Bigg Boss Telugu 7 : నాలుగో వారం తేజ ఔట్.. నామినేషన్లలోకి వచ్చేశాడు.. ప్రశాంత్ సేఫ్

Authored By Breaking News 2 | The Telugu News | Published on: September 27, 2023, 12:00 pm

Bigg Boss Telugu 7 : నాలుగో వారం నామినేషన్లు బిగ్ బాస్ హౌస్ లో చాలా వాడీవేడీగా జరిగాయి. నాలుగో వారం నామినేషన్లలో బిగ్ బాస్ సరికొత్త పద్ధతిని అవలంభించాడు. హౌస్ మెట్స్ గా ఉన్న ఇంటి సభ్యులు జ్యూరీ సభ్యులుగా ఉండి వాళ్లు నామినేట్ అయిన వాళ్లలో ఎవరికి బలంగా కారణాలు ఉంటే వాళ్లను గిల్టీగా ఎన్నుకోవాల్సి ఉంటుంది. అయితే.. ఈ సారి నామినేషన్లు మామూలుగా జరగలేదు. రచ్చ రచ్చ చేశారు. నాలుగో వారం నామినేషన్లు బిగ్ బాస్ చరిత్రలోనే ఒక రికార్డు క్రియేట్ చేశాయి అని చెప్పుకోవచ్చు. చాలామంది ప్రశాంత్ ను, గౌతమ్, అమర్ దీప్, రతిక, శుభశ్రీని టార్గెట్ చేశారు. తేజ విషయంలో ఇద్దరు ముగ్గురు నామినేట్ చేసినా కూడా సరైన కారణాలు చెప్పలేకపోయారు. దీంతో నామినేషన్ల నుంచి తేజ బయటపడ్డాడు.

teja to be eliminated in fourth week in bigg boss telugu 7

#image_title

కానీ.. హౌస్ మెట్స్ స్పెషల్ పవర్ ఉపయోగించి.. ముగ్గురు కలిసి ఒక కంటెస్టెంట్ ను నామినేట్ చేయాలని బిగ్ బాస్ చెప్పడంతో తేజను నామినేట్ చేశారు. సేవ్ అయిన వాళ్లు ప్రశాంత్, అమర్ దీప్, తేజ ఈ ముగ్గురూ ఉండగా ఈ ముగ్గురిలో ఒకరిని నేరుగా నామినేట్ చేయాలని బిగ్ బాస్ చెబుతాడు. దీంతో ముగ్గురు కలిసి నిర్ణయం తీసుకొని తేజ పేరు చెబుతారు. దీంతో తేజ షాక్ అవుతాడు.

Bigg Boss Telugu 7 : మూడో వారమే ఎలిమినేట్ కావాల్సిన తేజ

నిజానికి తేజ మూడో వారమే ఎలిమినేట్ కావాల్సి ఉంది. నామినేట్ అయినా కూడా తేజ సేవ్ అయ్యాడు. దానికి కారణం.. అమర్ దీప్ ను నామినేషన్లలోకి తీసుకొని తేజను సేవ్ చేస్తారు. లేకపోతే తేజ నామినేషన్లలో ఉండి ఉంటే మూడో వారం పక్కా ఎలిమినేట్ అయ్యేవాడు. కానీ.. మూడో వారం నామినేషన్ల నుంచి తప్పుకోవడంతో దామిని ఎలిమినేట్ అయింది. తేజ ఎలిమినేట్ అయి ఉంటే ఖచ్చితంగా దామిని సేవ్ అయి ఉండేది. ఏది ఏమైనా.. మూడో వారం ఎవరైతే తేజను సేవ్ చేశారో.. ఇప్పుడు వాళ్లే తేజను నామినేట్ చేశారు. నిజానికి నాలుగో వారం నామినేషన్లలో ప్రియాంక, రతిక, యావర్, శుభశ్రీ, గౌతమ్, తేజ ఈ ఆరుగురు ఉన్నారు. ఇందులో యావర్ కి బాగానే ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఆయన ఖచ్చితంగా సేవ్ అవుతాడు. ఇక ప్రియాంక, గౌతమ్ కూడా ఈజీగానే సేవ్ అవుతారు. రతిక, శుభశ్రీ, తేజ.. ఈ ముగ్గురు మాత్రం చివరి మూడు స్థానాల్లో ఉంటారు. రతిక మూడో ప్లేస్ లో ఉన్నా.. శుభశ్రీ, తేజ ఇద్దరిలో ఒకరు మాత్రం ఖచ్చితంగా ఈ వారం ఎలిమినేట్ అవుతారు అని బిగ్ బాస్ అభిమానులు ఇప్పటి నుంచే లెక్కలు వేస్తున్నారు.

Breaking News 2

No bio available for this author.

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp