Samantha : సమంత రెండో పెళ్లిపై వచ్చిన క్లారిటీ .. వరుడెవరు?
Samantha : నాగచైతన్య నుండి విడాకులు తీసుకున్న తర్వాత సమంతకు సంబంధించి వస్తున్న పుకార్లు అన్నీ ఇన్నీ కావు. ఆమె గురించి ఏవోవో వార్తలు వస్తున్నాయి. సమంత రెండో వివాహానికి సిద్ధమైంది అన్నట్లుగా కొద్ది రోజులుగా ప్రచారం జరుగుతుంది. తమిళనాడుకు చెందిన ఒక వ్యాపారవేత్తతో ఆమె రెండో పెళ్లి చేసుకునేందుకు సిద్ధమైందని, దీనికి ఆమె బాగా విశ్వసించే ఆధ్యాత్మిక గురువు జగ్గీ వాసుదేవ్ కారణమయ్యారని తెలుస్తోంది. సమంత మొదటి పెళ్లి పెటాకులయి ఇబ్బంది పడుతున్న సమయంలో ఆయన సమంతకు ఆధ్యాత్మికంగా కొన్ని మంచి విషయాలు చెప్పి ప్రేరేపించారని, దీంతో సమంతకు రెండో వివాహం చేసుకోవాలని కూడా ఆయనే సలహా ఇచ్చారనే ప్రచారం జరుగుతోంది.
Samantha : అన్నీ పుకార్లే..
అయితే ఇవన్నీ పుకార్లేనని.. అసలు సమంత పెళ్లికి సద్గురుకి సంబంధమే లేదని ఆమె సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి. ప్రస్తుతం అనారోగ్య కారణాలు ఉండటంతో.. వాటి నుంచి కోలుకున్న తరువాత ఫుల్ ఫోకస్ సినిమాలపై పెడుతుందట. పెళ్లి గురించి ఆలోచనే లేదని అంటున్నారు. అవన్నీ గాసిప్స్ మాత్రమే అని సన్నిహితులు కొట్టి పారేస్తున్నారు. ఏ మాయ చేసావే సినిమాలో నాగచైతన్య సమంత ఇద్దరికీ స్నేహం ఏర్పడగా, ఆ స్నేహం ప్రేమగా మారి ఇద్దరూ తమ పెద్దలను ఒప్పించి వివాహం కూడా చేసుకున్నారు.
అయితే వీరి వివాహం మూన్నాళ్ల ముచ్చటగానే ముగిసిపోయింది. గత ఏడాది అక్టోబర్ నెలలో సమంత-నాగచైతన్య విడాకులు తీసుకుంటున్నట్లుగా అధికారికంగా ప్రకటించారు. అయితే ఈ మధ్యకాలంలో నాగచైతన్య హీరోయిన్, శోభిత దూళిపాళ్లతో ప్రేమాయణం నడుపుతున్నాడని రెండో వివాహం చేసుకునే అవకాశం ఉందని ప్రచారం జరిగింది. చాలా కాలానికి ఆ ప్రచారం సమసిపోయింది కూడా. ఇక సమంత నటించిన ‘శాకుతలం’ సినిమా నవంబర్ 4 ప్రపంచ వ్యాప్తంగా విడుదల కాబోతుంది. హిస్టారికల్ మూవీస్ డైరెక్టర్‌గా పేరొందిన గుణ శేఖర్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రంలో దుష్యంత మహారాజుగా దేవ్ మోహన్ నటించారు.