When Uday Kiran Movie Releasing
Entertainment

Uday Kiran : చిరంజీవి, వెంక‌టేష్‌ల‌నే ఉద‌య్ కిర‌ణ్ వ‌ణికించాడా?

Authored By
Sam C
The Telugu News | Published on: September 20, 2022, 1:30 pm
Advertisement

Uday Kiran : ఒక‌ప్పుడు ల‌వ‌ర్ బాయ్‌గా అమ్మాయిల గుండెల్లో చుర‌క‌త్తులు లాంటి సూదులు దింపిన న‌టుడు ఉద‌య్ కిర‌ణ్‌. చాలా హ్యాండ్స‌మ్‌గా ఉండే ఉద‌య్ కిర‌ణ్ ఎమోష‌న‌ల్ సీన్స్‌లో అద్భుతంగా న‌టించి ప్ర‌తి ఒక్క‌రిని ఏడిపిస్తాడు. ఉద‌య్ కిర‌ణ్ బ్ర‌తికి ఉంటే ఇండ‌స్ట్రీలో ఓ స్థాయిలో ఉండేవార‌ని అనుకుంటూ ఉంటారు. ఇక ఉద‌య్ కిర‌ణ్ తో క‌లిసి ప‌నిచేసిన న‌టీన‌టులు ఏ ఇంట‌ర్వ్యూకు వెళ్లినా ఆయ‌న గురించి ఆస‌క్తిక‌ర విష‌యాల‌ను చెబుతుంటారు. నటించిన కొన్ని సినిమాలతోనే ఎంతో మంచి ఫ్యాన్ బేస్ ని కూడా సంపాదించుకున్న ఉదయ్ కిరణ్ ఈరోజు మన మధ్యలో లేకపోవడం దురదృష్టకరం. ఆయ‌న భౌతికంగా మ‌న మధ్య‌న లేక‌పోయిన సినిమాల ద్వారా ఇప్ప‌టికీ మ‌న మ‌న‌సుల్లో చిర‌స్థాయిగా నిలిచి ఉన్నాడు.

Advertisement

Uday Kiran : భ‌య‌పెట్టించాడుగా…

ఉద‌య్ కిరణ్ త‌న కెరీర్ మొద‌ట్లో పెద్ద పెద్ద స్టార్ హీరోల‌నే వ‌ణికించాడు. తమిళంలో కూడా అతనికి మంచి ఆదరణ వచ్చింది. ఇక ఆ తర్వాత వ్యక్తిగత సమస్యలతో కెరీర్ లో ఇబ్బందులు ఎదుర్కొన్నాడు ఉదయ్ కిరణ్. చిత్రం, నువ్వు నేను, మనసంతా నువ్వే చిత్రాలతో ఒక్కసారిగా ఆయన స్టార్ ఇమేజ్ వచ్చింది. చిరంజీవి, వెంకటేష్, బాలకృష్ణ, నాగార్జున వంటి హీరోలు కూడా అతని దెబ్బకు సినిమాలను వాయిదా వేసుకున్నారు. 2001లో ఉదయ్ కిరణ్ నువ్వు నేను హిట్ తో మంచి ఫాంలో ఉన్నాడు. అదే స‌మ‌యంలో చిరు వ‌రుస ఫ్లాపుల‌లో మునిగి తేలుతున్నాడు.

Chiranjeevi Venkatesh Postponed Their Movies When Uday Kiran Movie Releasing

Advertisement

ఇక వెంకటేష్ కు కూడా ఉదయ కిరణ్ తో కాస్త ఇబ్బంది వచ్చింది. దేవీ పుత్రుడు, ప్రేమతో రా సినిమాలు షాక్ ఇచ్చాయి. ఇదే సమయంలో మనసంతా నువ్వే సినిమాతో ఉదయ్ కిరణ్ లైన్ లోకి వచ్చాడు. సెప్టెంబర్ రెండవ వారంలో ఆ సినిమాను విడుదల చేయాలని భావించారు. కాని నువ్వు నాకు నచ్చావ్ సినిమా సెప్టెంబర్ ఆరున విడుదల అవుతుందని, మ‌న‌సంతా నువ్వేని కాస్త వెన‌క్కు జ‌ర‌పాలని కోరారు. దాంతో ఎంఎస్ రాజు 20 లేదా 27 న విడుదల చేయడానికి రెడీ అయ్యారు. అదే సమయంలో చిరంజీవి డాడీ సినిమాను అక్టోబర్ 4 న విడుదల చేయడానికి రెడీ అయ్యారు. ఉదయ్ కిరణ్ సినిమా హిట్ అయితే డాడీ సినిమాకు ఇబ్బంది క‌దా అని భావించి ఈ చిత్రం త‌ర్వాత రిలీజ్ చేయ‌మ‌ని కోర‌గా, దానికి ఎంఎస్ రాజు ఓకే చెప్పాడు. అలా వెంకీ, చిరు సినిమాల త‌ర్వాత విడుద‌లైన మ‌న‌సంతా నువ్వే పెద్ద హిట్ సాధించి భారీ వ‌సూళ్ల‌ని సాధించింది.

Sam C

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి