Fish Venkat Prabhas : ఫిష్ వెంకట్‌కి ప్రభాస్ సాయం.. వార్తలపై అసలు క్లారిటీ ఇదే..!
ప్రధానాంశాలు:
Fish Venkat Prabhas : ఫిష్ వెంకట్‌కి ప్రభాస్ సాయం.. వార్తలపై అసలు క్లారిటీ ఇదే..!
Fish Venkat Prabhas : పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రముఖ టాలీవుడ్ నటుడు ఫిష్ వెంకట్ వైద్యానికి ఆర్థిక సాయం అందించనున్నట్టు అనేక వార్తలు వచ్చాయి. వాటిని ప్రభాస్ టీం ఖండించింది. తాము ఎవరము కాల్ చేయలేదని, ఏదైన ఉంటే మీడియా ద్వారా తెలియజేస్తాము అని వారు వివరణ ఇచ్చారట.

Fish Venkat Prabhas : ఫిష్ వెంకట్‌కి ప్రభాస్ సాయం.. వార్తలపై అసలు క్లారిటీ ఇదే..!
Fish Venkat Prabhas : అవి అవాస్తవాలు..
గత కొంతకాలంగా కమెడియన్, యాక్టర్ ఫిష్ వెంకట్ తీవ్ర అనారోగ్యంతో బాధ పడుతున్నారు. కొద్ది రోజులుగా పరిస్థితి విషమంగా ఉంది. ప్రస్తుతం బోడుప్పల్‌లోని ఆర్బీఎం ఆస్పత్రిలో వెంకటే చికిత్స తీసుకుంటున్నారు. ఆయనకు కిడ్నీ మార్పిడి చేయాల్సి ఉండగా… ఆపరేషన్‌కు రూ.50 లక్షల వరకూ ఖర్చవుతుందని ఎవరైనా దాతలు సాయం చేయాలని ఆయన కుమార్తె స్రవంతి వేడుకున్నారు.
ఫిష్ వెంకట్ దీన స్థితిపై ప్రభాస్ స్పందించినట్టు వార్తలు వచ్చాయి. ఆయనకు సాయం చేసేందుకు ముందుకొచ్చారని, ఆపరేషన్‌కు కావాల్సిన ఆర్థిక సాయం అందిస్తామని చెప్పినట్లు వెంకట్ కుమార్తె స్రవంతి తెలిపారని అన్నారు. ‘కిడ్నీ డోనర్ ఉంటే ఏర్పాట్లు చేసుకోండి. ఆపరేషన్‌కు కావాల్సిన డబ్బు ఏర్పాటు చేస్తాం అని ప్రభాస్ అసిస్టెంట్ కాల్ చేసినట్లు చెప్పుకురాగా, అవన్నీ ఫేక్ తేలిపోయింది.