Chiranjeevi vs Mohan babu : టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవికి అరుదైన గౌరవం దక్కిన విషయం తెలిసిందే. 2024 పద్మ పురస్కారాల్లో భాగంగా కేంద్ర ప్రభుత్వం దేశ రెండో అత్యున్నత పౌర పురస్కారం పద్మ విభూషణ్ కు చిరంజీవిని ఎంపిక చేసింది. దీంతో చిరంజీవికి సినీ, రాజకీయ ప్రముఖులు శుభాకాంక్షలు తెలిపారు. ఇక చిరంజీవి అభిమానులతో మాట్లాడారు. రిపబ్లిక్ డే నా జీవితంలో ప్రత్యేకతను సంతరించుకుందని పద్మ విభూషణ్ రావటం చాలా సంతోషం అని అన్నారు. 45 సంవత్సరాల సినీ ఇండస్ట్రీలో కళామతల్లికి సేవ చేసుకోవడం ఆర్టిస్టులకు ఏదైనా విపత్తు వచ్చిన ఆదుకోవడం లాంటి సామాజిక సేవ చేస్తూ వచ్చాను.
సామాజిక సేవ ప్రతి ఒక్కరి బాధ్యత. ప్రస్తుతం రాష్ట్రంలో రక్తం కొరత లేకుండా ఉంది నేను స్థాపించిన బ్లడ్ బ్యాంక్ ఎంతోమందికి సేవ చేస్తున్నా. ఇదంతా నా అభిమానుల వల్లనే జరిగింది అని అన్నారు. నా బ్లడ్ బ్రదర్స్ బ్లడ్ సిస్టర్స్ అందరికీ రుణపడి ఉంటాను అని ఇదే స్ఫూర్తితో సామాజిక సేవ చేస్తూ ఉంటాను. ఇక 2006లో పద్మభూషణ్ అవార్డు వచ్చింది. ఇక ఇప్పుడు నా కళా సేవను సామాజిక సేవను గుర్తించి పద్మ విభూషణ్ కేంద్ర ప్రభుత్వానికి, ప్రధాని మోడీ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అని చిరంజీవి అన్నారు. అలాగే పద్మ అవార్డు గ్రహీతలందరికీ నా హృదయపూర్వక అభినందనలు అని చిరంజీవి తెలిపారు.
ఇక సినీ ఇండస్ట్రీలో చిరంజీవి మోహన్ బాబు చిరకాల స్నేహితులు అన్న విషయం తెలిసిందే. అయితే గత కొన్నేళ్లుగా వీరిద్దరి మధ్య గొడవలు జరుగుతున్నాయని వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. అయితే తాజాగా చిరంజీవికి పద్మ విభూషణ్ అవార్డు వచ్చిన సందర్భంగా మోహన్ బాబు స్పందించారు. నా ప్రియమిత్రుడు చిరంజీవికి అభినందనలు. ఈ పురస్కారానికి చిరంజీవి అన్ని విధాల అర్హుడు. నువ్వు ఈ అవార్డు అందుకోబోతున్నందుకు మేము ఎంతో గర్విస్తున్నామని ట్విట్టర్ వేదికగా మోహన్ బాబు వెల్లడించారు. వీరిద్దరి మధ్య గొడవలు లేవని తెలుస్తుంది కానీ ఒకానొక టైంలో వీరిద్దరి మధ్య గొడవలు జరిగాయి అన్నది వాస్తవం. ఇద్దరి మధ్య ఎన్ని గొడవలు ఉన్నా పబ్లిక్ గా ఇద్దరు మంచిగా ఉంటారని తెలుస్తుంది.
Passports : పాస్‌పోర్ట్ అత్యంత ముఖ్యమైన ప్రయాణ పత్రాలలో ఒకటి. అంతర్జాతీయ ప్రయాణాన్ని ధృవీకరించడమే కాకుండా, పాస్‌పోర్ట్ గుర్తింపు మరియు…
Mahakumbh Mela : ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్ మహాకుంభమేళా 2025 ఉత్సవాలకు సిద్ధమవుతుంది. 13 జనవరి 2025న ప్రయాగ్‌రాజ్‌లో కుంభమేళా నిర్వహించబడుతుంది.…
Ola Electric : ప్రభుత్వ విచారణ మరియు పెరుగుతున్న నష్టాల మధ్య వివాదాల్లో కూరుకుపోయిన ఓలా ఎలక్ట్రిక్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా…
YSR Congress Party : ఆంధ్రప్రదేశ్ పంపిణీ కంపెనీలు (డిస్కమ్‌లు) మరియు అదానీ గ్రూప్ మధ్య ప్రత్యక్ష ఒప్పందం లేదని…
Hair Tips : ప్రస్తుత కాలంలో చాలామందికి జుట్టు చివరలు చిట్లిపోయి నిర్జీవంగా మారిపోతాయి. దీంతో వెంట్రుకలు అనేవి ఊడిపోతూ…
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ సీజన్ 8 చివరి దశకు రానే వచ్చింది. మూడు వారాలలో…
Winter : చలికాలం రానే వచ్చేసింది. రోజురోజుకి చెల్లి ముదిరిపోతుంది. ఈసారి నవంబర్ నెలలోనే చలి మొదలైంది. ఇక ముందు ముందు…
Ind Vs Aus : సొంత గడ్డపై న్యూజిలాండ్ టీం అద్భుతంగా రాణించి భారత జట్టుని వైట్ వాష్ చేసింది.…
This website uses cookies.