Jabardasth : జబర్దస్త్ టీమ్స్ అన్నీ చిన్నాభిన్నం… ఎవరు ఎక్కడున్నారో!
Jabardasth : మరి కొన్ని నెలలు అయితే జబర్దస్త్ కామెడీ కార్యక్రమం ఈటీవీలో ప్రారంభం అయ్యి పది సంవత్సరాలు అవ్వబోతుంది. ఈ పదేళ్ల కాలంలో ఎనిమిది సంవత్సరాల పాటు జబర్దస్త్ కార్యక్రమం అద్బుతమైన రేటింగ్ ను దక్కించుకుంది. జబర్దస్త్ కు గత ఏడాదిన్నర కాలంగా గడ్డు పరిస్థితి ఎదుర్కొంటుంది. ఇలాంటి సమయంలో రోజా కు మంత్రి పదవి రావడంతో ఆమె వెళ్లి పోయింది. జబర్దస్త్ నుండి బయటకు ఆమె వెళ్లడంతో టీమ్స్ అన్ని కూడా చిన్నా భిన్నం అవుతున్నాయి అంటూ అభిమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
సోషల్ మీడియాలో ఒకప్పుడు జబర్దస్త్ గురించి గొప్పగా చర్చించుకునే వారు. కాని ఇప్పుడు ఎక్కువగా ఆ టీమ్ లీడర్ ఎక్కడ ఉన్నాడు.. ఈ టీమ్ లీడర్ ఎక్కడ ఉన్నాడు.. ఆయన ఏ షో లో కనిపించబోతున్నాడు.. ఈయన ఏ షో కు వెళ్తున్నాడు అనేదే ఎక్కువగా చర్చ జరుగోతోంది. మొత్తానికి సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున జబర్దస్త్ గురించి జరుగుతుంది. ఒకప్పుడు జబర్దస్త్ అంటే చాలా గౌరవంగా చూసే వారు ఇప్పుడు చాలా లైట్ తీసుకుంటున్నారు. దానికి తోడు స్టార్ మా లో కామెడీ స్టార్స్ కు మెల్ల మెల్లగా మంచి రేటింగ్ నమోదు అవుతుంది.

clashes in etv jabardasth comedy show teams
రోజా వెళ్లి పోయిన తర్వాత టీమ్స్ లో యూనిటి కూడా మిస్ అయ్యిందట. ఒకరి పై ఒకరు పై చేయి కోసం ప్రయత్నాలు చేయడం.. ఎవరికి ఇష్టం వచ్చినట్లుగా వారు స్క్రిప్ట్ రాసుకోవడం.. స్కిట్ విషయంలో తమదే పై చేయి అవ్వాలంటూ డైరెక్షన్ టీమ్ మాటలు కూడా వినక పోవడం వంటివి ఇప్పుడు జబర్దస్త్ టీమ్ లో కనిపిస్తుంది. విశ్వసనీయంగా అందుతున్న సమాచారం ప్రకారం జబర్దస్త్ ప్రస్తుతం రెండు ఎపిసోడ్ లుగా వస్తుంది కాని అతి త్వరలోనే ఒక్క ఎపిసోడ్ గా మారే అవకాశం ఉంది. అంటే ఎక్స్ ట్రా జబర్దస్త్ షో మాయం అయ్యే అవకాశాలు ఉన్నాయంటున్నారు.