Jabardasth : మరి కొన్ని నెలలు అయితే జబర్దస్త్ కామెడీ కార్యక్రమం ఈటీవీలో ప్రారంభం అయ్యి పది సంవత్సరాలు అవ్వబోతుంది. ఈ పదేళ్ల కాలంలో ఎనిమిది సంవత్సరాల పాటు జబర్దస్త్ కార్యక్రమం అద్బుతమైన రేటింగ్ ను దక్కించుకుంది. జబర్దస్త్ కు గత ఏడాదిన్నర కాలంగా గడ్డు పరిస్థితి ఎదుర్కొంటుంది. ఇలాంటి సమయంలో రోజా కు మంత్రి పదవి రావడంతో ఆమె వెళ్లి పోయింది. జబర్దస్త్ నుండి బయటకు ఆమె వెళ్లడంతో టీమ్స్ అన్ని కూడా చిన్నా భిన్నం అవుతున్నాయి అంటూ అభిమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
సోషల్ మీడియాలో ఒకప్పుడు జబర్దస్త్ గురించి గొప్పగా చర్చించుకునే వారు. కాని ఇప్పుడు ఎక్కువగా ఆ టీమ్ లీడర్ ఎక్కడ ఉన్నాడు.. ఈ టీమ్ లీడర్ ఎక్కడ ఉన్నాడు.. ఆయన ఏ షో లో కనిపించబోతున్నాడు.. ఈయన ఏ షో కు వెళ్తున్నాడు అనేదే ఎక్కువగా చర్చ జరుగోతోంది. మొత్తానికి సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున జబర్దస్త్ గురించి జరుగుతుంది. ఒకప్పుడు జబర్దస్త్ అంటే చాలా గౌరవంగా చూసే వారు ఇప్పుడు చాలా లైట్ తీసుకుంటున్నారు. దానికి తోడు స్టార్ మా లో కామెడీ స్టార్స్ కు మెల్ల మెల్లగా మంచి రేటింగ్ నమోదు అవుతుంది.
రోజా వెళ్లి పోయిన తర్వాత టీమ్స్ లో యూనిటి కూడా మిస్ అయ్యిందట. ఒకరి పై ఒకరు పై చేయి కోసం ప్రయత్నాలు చేయడం.. ఎవరికి ఇష్టం వచ్చినట్లుగా వారు స్క్రిప్ట్ రాసుకోవడం.. స్కిట్ విషయంలో తమదే పై చేయి అవ్వాలంటూ డైరెక్షన్ టీమ్ మాటలు కూడా వినక పోవడం వంటివి ఇప్పుడు జబర్దస్త్ టీమ్ లో కనిపిస్తుంది. విశ్వసనీయంగా అందుతున్న సమాచారం ప్రకారం జబర్దస్త్ ప్రస్తుతం రెండు ఎపిసోడ్ లుగా వస్తుంది కాని అతి త్వరలోనే ఒక్క ఎపిసోడ్ గా మారే అవకాశం ఉంది. అంటే ఎక్స్ ట్రా జబర్దస్త్ షో మాయం అయ్యే అవకాశాలు ఉన్నాయంటున్నారు.
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ సీజన్ 8 రసవత్తరంగా సాగుతుంది. ఈ వారం మొత్తం ఆరుగురు…
Banana Peel : సాయంత్రం అయ్యింది అంటే చాలు దోమలు బేడద ఎక్కువగా ఉంటుంది. ఈ దోమలు గుయ్యిమంటూ శబ్దం చేస్తూ…
Farmers And Woman : ఏపీ ప్రభుత్వం బడ్జెట్ లో రైతులు, మహిళలు, పిల్లల సంక్షేమానికి సంబందించి గణనీయమైన కేటాయింపులు…
Skin Care : మహిళలు తమ అందానికి ఎంతో ప్రాముఖ్యత ఇస్తారు. అలాగే ముఖంపై ఎటువంటి మచ్చలు మరియు పింపుల్స్…
Mega Heroes : అల్లు అర్జున్ నంద్యాల వెళ్లివచ్చినప్పటి నుంచి అల్లు మెగా ఫ్యాన్స్ మధ్య ఫైట్ తెలిసిందే. సోషల్…
Ghee Coffee : ప్రస్తుత కాలంలో నెయ్యి కాఫీ బాగా ట్రెండ్ అవుతుంది. ఇప్పుడు చాలా మంది ఈ నెయ్యి కాఫీ…
Karthika Pournami : హిందువులు జరుపుకునే ముఖ్యమైన పండుగలలో కార్తీక పౌర్ణమి ఒకటి. పౌర్ణమి రోజున చంద్రుడు పూర్తి ప్రకాశంతో…
Technician Vacancies : ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ, మెదక్ (OFMK) జూనియర్ మేనేజర్, డిప్లొమా టెక్నీషియన్, అసిస్టెంట్ & జూనియర్ అసిస్టెంట్…
This website uses cookies.